MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సితార డెబ్యూ మూవీ ఏ భాషలోనో తెలుసా? క్లారిటీ ఇచ్చేసిన మహేష్ బాబు కూతురు!

సితార డెబ్యూ మూవీ ఏ భాషలోనో తెలుసా? క్లారిటీ ఇచ్చేసిన మహేష్ బాబు కూతురు!

సినిమాల్లోకి రావడానికి సిద్ధమన్న సితార... ఇంగ్లీష్ చిత్రాలు మాత్రమే చేస్తానని చెప్పడంతో అభిమానుల మైండ్ బ్లాక్ అయ్యింది. సితార హాలీవుడ్ పై మోజు పెంచుకోవడానికి  కారణం లేకపోలేదు... 

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 18 2024, 05:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Sitara Ghattamaneni

Sitara Ghattamaneni


సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. మహేష్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరో. మహేష్ బాబు 2005లో హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి గౌతమ్, సితార సంతానం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Sitara Ghattamaneni

Sitara Ghattamaneni


కొడుకు గౌతమ్ హీరో కావడం ఖాయం. సమయం వచ్చినప్పుడు గౌతమ్ ని మహేష్ బాబు రంగంలోకి దింపుతాడు. అయితే సితార కూడా నటిగా రాణించాలని ఆశపడుతోంది. గత జనరేషన్స్ లో స్టార్ హీరోల కూతుర్లు హీరోయిన్స్ గా మారే సాంప్రదాయం లేదు. ఆలోచనలు, పద్ధతులు మారాయి. జెండర్ డిఫరెన్సెస్ అనేవి ఇప్పుడు లేవు. 

 

37

బాల్యం నుండే సితార నటిగా రాణించడానికి కావాల్సిన పునాదులు వేసుకుంటుంది. ఆమె డాన్సులో శిక్షణ తీసుకుంటుంది. మహేష్ బాబు కూతురుగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ రాబడుతుంది. సీతారకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఓ హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని ఇమేజ్ సితార సొంతం. 

47

సితారకు ఉన్న క్రేజ్ రీత్యా పసిప్రాయంలోనే ఆమె ఓ అంతర్జాతీయ జ్యువెలరీ బ్రాండ్ కి ప్రచారకర్తగా వ్యవహరించింది. ఇందుకు గాను సితార రూ. 1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్. న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో సితార నటించిన జ్యువెలరీ యాడ్ వీడియో ప్రదర్శించడం విశేషం. ఇందుకు మహేష్, నమ్రత మురిసిపోయారు. 

 

57

తాజా ఇంటర్వ్యూలో సితార నటి కావాలన్న కోరికను బయటపెట్టారు. హీరోయిన్ కావలని అనుకుంటున్నారా? అని అడగ్గా... నేను చిన్నప్పటి నుండి నాన్నను చూస్తూ పెరిగాను. ఆ క్రమంలో సినిమా మీద, నటన పట్ల నాకు ఆసక్తి ఏర్పడ్డాయి. భవిష్యత్ లో నటిస్తాను. అయితే ఇంగ్లీష్ చిత్రాల్లో మాత్రమే నటించాలి అనుకుంటున్నాను... అని అన్నారు. 

 

67

సితార టాలీవుడ్, బాలీవుడ్ కాదని ఏకంగా హాలీవుడ్ మీద కన్నేసిందని ఆమె మాటలతో అర్థం అవుతుంది. సితార ఇంగ్లీష్ చిత్రాలు చేస్తాను అనడం వెనుక కారణం లేకపోలేదు. ఇంట్లో అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు.  తండ్రి  మహేష్ తో కలిసి సితార ఇండియన్ మూవీస్ కంటే కూడా హాలీవుడ్ చిత్రాలు, సిరీస్లు చూస్తుంది. హాలీవుడ్ మ్యూజిక్ ఎక్కువగా ఇష్టపడుతుంది. 

 

77

ఈ కారణంగా సితారకు ఇంగ్లీష్ చిత్రాల పట్ల ఆకర్షణ ఏర్పడి ఉండవచ్చు. నాకు తెలుగు చదవడం, రాయడం రాదని గతంలో మహేష్ చెప్పడం కొసమెరుపు. ప్రస్తుతం సితార వయసు 12 ఏళ్ళు కాగా... 7వ తరగతి చదువుతుందని సమాచారం. కానీ ఆమె ప్రవర్తన, మాట తీరు, సోషల్ మీడియా బిహేవియర్ పెద్దవాళ్లను తలపిస్తుంది.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kriti Sanon Net Worth: నటి మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ బిజినెస్‍వుమన్.. ప్రభాస్ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image2
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Recommended image3
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved