- Home
- Entertainment
- పెళ్లి పీటలపైనే భార్యకి రొమాంటిక్ కిస్.. ప్రేయసిని పెళ్లాడిన యంగ్ హీరో హరీష్ కళ్యాణ్, వెడ్డింగ్ పిక్స్ వైరల్
పెళ్లి పీటలపైనే భార్యకి రొమాంటిక్ కిస్.. ప్రేయసిని పెళ్లాడిన యంగ్ హీరో హరీష్ కళ్యాణ్, వెడ్డింగ్ పిక్స్ వైరల్
తమిళ యువ హీరో హరీష్ కళ్యాణ్ ఓ ఇంటివాడయ్యాడు. చాలా కాలంగా హరీష్ కళ్యాణ్ ప్రేమ, పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు హరీష్ కళ్యాణ్ తన ప్రేయసి నర్మదా ఉదయ్ కుమార్ ని నేడు చెన్నైలో వివాహం చేసుకున్నాడు.

తమిళ యువ హీరో హరీష్ కళ్యాణ్ ఓ ఇంటివాడయ్యాడు. చాలా కాలంగా హరీష్ కళ్యాణ్ ప్రేమ, పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు హరీష్ కళ్యాణ్ తన ప్రేయసి నర్మదా ఉదయ్ కుమార్ ని నేడు చెన్నైలో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం వైభవంగా బంధుమిత్రుల సమక్షంలో జరిగింది.
హరీష్ కళ్యాణ్ తమిళంలో రొమాంటిక్ అండ్ సస్పెన్స్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. హరీష్ కళ్యాణ్ చాలా కాలంగా నర్మదతో ప్రేమలో ఉన్నాడు. అయితే తమది ప్రేమ వివాహం కాదని.. పెద్దలు కుదిర్చిన వివాహమే అని హరీష్ చెబుతుండడం విశేషం.
నేడు అక్టోబర్ 28న చెన్నైలో చాలా గ్రాండ్ గా ఈ జంట వివాహం జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. హరీష్, నర్మదా వెడ్డింగ్ పిక్స్ చాలా రొమాంటిక్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాయి.
ఇద్దరూ సాంప్రదాయ వస్త్రదాహ్రణలో మెరిసిపోతున్నారు. నర్మద రెడ్ శారీలో, హరీష్ పంచె కట్టులో కనిపిస్తున్నారు. హరీష్ కళ్యాణ్ తమిళంలో హీరోగా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తెలుగులో కూడా హరీష్ కళ్యాణ్ జై శ్రీరామ్ అనే చిత్రంలో నటించాడు. అలాగే నాని జెర్సీ మూవీలో చిన్న పాత్రలో మెరిశాడు.
హరీష్ కళ్యాణ్ గురించి గతంలో చాలా రూమర్స్ వినిపించాయి. హీరోయిన్ బిందు మాధవితో హరీష్ ఎఫైర్ సాగించాడని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ రూమర్స్ ని హరీష్, బిందు మాధవి ఇద్దరూ ఖండించారు. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని పేర్కొన్నారు.
హరీష్ వివాహానికి బిందు మాధవి కూడా హాజరైంది. పెళ్లి వేడుకలో బిందు మాధవి సందడి చేసింది. హరీష్, నర్మదా వెడ్డింగ్ పిక్స్ నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. అంతా కొత్త జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.