MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Good Bad Ugly 3 Days Collections: `డ్రాగన్‌`ను అధిగమించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ`.. బాక్సాఫీస్ వద్ద రికార్డు!

Good Bad Ugly 3 Days Collections: `డ్రాగన్‌`ను అధిగమించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ`.. బాక్సాఫీస్ వద్ద రికార్డు!

Good Bad Ugly 3 Days Collections: ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మూడవ రోజు వసూళ్ల వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 13 2025, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Good Bad Ugly 3 Days Collections

Good Bad Ugly 3 Days Collections

Good Bad Ugly 3 Days Collections:  అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ `గుడ్ బ్యాడ్ అగ్లీ`. ఈ చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఇందులో అజిత్ భార్యగా త్రిష నటించింది.

ఈ చిత్రంలో ప్రసన్న, సునీల్, రెడిన్ కింగ్స్లీ, ప్రియా వారియర్, అర్జున్ దాస్, ప్రభు, సిమ్రాన్ వంటి భారీ తారాగణం నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్

గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్

అజిత్ మాస్ విందు

`గుడ్ బ్యాడ్ అగ్లీ` చిత్రం భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న విడుదలైంది. కొడుకును కాపాడుకునే గ్యాంగ్‌స్టర్ తండ్రి కథే ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ. పాత కథే అయినా అజిత్ అభిమానులను సంతృప్తి పరిచే విధంగా సినిమా నిండా మాస్ సన్నివేశాలు, బిల్డప్‌లతో విందు భోజనం వడ్డించారు ఆదిక్.

ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలిమెంట్లని జోడించారు, పైగా వింటేజ్‌ అజిత్‌ని చూపించారు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇది ఫస్ట్ డే నుంచి మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. పెద్ద హిట్‌ దిశగా వెళ్తుంది.

 

34
గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్సాఫీస్

గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్సాఫీస్

గుడ్ బ్యాడ్ అగ్లీ 100 కోట్ల వసూళ్లు

`గుడ్ బ్యాడ్ అగ్లీ` చిత్రం విడుదలైన మొదటి రోజే తమిళనాడులో రూ.30 కోట్లు వసూలు చేసి కొత్త చరిత్ర సృష్టించింది. మొదటి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.78.5 కోట్లు వసూలు చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ, మూడో రోజు ముగిసే సమయానికి 100 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

ఈ ఏడాది 100 కోట్లు వసూలు చేసిన మూడో తమిళ చిత్రంగా `గుడ్ బ్యాడ్ అగ్లీ` నిలిచింది. దీనికి ముందు `విడాముయార్చి`, `డ్రాగన్` సినిమాలు ఈ ఘనత సాధించాయి. అంతేకాకుండా ఈ ఏడాది అత్యంత వేగంగా 100 కోట్లు వసూలు చేసిన చిత్రంగా `గుడ్ బ్యాడ్ అగ్లీ` నిలవడం విశేషం. ం. ఈరోజు సెలవు దినం కావడంతో గుడ్ బ్యాడ్ అగ్లీ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

44
విడాముయార్చిని ఓడించిన గుడ్ బ్యాడ్ అగ్లీ

విడాముయార్చిని ఓడించిన గుడ్ బ్యాడ్ అగ్లీ

`విడాముయార్చి`  లైఫ్ టైమ్ వసూళ్లకు ఎసరు

అజిత్ నటించిన చివరి చిత్రం విడాముయార్చి మొత్తం రూ.137 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఆ సినిమా లైఫ్ టైమ్ వసూళ్ల రికార్డును గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా బద్దలు కొట్టే అవకాశం ఉంది. `గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమా ఈరోజు తమిళనాడులో రూ.11.3 కోట్లు వసూలు చేసింది.

కోట్ సినిమా తర్వాత 4వ రోజు అత్యధికంగా బుకింగ్స్ జరిగిన సినిమా `గుడ్ బ్యాడ్ అగ్లీ` కావడం విశేషం. లాంగ్‌ రన్‌లో ఇది భారీ వసూళ్లని రాబట్టే ఛాన్స్ ఉంది. ఈ నెలలో మరే పెద్ద సినిమా లేదు. దీంతో ఈ నెల మొత్తం అజిత్‌ మూవీ రచ్చ ఉండబోతుందని చెప్పొచ్చు. 

read  more: Jaat Collections: `జాట్` డే 3 కలెక్షన్లు, సన్నీ డియోల్ మూవీకి సీన్‌ రివర్స్

also read: అల్లు అర్జున్‌ కటౌట్‌పై అల్లు అరవింద్‌ సెటైర్లు, సొంత కొడుకునే అంత మాట అన్నాడా? `ఆర్య` వెనుక క్రేజీ స్టోరీ

 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Recommended image2
Hema: చంపేస్తానేమో అని భయం వేసింది.. డిప్రెషన్ నుంచి హేమ ఎలా బయటపడిందో తెలిస్తే షాక్ అవుతారు!
Recommended image3
Toxic Collections: 300 కోట్లు దాటిన యశ్ మూవీ, భారీగా పడిపపోయిన టాక్సిక్ కలెక్షన్స్, 6 వరోజు ఎంత వసూలు చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved