MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • HariHara Veeramallu Song: పవన్‌ ని ఇలా చూసి ఎన్నాళ్లవుతుందో.. `కొల్లగొట్టినాదిరో` పాటలో హైలైట్స్ ఇవే

HariHara Veeramallu Song: పవన్‌ ని ఇలా చూసి ఎన్నాళ్లవుతుందో.. `కొల్లగొట్టినాదిరో` పాటలో హైలైట్స్ ఇవే

HariHara VeeraMallu Second Song : పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `హరిహర వీరమల్లు` సినిమా నుంచి రెండో పాట విడుదలైంది. ఇందులో పవన్‌ ని చూస్తే ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 24 2025, 09:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
HariHara VeeraMallu Second Song

HariHara VeeraMallu Second Song

పవన్‌ కళ్యాణ్‌ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ లో పూనకాలే. అప్‌ డేట్లకి ఊగిపోతుంటారు. ఆయన డైలాగ్‌లకు రెచ్చిపోతుంటారు. డాన్సు స్టెప్పులకు పూనకాలు లోడింగ్‌ అంటారు. ఇలా పవన్‌ సినిమా నుంచి ఏ అప్‌ డేట్‌ వచ్చినా, ఏ మూమెంట్‌ వచ్చినా ఫ్యాన్స్ కి పండగే. జస్ట్ పవన్‌ తెరపై కనిపిస్తేనే ఫ్యాన్స్ సెలబ్రేట్‌ చేసుకుంటారు.

అయితే ఇటీవల ఆయన రాజకీయాల్లో, డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమాలు రాలేదు. ఆయన మూవీ వచ్చి రెండేళ్లు అవుతుంది. ఆయన స్టెప్పులు చూసి మూడేళ్లు అవుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
HariHara VeeraMallu Second Song

HariHara VeeraMallu Second Song

ఇన్నాళ్లకి ఇప్పుడు అదిరిపోయే స్టెప్పులతో ఫ్యాన్స్ లో జోష్‌ నింపారు పవన్‌. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న `హరిహర వీరమల్లు` మూవీ నుంచి రెండో పాట వచ్చింది. `కొల్లగొట్టినాదిరో` అంటూ సాగే ఈ పాటని సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు.

ఈ సినిమాలో పవన్‌ వీరమల్లుగా కనిపిస్తారనే విషయం తెలిసిందే. ఆ గెటప్‌లో ఆయన ఈ పాటకి డాన్సులు చేశారు. హీరోయిన్‌తో కలిసి డాన్సు స్టెప్పులు వేయడం విశేషం. ఈ లిరిక్‌ సాంగ్‌లో మధ్య మధ్యలో డాన్స్ మూమెంట్లని చూపించి ఫ్యాన్స్ ని ఖుషీ చేసింది టీమ్‌. ప్రస్తుతం ఈ పాట వైరల్‌ అవుతుంది. 

read  more: చిరంజీవి తండ్రి చివరగా చూసిన సినిమా ఎవరిదో తెలుసా? నానమ్మలో ఉన్న కొంటెతనం బయటపెట్టిన రామ్‌ చరణ్‌
 

35
HariHara VeeraMallu Second Song

HariHara VeeraMallu Second Song

ఆస్కార్‌ విన్నర్‌ ఎంఎం కీరవాణి ఈ పాటని స్వరపర్చగా, చంద్రబోస్‌ ఈ పాటని రాశారు. మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల, ఐరా ఉడిపి, మోహన భోగరాజు, వైష్ణవి కన్నన్, సుదీప్ కుమార్, అరుణ మేరీ ఆలపించి పాటకు మరింత మాధుర్యం తీసుకొచ్చారు.

కీరవాణి   అద్భుతమైన స్వరకల్పనకు తెలుగులో చంద్రబోస్, తమిళంలో పా. విజయ్, మలయాళంలో మంకొంబు గోపాలకృష్ణన్, కన్నడలో వరదరాజ్, హిందీలో అబ్బాస్ టైరేవాలా సాహిత్యం అందించారు.
 

45
HariHara VeeraMallu Second Song

HariHara VeeraMallu Second Song

ఈ గీతం సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్ళింది. పాట ప్రారంభం నుంచి ముగింపు వరకు.. ఎంతో వినసొంపుగా, శ్రోతలను కట్టిపడేసేలా సాగింది. ఇక పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ లిరికల్ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ సరసన జంటగా నటించిన నిధి అగర్వాల్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు.

తెరపై ఈ జోడి చూడముచ్చటగా ఉంది. అలాగే ఈ పాటలో అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ మెరిసి తమ నృత్యంతో అదనపు ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరు సేమ్‌ డ్రెస్‌లో కలిసి స్టెప్పులేయడం హైలైట్‌గా నిలిచింది. పాటకి అందాన్ని తీసుకొచ్చింది.

సాంగ్‌ భారీ సెట్‌, విజువల్స్ ఇందులో మరో ఆకర్షణగా నిలిచాయి. పాట విజువల్‌ వండర్‌లా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే మొదటి పాట `మాట వినాలి` విశేష ఆదరణ పొందగా, ఇప్పుడు విడుదలైన రెండో పాట సైతం శ్రోతలను అలరిస్తుంది. ఫ్యాన్స్ చేత డాన్సులు వేయిస్తుందని చెప్పొచ్చు. 
 

55
HariHara VeeraMallu Second Song

HariHara VeeraMallu Second Song

`హరి హర వీరమల్లు` చిత్రం 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. అయితే రిలీజ్‌ పై కొంత సస్పెన్స్ ఉంది.  టీమ్‌ మాత్రం ఆ డేట్‌కి తీసుకురావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. అందులో భాగంగా ప్రమోషనల్‌ కంటెంట్‌ని వదులుతున్నట్టు తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. 

read  more: రమ్యకృష్ణ, శ్రీదేవిలపై ఎన్టీఆర్‌ స్టేట్‌మెంట్‌, ఛార్మినీ వదల్లేదు.. తారక్ లో ఇంత రొమాంటిక్‌ యాంగిల్‌ ఉందా?

also read: మూడు గంటలు క్యాన్సర్‌ ఆపరేషన్‌, సాయిబాబా గుడిలో నాగార్జున.. ఏఎన్నార్‌ మాటలకు కన్నీళ్లు
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rajeev Kanakala: ఎన్టీఆర్‌ తనకు ఎవరూ లేరని మాట్లాడానికి కారణం ఇదే.. సంచలన విషయం చెప్పిన రాజీవ్‌ కనకాల
Recommended image2
Bigg Boss Telugu 10: హౌస్ నుంచి ఝాన్సీ అవుట్, అమాయకత్వంతో ఉండలేను అంటూ కన్నీళ్లు.. త్రిగుణ్ పై వర్షిణి కుట్ర
Recommended image3
Keerthy Suresh: ఫ్లైట్‌లో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. భర్త ఆంటోనీ ఎంట్రీతో సీన్ రివర్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved