- Home
- Entertainment
- ఎంత ప్రయత్నించినా 'ఆదిపురుష్'ని దిల్ రాజు ఒప్పుకోలేదా.. ప్రభాస్ మూవీ వద్దనుకోవడానికి కారణం అదేనా ?
ఎంత ప్రయత్నించినా 'ఆదిపురుష్'ని దిల్ రాజు ఒప్పుకోలేదా.. ప్రభాస్ మూవీ వద్దనుకోవడానికి కారణం అదేనా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద దుసుకుపోతోంది. ఆదిపురుష్ చిత్రాన్ని రిలీజ్ కి ముందే అనేక వివాదాలు చుట్టుముట్టాయి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద దుసుకుపోతోంది. ఆదిపురుష్ చిత్రాన్ని రిలీజ్ కి ముందే అనేక వివాదాలు చుట్టుముట్టాయి. రిలీజ్ తర్వాత విమర్శలు, ట్రోలింగ్, సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. కానీ ప్రభాస్ క్రేజ్, రామాయణం బ్యాక్ డ్రాప్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్ర జోరు తగ్గడం లేదు.
అయితే టాక్ మిక్స్డ్ గా ఉన్న నేపథ్యంలో ఆదిపురుష్ చిత్రం వీకెండ్ తర్వాత సోమవారం నుంచి ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని రామాయణంలోని కీలకమైన అరణ్యకాండ, యుద్ధ కాండ ఆధారంగా తెరకెక్కించినట్లు తెలిపారు. కానీ ఈ చిత్రంలో ఓం రౌత్ అసలు ఇది రామాయణమేనా అని అనిపించేలా చాలా సన్నివేశాలు ఉన్నాయి. ఓం రౌత్ తెరకెక్కించిన విధానం, ఉపయోగించిన గ్రాఫిక్స్, పాత్రలు కూడా వివాదానికి కారణం అవుతున్నాయి.
వాస్తవానికి ఈ రచ్చ ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే మొదలయింది. అయితే ఆదిపురుష్ ఈ పరిస్థితిని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముందే ఊహించినట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాలని దిల్ రాజు ఫ్యాన్సీ ధరలు వెచ్చించి నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేయడం చూశాం.
కానీ దిల్ రాజు ఆదిపురుష్ జోలికి వెళ్ళలేదు. ఆదిపురుష్ తెలుగు రిలీజ్ విషయంలో ప్రభాస్ హోమ్ బ్యానర్ లాంటి యువి క్రియేషన్స్ ప్రమేయం ఉంది. కానీ ఈ చిత్రాన్ని తెలుగులో దక్కించుకుంది మాత్రం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు. దిల్ రాజుకి నైజాం హక్కులు ఇచ్చేందుకు వారు ఎంతో ప్రయత్నించారట. కానీ దిల్ రాజు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.
టీజర్ రిలిజ్ అయినప్పుడే దిల్ రాజు ఈ చిత్రం ఎలా ఉండబోతోందో ఊహించినట్లు చెబుతున్నారు. అప్పటికే శాకుంతలం చిత్రంతో పాతిక కోట్ల వరకు నష్టపోయిన దిల్ రాజు.. ఆదిపురుష్ తో రిస్క్ చేసేందుకు ఇష్టపడలేదని వార్తలు వస్తున్నాయి. కేవలం ప్రభాస్ క్రేజ్ ని నమ్మి అధిక మొత్తంతో నైజాం హక్కులు కొనేందుకు దిల్ రాజు ముందుకు రాలేదట. ఏది ఏమైనా దిల్ రాజుకి ముందుచూపు ఎక్కువ అని టాలీవుడ్ ఫ్యాన్స్ అంటున్నారు.
ఇప్పటికైతే ఆదిపురుష్ కలెక్షన్స్ ప్రవాహంలా దూసుకుపోతున్నాయి. రెండు రోజుల్లో ఆదిపురుష్ చిత్రం 220 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా గ్రాస్ సాధించింది. అంటే దాదాపు 110 కోట్ల వరకు షేర్ రాబట్టింది. బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే ఇంకా 130 కోట్ల వరకు షేర్ రావాల్సి ఉంది. నేటితో వీకెండ్ ముగుస్తుండడంతో సోమవారం నుంచి డ్రాప్ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.