- Home
- Entertainment
- Friday Releases: ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో తెలుసా? మూవీ లవర్స్ కి పండగే పండగ
Friday Releases: ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో తెలుసా? మూవీ లవర్స్ కి పండగే పండగ
Friday Releases: సమ్మర్‌లో చాలా వరకు పెద్ద సినిమాలు వస్తుంటాయి. కానీ ఇటీవల కాలంలో మాత్రం సమ్మర్‌లో పెద్ద సినిమాలు రావడం లేదు. మీడియం రేంజ్ మూవీస్ ఎక్కువగా విడుదలవుతున్నాయి. సమ్మర్‌లో ఆడియెన్స్ థియేటర్‌లోకి రావడం తగ్గిపోతుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ కూడా చిన్న సినిమాలను, మీడియం రేంజ్ మూవీస్‌నే విడుదల చేస్తున్నారు. కొన్ని పెద్ద మూవీస్ ప్లాన్ చేసినా అవి రకరకాల కారణాలతో వాయిదాలు పడుతున్నాయి. ఇక ఈ వారం(ఏప్రిల్ 10, 11) విడుదలయ్యే సినిమాలేంటి? థియేటర్లో ఎన్ని వస్తున్నాయి? ఓటీటీలో ఎన్ని రిలీజ్ అవుతున్నాయనేది చూస్తే.

good bad ugly, jaat, jack movie
Friday Releases: ఈ వారం ఓ రేంజ్ సినిమాలు విడుదలవుతున్నాయి. తెలుగు నుంచి చిన్న చిత్రాలే ఉన్నా, తమిళం, హిందీ నుంచి మాత్రం పెద్ద మూవీస్ ఉన్నాయి. ఈ గురువారం ఏప్రిల్ 10న థియేటర్లోకి మూడు సినిమాలు వస్తున్నాయి. ఏప్రిల్ 11న ఒక సినిమా ఉంది. మరి గురువారం రోజున తెలుగు మూవీ ఒక్కటే ఉంది.
టిల్లుగా పాపులర్ అయిన సిద్దు జొన్నలగడ్డ హీరోగా, వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా నటించిన `జాక్` మూవీ విడుదలవుతుంది. ఇది కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. దీనికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి.
good bad ugly, jaat
అదే రోజు రెండు డబ్బింగ్ చిత్రాలున్నాయి. కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటించిన `గుడ్‌బ్యాడ్ అగ్లీ` చిత్రం తెలుగులో విడుదలవుతుంది. ఇందులో త్రిష హీరోయిన్ కావడం విశేషం. కాంబినేషన్ పరంగా క్రేజ్ ఉంది. కానీ ప్రమోషన్స్ లేకపోవడంతో బజ్ క్రియేట్ కావడం లేదు.
అదే సమయంలో తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని హిందీలో స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా రూపొందించిన `జాట్` కూడా ఈ గురువారమే విడుదలవుతుంది. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది రాబోతుంది. అయితే ఇది హిందీ వెర్షన్ మాత్రమే విడుదలవుతుందని తెలుస్తుంది.
akkada ammayi ikkada abbayi
శుక్రవారం రోజున తెలుగు మూవీ `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` విడుదలవుతుంది. ఇందులో యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించగా, టీవీ నటి దీపికా పిల్లి హీరోయిన్‌గా నటించింది. లవ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది.
ఫన్ ప్రధానంగా సాగుతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. దీంతోపాటు `కౌసల్య తనయ రాఘవ` అనే చిన్న సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. మరి ఈ చిత్రాలు ఏ మేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.
court movie review
ఇక ఓటీటీలో ఈ వారం వచ్చే సినిమాల గురించి చూస్తే, వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో భారీగానే మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం బాగానే సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయి. ఏప్రిల్ 11న `కోర్ట్` మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
ఇది థియేటర్లో పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతోపాటు `పెరుసు` అనే మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. వీటితోపాటు ఏప్రిల్ 10న `బ్లాక్ మిర్రర్` అనే వెబ్ సిరీస్, `ప్రోజెన్ హాట్ బాయ్స్` మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
tuk tuk movie review
అమెజాన్ ప్రైమ్‌లో వీడియోలో `ఛోరీ 2` అనే హిందీ మూవీ ఏప్రిల్ 11న స్ట్రీమింగ్ అవుతుంది. ఇదే రోజు జియో హాట్ స్టార్‌లో `ది లెజెండర్ ఆఫ్ హనుమాన్ 6` యానిమేషన్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈటీవీ విన్‌లో తెలుగు మూవీ `టుక్ టుక్` ఏప్రిల్ 10న స్ట్రీమింగ్ అవుతుంది. `ఉత్తరం`, `లైఫ్ పార్ట్నర్` సిరీస్‌లు కూడా అదే రోజు ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
read more: మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ ఏ భార్య కొడుకో తెలుసా? సింగపూర్‌లో ఎందుకు ఉంటున్నాడంటే?