Intinti Gruhalakshmi: తల్లి కాబోతున్న శృతి.. వేడుకలు జరగకుండా తులసిని అడ్డుకున్న లాస్య?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు డిసెంబర్ 26వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
ఈరోజు ఎపిసోడ్లో అంకిత కోపంగా నాకు ఫ్రిజ్ కీస్ కావాలి అని అంటుంది. ఎందుకు అని లాస్య అడగగా చెప్తే కానీ ఇవ్వవా అనడంతో రీజన్ చెప్పడానికి నీకు ఏమీ అని అంటుంది లాస్య. చెప్పాల్సిన అవసరం ఏంటి అనడంతో నేను అడుగుతున్నాను కాబట్టి చెప్పాలి అని అంటుంది. ఇన్ని రోజులైనా నేను ఎవరో నీకు తెలియ లేదా అయితే చెప్తాను విను ఈ ఇళ్ళు నాది ఈ ఇంటి యజమాని నేను ఇంట్లో ఏం జరిగినా ఏం మాట్లాడినా అని నా ఆధీనంలో ఉండే జరగాలి అని అంటుంది లాస్య. ఇంతలోనే శృతి, దివ్య పరంధామయ్యలు వస్తారు. అప్పుడు లాస్య మాటలు అందరూ కోపంతో రగిలిపోతూ ఉంటారు.
అప్పుడు పరంధామయ్య ఎందుకు అంకిత గొడవలు అనడంతో అంకితను నా మీదకు ఉసుగొలిపి ఇప్పుడు ఏమి తెలియనట్లు నాటకాలు వాడుతున్నారా మామయ్య అని అంటుంది లాస్య. ఆయనకు నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు అనసూయ అనగా అందరూ కలిసి నా మీదకి దాడికి దిగారా అని అంటుంది లాస్య. అప్పుడు అంకిత గొడవ చేస్తూ ముందు ఫ్రిడ్జ్ కీస్ ఇస్తావా లేదా అనడంతో ఇవ్వను అని అంటుంది లాస్య. మీకు ఇష్టం వచ్చినట్టు రోజుకి రెండు మూడు సార్లు కాఫీలు స్నాక్స్ అని తింటూ పోతే ఏంటి ఖర్చు మీద ఎవరికి బాధ్యత ఉంటుంది అంటూ ఓవర్ గా మాట్లాడుతుంది లాస్య. ఇన్ని రోజులు మీకు ఆ అలవాటు లేదేమో ఇప్పటినుంచి అలవాటు చేసుకోండి అని అంటుంది.
అప్పుడు దివ్య తాతయ్య ఆరోగ్యం గురించి నీకు తెలుసా అనడంతో ముందు నువ్వు నన్ను పిన్ని అని పిలవడం అలవాటు చేసుకో పిల్ల కోడి అని తిడుతుంది లాస్య. మావయ్య గారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడుతారో మధ్యలో మీ గోల ఏంటి అని అంటుంది. అప్పుడు అనసూయని నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంది లాస్య. అరటి పండ్లు తెప్పించి పెట్టాను కదా ఆడడంతో అంకిత షుగర్ పేషంట్లు అరటి పండ్లు తింటారా అనడంతో ఒక్క పాల ప్యాకెట్ల కోసం ఇంత గొడవ అవసరమా అని అంటుంది లాస్య. అప్పుడు శృతి సీరియస్ అవుతూ మొన్నటి నుంచి చూస్తున్నాను ప్రతి ఒక్కదానికి ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అంటున్నావు.
ఇల్లు మోసం చేసి వ్రాయించుకున్నావు అనడంతో ఇంకొకసారి ఆ మాట మాట్లాడకు అనడంతో వంద సార్లు అంటాను అంటుంది శృతి. మరొక వైపు తులసి దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత లాస్య నువ్వు ఎవరు లేని అనాధవి అంటూ తిని నోటికొచ్చిన విధంగా మాట్లాడుతుంది. నేను కాదు అనాధని నువ్వు అని అనడంతో షటాప్ అని అంటుంది లాస్య. యు షట్ అప్ అని గట్టిగా అరిచి కళ్ళు తిరిగి కిందపడిపోతుంది శృతి. మరోవైపు తులసి హారతిస్తుండగా అప్పుడు తన చేతిలోని ప్లేట్ కింద పడిపోవడంతో బాధపడుతూ ఉంటుంది. ఎందుకు స్వామి ఇలా జరిగేలా చేశావు అని బాధపడుతూ ఉంటుంది తులసి. మరొకవైపు అంకిత శృతికి చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు పరంధామయ్యలు టెన్షన్ పడుతూ ఉంటారు.
అప్పుడు అంకిత అసలు విషయం చెప్పకుండా టెన్షన్ పెడుతూ ఉండడంతో ఏమైందో చెప్పు అని అనగా శృతి తల్లి కాబోతోంది అనడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు శృతి తులసికి ఫోన్ చేస్తుంది. శృతి అసలు విషయం చెప్పడంతో తులసి సంతోషపడుతూ ఈ విషయం కోసం నేను ఎన్నాళ్ళ నుంచి ఎదురుచూస్తున్నాను అని అంటుంది. అప్పుడు తులసి సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు తులసీ తన ఇంటికి శృతి కోసం పరుగు పరుగున సీడ్స్ అవన్నీ తీసుకుని వస్తుంది. అప్పుడు లాస్య ఎదురు పడుతుంది. కంగ్రాట్యులేషన్స్ అని చెప్పడంతో ఎందుకు చెబుతున్నావు అని అడగగా నానమ్మకు కాబోతున్నావు అనడంతో లాస్య కు అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది. తులసి ఏం మాట్లాడుతుంది నందు తాతయ్య కాబోవడమేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది లాస్య.
అప్పుడు తులసి సంతోషంగా మాట్లాడుతూ చీర పసుపు కుంకుమ ఫ్రూట్స్ అని తీసుకుని వచ్చాను అని అంటుంది. అప్పుడు నేను ప్రెగ్నెంట్ అయితే కాదు ఇక్కడ కూడా ప్రెగ్నెంట్ అన్న వార్త ఎవరు నాకు చెప్పలేదు అనడంతో అంకిత శృతి ఇద్దరూ తలదించుకుంటారు. అప్పుడు తులసి ఏంటి శృతి లాస్య ఇలా మాట్లాడుతుంది అని అంటుంది. నువ్వు నెలతప్పిన విషయం లాస్య కు తెలియదా అనడంతో లాస్య షాక్ అవుతుంది. అప్పుడు లాస్య శృతిని వెటకారంగా మాట్లాడిస్తూ కంగ్రాచ్యులేషన్స్ అని చెబుతూ ఉంటుంది. అప్పుడు తులసి లోపలికి వెళ్దాం పదండి పండగ చేసుకుందాం అనడంతో లాస్య అడ్డుపడుతుంది. పండగ జరగాల్సింది నా ఇంట్లో ఈ ఇంటికి కోడలుగా నేను పండగ తెరపాలి అసలు నీకు ఏమి హక్కు ఉంది అని అంటుంది లాస్య.
సంబంధం లేనిదితులసి ఆంటీకి కాదు నీకు అని అంటుంది శృతి. నేను తులసి ఆంటీ కోడలిని అనడంతో లాస్య కాదు నందగోపాల్ గారి కోడలివి నా కోడలివి ఇంట్లో సర్వహక్కులు నావే అని అంటుంది. గొడవ ఎందుకు లాస్య నీ చేతుల మీదే శుభకార్యం కానివ్వు అనడంతో కుదరదు మీ చేతుల మీదే కానీ ఇవ్వాలి అని అంటుంది శృతి. అప్పుడు లాస్య నువ్వు కనిపిస్తే చాలు మీ వాళ్ళందరికీ పూనకాలు వస్తాయి తోక తొక్కిన పాములా లేస్తూ ఉంటారు అని అంటుంది. నాకు ఇల్లు ప్రశాంతంగా ఉండడం ఇష్టం నువ్వు కూడా అదే కావాలి అనుకుంటే వెంటనే వచ్చిన దానిని వెళ్లిపో అని అంటుంది లాస్య. అప్పుడు లాస్య కావాలనే గొడవ క్రియేట్ చేస్తుంది.