- Home
- Entertainment
- శ్రీకాంత్ మేనకోడలితో లవ్..గోపీచంద్ డైరెక్ట్ గా అడగలేక ఎవరిని పంపాడో తెలుసా, ఇన్ని ట్విస్టులా
శ్రీకాంత్ మేనకోడలితో లవ్..గోపీచంద్ డైరెక్ట్ గా అడగలేక ఎవరిని పంపాడో తెలుసా, ఇన్ని ట్విస్టులా
హీరో గోపీచంద్ లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు. ఎందుకంటే గోపీచంద్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడని అంతా భావిస్తారు. వాస్తవానికి గోపీచంద్ చేసుకుంది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు.. లవ్ మ్యారేజ్.

హీరో గోపీచంద్ లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు. ఎందుకంటే గోపీచంద్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడని అంతా భావిస్తారు. వాస్తవానికి గోపీచంద్ చేసుకుంది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు.. లవ్ మ్యారేజ్. గోపీచంద్ ప్రేమ కథలో కూడా ట్విస్టులు బాగానే ఉన్నాయి. గోపీచంద్ పెళ్లి చేసుకునే సమయానికే టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు.
రేష్మతో గోపీచంద్ వివాహం 2013లో జరిగింది. అప్పటికే గోపీచంద్ చాలా హిట్స్ కొట్టేశాడు. టాలీవుడ్ లో అందరితో పరిచయం ఏర్పడింది. సీనియర్ హీరో శ్రీకాంత్ తో కూడా పరిచయం ఉంది. ఇక్కడ శ్రీకాంత్ ప్రస్తావన ఎందుకంటే.. గోపీచంద్ ప్రేమించింది పెళ్లి చేసుకుంది శ్రీకాంత్ మేనకోడలినే. అలీతో సరదాగా షోలో గోపీచంద్ తన ప్రేమ గురించి వివరించాడు.
గోపీచంద్ మాట్లాడుతూ..ఒక ఈవెంట్ లో శ్రీకాంత్ గారి మేనకోడలు రేష్మని చూశాను. చూడగానే నాకు తెగ నచ్చేసింది. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసూకోవాలని ఫిక్స్ అయ్యా. శ్రీకాంత్ గారితో పరిచయం ఉంది కానీ సంబంధం డైరెక్ట్ గా ఎలా అడగగలను ? అందుకే పెళ్లి ప్రపోజల్ ఎలా పెట్టాలా అని టెన్షన్ పడ్డా.
అప్పుడే సీనియర్ నటుడు చలపతి రావు గారితో నా మనసులో మాట చెప్పా. ఆయన నాకు భరోసా ఇచ్చారు. నేను శ్రీకాంత్ తో మాట్లాడతాను.. నువ్వు టెన్షన్ పడకు అని చెప్పారు. ఆయన వెళ్లి శ్రీకాంత్ ని కలవడం నా గురించి చెప్పడం.. వాళ్ళు సంబంధం ఒకే అని చెప్పడం చకచకా జరిగిపోయాయి. చలపతి రావు నా పెళ్ళికి సంబంధించిన పనులన్నీ దగ్గరుండి చూసుకున్నారు.
పెళ్లి ఫిక్సయ్యాక రేష్మ నాకు టీ షర్ట్ ఫస్ట్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఆ విధంగా గోపీచంద్ ప్రేమకి, పెళ్లికి చలపతి రావు మధ్యవర్తిగా మారారు. పెళ్లి పెద్ద అయ్యారు. ప్రస్తుతం గోపీచంద్ రేష్మ అన్యోన్యంగా జీవిస్తున్నారు. స్వతహాగా గోపీచంద్ స్వస్థలం ఒంగోలు.
గోపీచంద్, రేష్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కొడుకుకి పదేళ్ల వయసు అని గోపీచంద్ తెలిపాడు. చిన్నవాడి వయసు ఐదేళ్లు. పెద్దోడు సినిమాలు బాగా చూస్తాడు. నా సినిమాలో బాగాలేని అంశాలు కూడా క్రిటిక్ లాగా చెబుతాడు. ఎందుకు అలా చేశావ్ అని ప్రశ్నలు కూడా అడుగుతున్నట్లు గోపిచంద్ తెలిపారు. గోపీచంద్ నటించిన భీమా చిత్రం నేడు ప్రేక్షకుల ఎందుకు వచ్చింది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపి ఈ చిత్రంతో విజయం సాధిస్తాడేమో చూడాలి.