MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • హత్య కేసులో సినిమాని మించే ట్విస్టులు..నన్ను అమ్మని వదిలేయండి, వెక్కి వెక్కి ఏడుస్తున్న హీరో దర్శన్ కొడుకు

హత్య కేసులో సినిమాని మించే ట్విస్టులు..నన్ను అమ్మని వదిలేయండి, వెక్కి వెక్కి ఏడుస్తున్న హీరో దర్శన్ కొడుకు

హీరో దర్శన్ తన అభిమాని అయిన 28 ఏళ్ళ రేణుకాస్వామిని హత్య చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనితో బెంగుళూరు పోలీసులు దర్శన్ ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దర్శన్ చాలా ఏళ్ళ క్రితమే విజయ లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి 15 ఏళ్ళ కొడుకు కూడా ఉన్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 14 2024, 11:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శన్ సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరో. రీసెంట్ గానే దర్శన్ కాటేరా అనే చిత్రంతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. దీనితో మరోసారి దర్శన్ పేరు కన్నడ నాట మారుమోగింది. ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే ఇటీవల జరిగిన సంఘటనతో దర్శన్ ఇమేజ్, వ్యక్తిగత జీవితం మసకబారేలా కనిపిస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

హీరో దర్శన్ తన అభిమాని అయిన 28 ఏళ్ళ రేణుకాస్వామిని హత్య చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనితో బెంగుళూరు పోలీసులు దర్శన్ ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దర్శన్ చాలా ఏళ్ళ క్రితమే విజయ లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి 15 ఏళ్ళ కొడుకు కూడా ఉన్నారు. 

37

కానీ దర్శన్ తన భార్యకి దూరంగా ఉంటూ మరో నటితో సహజీవనం చేస్తున్నారు. ఆమె పేరు పవిత్ర గౌడ. పవిత్ర గౌడ వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో కొన్ని విషయాలు తెలిశాయి.దీనితో పోలీసులు ఆమెని కూడా అదుపులోకి తీసుకున్నారు. రేణుకా స్వామి హీరో దర్శన్ కి వీరాభిమాని. పవిత్ర గౌడ వచ్చి తన అభిమాన హీరో కాపురంలో నిప్పులు పోస్తోందని రేణుకా స్వామి కోపంతో రగిలిపోయాడట. 

47

దీనితో రేణుకా స్వామి.. పవిత్ర గౌడకు అశ్లీల ఫోటోలు, అసభ్యకర మెసేజ్ లు పంపాడట. దీనితో పవిత్ర ఈ విషయాన్ని దర్శన్ కి చెప్పినట్లు పోలిసుల విచారణలో తెలుస్తోంది. దర్శన్ మనుషులతో రేణుకా స్వామిని హత్య చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాదు బాడీని మాయం చేస్తే 30 లక్షలు ఇస్తానని కూడానా దర్శన్ కొందరికి ఆఫర్ ఇచ్చినట్లు పోలీసులు ఎంక్వరీలో తేలింది. 

57

సినిమాలో క్రైమ్ సీన్ ని మించేలా దర్శన్ కేసులో రోజుకి ఒక ట్విస్టు బయట పడుతోంది. దీనివల్ల హీరో దర్శన్ కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా మానసిక వేదనకి గురవుతున్నారు. ముఖ్యంగా హీరో దర్శన్ కొడుకు వినీష్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడట. 15 ఏళ్ళ చిన్నారి వినీష్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. 

67

మీరంతా మా కుటుంబాన్ని బూతులు తిడుతున్నందుకు ధన్యవాదాలు. కొంతమంది అసభ్యకరమైన భాష వాడుతున్నారు. నా వయసు 15 ఏళ్ళు. అయినప్పటికీ మిమ్మల్ని వేడుకుంటున్నా. ఈ క్లిష్ట సమయాల్లో నన్ను అమ్మని ప్రశాంతంగా వదిలేయండి. మా నాన్న హత్య చేసి ఉంటాడని నమ్మడం లేదు. దర్యాప్తు జరుగుతోంది. ఆయనకి మీ సపోర్ట్ ఇవ్వండి అంటూ తీవ్ర భావోద్వేగంతో చిన్నారి వినీష్ పోస్ట్ చేశాడు. 

77

వినీష్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. దర్శన్, విజయలక్షి 2000 లోనే వివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలంగా దర్శన్ పవిత్రతో సహజీవనం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారనే ప్రచారం కూడా ఉంది. కానీ దానికి ఎలాంటి ఆధారాలు లేవు. కేసు బలంగా మారుతున్న తరుణంలో దర్శన్ కెరీర్ పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved