Guppedantha Manasu: వసుకు ప్రపోజ్ చెయ్యనున్న గౌతమ్.. రిషి ఇప్పుడైనా బయటపడుతాడా?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha manasu ) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

ఒకరికి తెలియకుండా ఒకరు ఈ ముగ్గురు ఒకే ఇంటికి వచ్చి అక్కడకి ఎందుకు వచ్చారా? ఏ పని కోసం వచ్చారు చెప్పడానికి సందేహ పడతారు. రిషి (Rishi) ప్రాజెక్ట్ వర్క్ పని మీద వచ్చానని. గౌతమ్ (Gautham) కి చెబుతాడు. ఆ తర్వాత గౌతమ్, మహేంద్ర ని కూడా అడుగుతాడు.
మహేంద్ర (Mahendra ) ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఉండగా ఈ లోపు రిషి, గౌతమ్ ను అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అదే ప్రశ్న తిరిగి గౌతమ్ (Gautham ) అడగగా రిషి మిషన్ ఎడ్యుకేషన్ పని అని చెప్తాడు. గౌతం తాను కూడా అదే పని మీద వచ్చాను అని పెన్ డ్రైవ్ తీసి ఇస్తాడు.
ఆ తర్వాత కార్ లో రిషి మహేంద్ర (Mahendra ) ని ఒక చోటకు తీసుకు వచ్చి గౌతమ్ (Gautham ) అడిగిన మాటకి మీరు చాలా ఫీల్ అయ్యారు అని నాకు తెలుసు. కానీ నేను అక్కడ ఏమి మాట్లాడలేకపోయాను. అని చేతిలో చెయ్యేసి నన్ను క్షమించండి అన్నట్లు మాట్లాడుతాడు రిషి. ఇక్కడ తండ్రి కొడుకుల ఎమోషనల్ బాండ్ కనిపిస్తుంది.
మరోవైపు వసుధార, (Vasudhara ) గౌతమ్ మహేంద్ర అని అడిగిన ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా అక్కడకు జగతి వచ్చి మహేంద్ర ప్రశ్నకి ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడో దానికి రిషి (Rishi) మనసులో ఎంత బాధ పడుతున్నాడో.. అనే సంగతి నేను కనిపెట్టానని వసు కు వివరిస్తుంది.
తరువాత రిషి, జగతి (Jagathi) ని తల్లిగా ఎంత మిస్ అయ్యాడో, రిషిని కొడుకుగా జగతి ఎంత మిస్ అయ్యిందో ఆ విషయం గురించి మాట్లాడుతూ వసు కు చెప్పుకుంటూ బాధపడుతుంది. రిషి (Rishi) ద్వేశం లో న్యాయం ఉంది, తన కోపంలో నిజముందన్నట్టు మాట్లాడుతుంది.
మరోవైపు గౌతమ్ (Gautham ) గీసిన వసు చిత్రాన్ని చూస్తూ మురిసి పోతాడు. ఈలోగా అక్కడకు రిషి వస్తాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య చిన్నపాటి ఫ్రెండ్లీ వార్ జరుగుతుంది. చివరిగా గౌతమ్ నాకు అన్ని విషయాల్లో అడ్డుపడుతునావ్ రా అని అంటాడు. నువ్వు నా ఫ్రెండు కాబట్టి హెల్ప్ చేస్తున్న అని రిషి (Rishi) చెబుతాడు.
తరువాత వసుధార (Vasudhara) రిషికి ఫోన్ చేసి ఒక దగ్గరికి రమ్మని అంటుంది. ఆ తర్వాత గౌతమ్, రిషిను (Rishi) ఒక లవ్ లెటర్ రాసి పెట్టమని అడుగుతాడు. రిషి దానికి ఏం స్పందిస్తాడో తరువాయి భాగంలో చూడాలి.