మానసిక వేదనతో రేఖ భర్త ఆత్మహత్య...విమర్శలు ఎదుర్కొన్న రేఖ ఎలా కారణం అయ్యిందీ!

First Published Dec 1, 2020, 4:08 PM IST

స్టార్ హీరోయిన్ గా దశాబ్దాల పాటు బాలీవుడ్ ని ఏలింది రేఖ. నటిగా తిరుగులేని ఫేమ్ అనుభవించిన రేఖ, అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఎఫైర్స్ నుండి వివాహ జీవితం వరకు అనేక వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. వ్యాపార వేత్త ముఖేష్ అగర్వాల్ ని రేఖ వివాహం చేసుకోగా, ఆయన ఆత్మ హత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

స్టార్ హీరో అమితాబ్ తో రేఖా చాలా కాలం ప్రేమాయణం నడిపారు. వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు రావడం జరిగింది. అనూహ్యంగా అమితాబ్ జయాబచ్చన్ వివాహం చేసుకోవడంతో రేఖా కొత్త జీవితం ప్రారంభించారు.

అమితాబ్ ఇచ్చిన షాక్ నుండి గుణపాఠం నేర్చుకున్న రేఖ, ఓ మంచి వ్యక్తిని భర్తగా తెచ్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆ తరువాత హాట్ లైన్ కిచెన్ వేర్ సంస్థ యజమాని ముఖేష్ అగర్వాల్ తో పబ్లిక్ మరియు ప్రైవేట్ వేడుకలలో కలిసి కనిపించడం మొదలుపెట్టారు.

రేఖా బయోగ్రఫీ రాసిన ప్రముఖ జర్ననలిస్ట్ మరియు రచయిత  ఉస్మాన్ యాసిర్ అభిప్రాయం ప్రకారం రేఖా, ముఖేష్ కామన్ ఫ్రెండ్ ఫ్యాషన్ డిజైనర్ అయిన బినా రమణి ద్వారా కలిశారట.

రేఖ అందచందాలు, ఫేమ్ ముఖేష్ ని ఆమె ప్రేమలో పడేలా చేశాయి. రేఖ సైతం ముఖేష్ వ్యక్తిత్వం నచ్చడంతో ఓ సాధారణ వ్యాపారవేత్త అయినప్పటికీ మనస్ఫూర్తిగా అతన్ని ప్రేమించారు. తరచుగా కలవడం, ఫోన్ లో మాట్లాడుకోవడంతో ఒకరి ప్రేమను మరొకరు వ్యక్తపరుచుకోవడం జరిగింది. అలా వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.

పెళ్లి తరువాత హనీమూన్ కి వెళ్లిన రేఖ ముఖేష్ కి గతంలోనే పెళ్లి జరిగిందని, పిల్లలు కూడా ఉన్నారన్న విషయం తెలుసుకున్నారు. దానితో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇద్దరూ విడిపోవడం జరిగింది.

1990లో వివాహం చేసుకున్న రేఖ, ముఖేష్ నెలల వ్యవధిలోనే విడిపోయారు. రేఖతో విడాకులు, వ్యాపారంలో నష్టాలు ముకేశ్ ని మానసిక వేదనకు గురి చేశాయి. అదే ఏడాది ముఖేష్ ఆత్మ హత్య చేసుకొని మరణించాడు.

ముఖేష్ అగర్వాల్ తన మరణానికి ఎవరూ భాద్యులు కాదని సూసైడ్ నోట్ రాసినప్పటికీ. ముఖేష్ మరణానికి రేఖనే కారణం అని ఆమెను విపరీతంగా విమర్శించారు. ఆమెకు వ్యతిరేకంగా మీడియాలో అనేక కథనాలు రావడం జరిగింది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?