- Home
- Entertainment
- హౌజ్ నుంచి వెళ్లిపో.. హరిత హరీష్‌కి ఝలక్, రెండో వారం నామినేట్ అయ్యింది వీరే, సుమన్ శెట్టికి షాక్
హౌజ్ నుంచి వెళ్లిపో.. హరిత హరీష్‌కి ఝలక్, రెండో వారం నామినేట్ అయ్యింది వీరే, సుమన్ శెట్టికి షాక్
బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారం నామినేషన్ల ప్రక్రియ రెడ్ ఫ్లవర్, ఎగ్‌ల దగ్గరే ఆగిపోయింది. ఈ క్రమంలో హౌజ్ నుంచి వెళ్లిపో అని హరీష్‌కి కంటెస్టెంట్లు వార్నింగ్ ఇవ్వడం విశేషం.

రెడ్ ఫ్లవర్, ఎగ్‌ల చుట్టూనే నామినేషన్ల ప్రక్రియ
బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారం నామినేషన్ల ప్రక్రియ చాలా రసవత్తరంగా సాగింది. చాలా ఆవేశంగా, ఫైరింగ్‌గా, ఇంకోవైపు ఫన్నీగా సాగింది. అయితే కంటెస్టెంట్లు అంతా చాలా వరకు రెడ్ ఫ్లవర్, ఎగ్ దగ్గరే ఆగిపోయారు. వాటి చుట్టూనే నామినేషన్ల ప్రకియ జరగడం గమనార్హం. రెడ్ ఫ్లవర్ పేరుతో హరీష్‌ని, ఎగ్ గొడవ కారణంతో భరణిని నామినేట్ చేస్తూ వచ్చారు. హౌజ్‌లో మరో సమస్యనే లేనట్టు, ఇతర కారణాలు లేనట్టుగానే ఆ రెండు అంశాలమీదనే రెండో వారం నామినేషన్ల ప్రక్రియ సాగడం విశేషం.
రాము రాథోడ్, ప్రియా నామినేషన్
మంగళవారం ఎపిసోడ్(9వ రోజు)లో రాము రాథోడ్.. కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. యాటిట్యూడ్ నచ్చలేదనే కారణం తెలిపారు. దీనికి ట్రోల్ అవుతావని కళ్యాణ్ చెప్పడం విశేషం. దీని కారణంగా వీరిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. రెండో నామినేషన్ హరీష్‌ని చేశాడు. ఆ తర్వాత ప్రియా.. మొదటి నామినేషన్ ఫ్లోరాని చేసింది. బాత్ రూమ్‌లో షాంపూ విషయంలో నామినేట్ చేసింది. రెండో నామినేషన్ భరణిని చేసింది. కారణాలు సేమ్.
ఏడుస్తూ సింపతీ, తినకుండా సింపతీ.. రితూ, హరీష్ మధ్య రచ్చ
రీతూ చౌదరీ మొదటి నామినేషన్ హరిత హరీష్‌ని చేసింది. గత వారం తాను చేసిన మిస్టేక్స్ చెబుతూ, గివప్ ఇస్తున్నావని, అలాంటి వ్యక్తి హౌజ్‌లో ఉండేది ఎందుకని ప్రశ్నించింది. ఇందులో ఉండి పోరాడాలని చెప్పింది. అలా కాకుండా బయట వాళ్లున్నారు, వీళ్లున్నారని చెప్పడం ఏంటనే, సింపతీ గేమ్ ఆడుతున్నట్టుగా కామెంట్ చేశారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గట్టిగా వాగ్వాదం జరిగింది. ఏడుస్తూ సింపతీ గేమ్ ఆడుతున్నావని రీతూకి హరీష్ కౌంటర్ ఇచ్చాడు. ఇక రీతూ రెండో నామినేషన్ ఫ్లోరాని చేసింది. బట్టలు ముట్టుకోవడానికి సంబంధించి, ఫ్రీ బర్ద్ అనే అంశాలపై నామినేట్ చేసింది.
భరిణిలో మరో కోణం
సుమన్ శెట్టి.. ప్రియా, మనీష్‌లను నామినేట్ చేశాడు. ప్రియా దొంగతనం చేసినట్టుగా పదే పదే అడగడం బాగా లేదని చెప్పాడు. అలాగే మనీష్ హౌజ్‌లోపలకి అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పవన్ కళ్యాణ్.. ఫ్లోరా, భరణిలను నామినేట్ చేశాడు. ఫ్లోరాని థంమ్సప్ దొంగతనం విషయంలో, భరణినీ ఎగ్ విషయంలో నామినేట్ చేశారు. ఇమ్మాన్యుయెల్.. మనీష్‌ని, హరీష్‌లను నామినేట్ చేశాడు. తప్పుని ముందే ఒప్పుకుని ఉంటే, తాను కెప్టెన్సీ టాస్క్ లో గెలిచేవాడినని, నీవల్లే ఆ గేమ్ ఓడిపోయిందని మనీష్‌ని అన్నాడు. హరీష్ బాడీ షేమింగ్ కామెంట్స్ చేశాడని, రెడ్ ఫ్లవర్ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇది చాలా హాట్ హాట్‌గా వాగ్వాదం జరిగింది.
ఇంటి నుంచి వెళ్లిపో.. హరీష్‌కి వార్నింగ్
భరణి.. ప్రియా, పవన్‌లను నామినేట్ చేశాడు. ఫుడ్ విషయంలో, కుక్కింగ్ విషయంలో తాను చాలా ఇబ్బంది పడ్డానని ప్రియాని నామినేట్ చేశాడు. మరోవైపు కళ్యాణ్.. భరణి, హరీష్‌లను నామినేట్ చేశారు. ఎగ్, రెడ్ ఫ్లవర్, బాడీ షేమింగ్ ల విషయంలో ఈ నామినేషన్ జరిగింది. ఫ్లోరా.. తనూజ, పవన్ కళ్యాణ్‌లను నామినేట్ చేసింది. ఆమె వద్ద పెద్దగా కారణాలు లేవు. హరీష్.. భరణి, ఇమ్మాన్యుయెల్‌లను నామినేట్ చేశాడు. గుడ్డు విషయంలో కపటనాటకం ఆడావని ఆరోపించారు. దీంతో భరణి కూడా ఫైర్ అయ్యాడు. ఇమ్మాన్యుయెల్‌తో ఏకంగా గొడవ తారా స్థాయికి వెళ్లింది. శ్రీజ.. హరీష్, భరణిలను నామినేట్ చేసింది. గివప్ ఇచ్చేవాడివి హౌజ్‌లో ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. వెళ్లిపో అంటూ స్ట్రాంగ్‌గా వెల్లడించింది. ఈ క్రమంలో దమ్ముంటే డోర్స్ ఓపెన్ చేయాలని హరీష్ అనడం గమనార్హం. ఇదొక పెద్ద వివాదంగా మారింది. దీనికి లేడీ కంటెస్టెంట్లు కూడా అభ్యంతరం తెలిపారు. భరణి పైకి మంచోడిలా కనిపిస్తాడని, కానీ తెరవెనుక గేమ్ ఆడుతున్నట్టు తెలిపారు. ఆయనొక లయర్, ఇన్‌ప్లూయెన్సర్ అని తెలిపింది.
అడ్డంగా బుక్కైన సుమన్ శెట్టి
ఇలా నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోయింది. ఇందులో హరీష్, భరణి, ఫ్లోరా సైనీ, మనీష్, ప్రియా, పవన్ కళ్యాణ్ రెండో వారం నామినేట్ అయిన వారిలో ఉన్నారు. వీరితోపాటు సుమన్ శెట్టి కూడా నామినేట్ అయ్యాడు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత కెప్టెన్ సంజనాకి ప్రత్యేక అధికారం ఇచ్చారు బిగ్ బాస్. తన కెప్టెన్సీని ఉపయోగించి ఒకరిని నేరుగా నామినేట్ చేసేఅవకాశం ఇవ్వడంతో సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. ఈ సందర్భంగా వీరి మధ్య వాగ్వాదం ఆద్యంతం ఫన్నీగా సాగింది. సుమన్ శెట్టి రచ్చ చేశాడు. మొత్తంగా రెండో వారం భరణి, హరీష్, పవన్ కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా సైనీ, మనీష్‌లతోపాటు సుమన్ శెట్టి రెండో వారం నామినేట్ అయిన వారిలో ఉన్నారు.