Hero Movie Review: హీరో మూవీ యూఎస్ ప్రీమియర్ షో రివ్యూ ..కృష్ణ, మహేష్ ఫ్యాన్స్ కి కౌబాయ్ ట్రీట్
ఒక్క రోజు ముందే మహేష్‌బాబు `హీరో` సినిమా రివ్యూ ఇచ్చారు. తాను చూశానని, సినిమా బాగుందని చెప్పారు. మరోవైపు శుక్రవారం రాత్రి నుంచే యూఎస్‌లో ప్రీమియర్స్ షో పడ్డాయి. భారీ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీమియర్స్ షో టాక్ ఎలా ఉంది. అక్కడి ఆడియెన్స్ సినిమాని మెచ్చారా? లేదా అనేది ` ప్రీమియర్ షో రివ్యూ`లో తెలుసుకుందాం.
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వస్తోన్న మరో హీరో గల్లా అశోక్. మాజీ మంత్రి గల్లా అరుణ మనవడు, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు, మహేష్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్. ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం `హీరో`. యూత్‌లో భారీ క్రేజ్ ఉన్న నిధి అగర్వాల్ ఇందులో కథానాయికగా నటించి సినిమాపై క్రేజ్ పెరగడానికి మరో కారణం. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా శనివారం(జనవరి 15) విడుదలైంది. Hero movie Review
ఒక్క రోజు ముందే మహేష్‌బాబు సినిమా రివ్యూ ఇచ్చారు. తాను చూశానని, సినిమా బాగుందని చెప్పారు. మరోవైపు శుక్రవారం రాత్రి నుంచే యూఎస్‌లో ప్రీమియర్స్ షో పడ్డాయి. భారీ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీమియర్స్ షో టాక్ ఎలా ఉంది. అక్కడి ఆడియెన్స్ సినిమాని మెచ్చారా? లేదా అనేది ` ప్రీమియర్ షో రివ్యూ`(Hero Movie US Premiers Show Review)లో తెలుసుకుందాం.
ప్రీమియర్ షోస్ టాక్.. మహేష్‌బాబు, రామ్ చరణ్, రానాలకు స్పెషల్ థ్యాంక్స్ తో సినిమా ప్రారంభమైంది. కూల్‌గా, స్టయిలీష్‌గా హీరో గల్లా అశోక్(Ashok Galla) ఎంట్రీ ఇచ్చారు. ట్రైన్ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. అయితే సూపర్‌స్టార్ కృష్ణ కౌబాయ్ ఫిల్మ్ మోసగాళ్లకి మోసగాడు, మహేష్ నటించి `టక్కరి దొంగ`లో వారి గెటప్‌లను ఫాలో అవుతూ కౌబాయ్‌గా హీరో ఎంట్రీ ఇవ్వడం హైలైట్‌గా నిలిచిందట. ఇంట్రడక్షన్ అదిరిపోయింది.
ఇందులో అర్జున్ పాత్రలో అశోక్ గల్లా కనిపిస్తారు. నిధి.. సుబ్బు పాత్రలో కనిపిస్తుంది. వీరిద్దరు అపార్ట్ మెంట్‌లో ఉండే నెయిబర్స్. ఇద్దరు లవ్‌లో ఉంటారు. అర్జున్‌కి సినిమా హీరో కావాలని ఉంటుంది. వరుసగా ఆడిషన్స్ ఇస్తుంటారు. దర్శకుడిగా అనిల్ రావిపూడి గెస్ట్ అప్పియరెన్స్ కాస్త మెరిపించేలా ఉంది. ఆ తర్వాత ర్యాప్ సాంగ్, డాన్సులు ఆకట్టుకునేలా ఉన్నాయి.
అర్జున్‌కి గన్ తప్పుగా పంపబడుతుంది. అక్కడితో అసలు కథ స్టార్ట్ అవుతుంది. అనుకోని సమస్య తలెత్తడంతో అర్జున్, ఆయన ఫ్రెండ్ సత్య పరిగెడతారు. ఓ ట్విస్ట్ తో ఇంటర్వెల్‌కి ముందు అసలు కథ మొదలవుతుంది. మొదటి భాగం వరకు హీరో అశోక్ గల్లా చాలా చమత్కారంగా, సరదాగా కనిపించారు. ఫస్ట్ సినిమా అనే ఫీలింగ్ కనిపించదు. అతనిలో చాలా ఎగ్జైట్‌మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఓ సింగిల్ లైన్‌ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం ఫస్టాఫ్ వరకు చూస్తే కలుగుతుంది.
సెకండాఫ్‌లో జగపతిబాబు ఎంట్రీ ఉంది. ఆయన ఓ ప్రమాదంలో ఇరుక్కుంటారు. దానికి అర్జున్ కనెక్ట్ అవుతాడు. ఈ క్రమంలో ఫస్ట్ ఫైట్ వస్తుంది. ఫైట్ స్టయిలీష్‌గా బాగుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ అనే కాన్సెప్ట్ తో బ్రహ్మాజీ రోల్ ఎంట్రీ అవుతుంది. ఇండియాలో మనమేగా ఫస్ట్ అంటూ ఆయన చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది.
ఫైనల్‌గా సినిమా ఓ రెగ్యులర్ కామెడీ సినిమాగా కనిపిస్తుంది. హీరో కావాలనుకునే యువకుడి కథ. దారితప్పిన రవాణా, ముంబయి మాఫియా థ్రెడ్ కలపడంతో స్క్రీన్‌ప్లే విచిత్రంగా మారిపోయిందని, దీంతో రొటీన్ సినిమా ఫీలింగ్ కలుగుతుందనే టాక్ యూఎస్ ప్రీమియర్స్ నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు కృష్ణగారి `జుంబారే` సాంగ్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని, ఫస్టాఫ్ బాగుంటుందని ట్విట్టర్ ఆడియెన్స్ ద్వారా వినిపిస్తుంది. మొత్తంగా ప్రస్తుతానికి మిశ్రమ స్పందన లభిస్తుంది. మరి సినిమా ఎలా ఉందనేది పూర్తిస్థాయి `ఏషియానెట్` రివ్యూలో తెలుసుకుందాం.