హంసా నందిని సమ్మర్ వెకేషన్ షురూ.. ఫొటోస్ వైరల్
టాలీవుడ్ లో హంసానందిని ఒక ప్రత్యేకమైన బ్యూటీ. ఎన్నో చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. కీలక పాత్రల్లో నటించింది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ లో ఆమె గ్లామర్ ని యువత బాగా ఎంజాయ్ చేశారు.

టాలీవుడ్ లో హంసానందిని ఒక ప్రత్యేకమైన బ్యూటీ. ఎన్నో చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. కీలక పాత్రల్లో నటించింది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ లో ఆమె గ్లామర్ ని యువత బాగా ఎంజాయ్ చేశారు.
అయితే హంసానందిని 2021లో ఆశ్చర్యకరంగా క్యాన్సర్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుని హంసా నందిని గత ఏడాది కోలుకుంది. అయితే క్యాన్సర్ కారణంగా గుండుతో కనిపించింది. చాలా కాలం పాటు ఆమె తన గ్లామర్ లుక్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం హంసా నందిని ఫుల్ జోష్ లో కనిపిస్తోంది.
మునుపటిలా తన జుట్టు పూర్తి స్థాయిలో వచ్చింది. దీనితో హంసానందిని తన గ్లామర్ లుక్స్ కి పదును పెడుతోంది. అంతే కాదు సినిమా అవకాశాల వేటలో పడింది. ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది.
ప్రస్తుతం హంసా నందిని మునుపటిలా తన అందంతో యువతని అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఆమె బికినీలో స్విమ్మింగ్ పూల్ పిక్ ని షేర్ చేసింది. దీనితో హంసా నందిని ఆల్రెడీ సమ్మర్ వెకేషన్ మొదలు పెట్టింది అని నెటిజన్లు అంటున్నారు.
గత కొన్ని నెలలుగా నన్ను నేను చూసుకుంటుంటే గర్వంగా ఉంది. తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటున్నా. క్లిష్ట పరిస్థితుల్లో సైలెంట్ గా ఉంటూనే పోరాటాలు చేశా. తిరిగి పూర్తి స్థాయి శక్తి వచ్చింది అంటూ ఇటీవల హంసా నందిని ఎమోషనల్ గా పేర్కొంది.
నెటిజన్లు కూడా హంసా నందిని తిరిగి కోలుకోవడం, పూర్తి ఎనెర్జిటిక్ గా మారడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హంసా నందిని రియల్ ఫైటర్ అని కామెంట్స్ చేస్తున్నారు. మీ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాం.. ఇప్పుడు చాలా అందంగా ఉన్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.
హంసా నందిని.. అత్తారింటికి దారేది, మిర్చి, లౌక్యం, లెజెండ్ లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో మెరుపులు మెరిపించింది. మంచి ఆఫర్ వస్తే మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది.