చరిత్ర సృష్టించిన చిరంజీవి.. మెగాస్టార్ ఖాతాలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్, క్రేజీ డీటెయిల్స్
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో అందుకొని ఘనతలు, రికార్డులు లేవు. గత 46 ఏళ్లుగా చిరంజీవి టాలీవుడ్ లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి తన చిత్రాలతో డ్యాన్సుల విషయంలో కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో అందుకొని ఘనతలు, రికార్డులు లేవు. గత 45 ఏళ్లుగా చిరంజీవి టాలీవుడ్ లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి తన చిత్రాలతో డ్యాన్సుల విషయంలో కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు. టాలీవుడ్ లో డాన్సులు చిరంజీవి రక ముందు ఒకలా ఉండేవి.. దానిని పూర్తిగా మార్చేస్తూ డ్యాన్స్ అంటే ఇది అని ట్రెండ్ సెట్ చేశారు.
తాజాగా మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరబోతోంది. మెగాస్టార్ డ్యాన్స్ కి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దక్కబోతోంది. సినిమాల్లో అత్యధిక పాటలకు డ్యాన్స్ చేసిన నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. దీనితో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తో చిరంజీవిని గౌరవించబోతున్నారు.
దీనికి సంబంధించిన ప్రకటనని బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ త్వరలో ఒక ఈవెంట్ లో చేయబోతున్నారు. చిరంజీవి 150పైగా చిత్రాల్లో నటించారు. వందలాది పాటలకు అద్భుతమైన డ్యాన్స్ చేశారు. చిరంజీవి లాగా ఈ స్థాయిలో పాటలకు డ్యాన్స్ చేసిన నటుడు ఇంకొకరు లేరు.
దీనితో గిన్నిస్ సంస్థ చిరుకి ఈ అవార్డు అందించబోతోంది. గతంలో టాలీవుడ్ నుంచి గిన్నిస్ రికార్డు అందుకున్న వారిలో నిర్మాత రామానాయుడు, బ్రహ్మానందం ఉన్నారు. చిరంజీవి ఏడు పదుల వయసు సమీపిస్తున్నా కూడా యువతతో పోటీ పడి డ్యాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
చిరంజీవి తన 45 ఏళ్ళ కెరీర్ లో 537 పాటలకు డ్యాన్స్ చేశారు. ఇందులో 24 వేలకి పైగా డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి. మొత్తం చిరంజీవి 156 చిత్రాల్లో నటించారు. ఈ అరుదైన ఘనత సాధించినందుకు గాను చిరంజీవికి గిన్నిస్ రికార్డ్స్ సంస్థ అవార్డు ప్రదానం చేస్తోంది.