MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • అర్దరాత్రి 'విడిపోదాం' అంటూ రితేశ్‌ మెసేజ్‌,షాక్ అయ్యా : జెనీలియా

అర్దరాత్రి 'విడిపోదాం' అంటూ రితేశ్‌ మెసేజ్‌,షాక్ అయ్యా : జెనీలియా

అర్థ‌రాత్రి దాటాక తెల‌తెల్ల‌వారుతుండ‌గా 2.30 గం.ల‌కు ఆ టెక్ట్స్ మెసేజ్ చ‌దివి ఏం జ‌రిగిందో అర్థంగాక చాలా ఆవేద‌న చెందాన‌ని జెనీలియా చెప్పుకొచ్చింది. 

3 Min read
Author : Surya Prakash
Published : Oct 04 2024, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Genelia D’Souza, Riteish Deshmukh, breakup

Genelia D’Souza, Riteish Deshmukh, breakup


జెనీలియా అనగానే మనకు  అంతేనా వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ అనే డైలాగ్ గుర్తు వస్తుంది.  జెనీలియా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ హిట్  బొమ్మరిల్లు మూవీలో హాసిని పాత్ర అందరికి గుర్తుండి పోతుంది.  అంతక ముందు వరకు ఎలాంటి క్రేజ్, గుర్తింపు రాని జెనీలియాకు బొమ్మరిల్లు గుర్తుండి పోయే మెమొరీస్ ను ఇచ్చింది. తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళ, మరాఠీ సినిమాల్లో కూడా నటించింది. 2012లో నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలం బ్రేక్ తీసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


ప్రేమించి పెళ్లిచేసుకున్న జంట రితీష్ దేశ్‌ముఖ్ - జెనీలియా డిసౌజా.  వీళ్లిద్దరూ  2002లో కలుసుకుని...చాలా కాలం పాటు ప్రేమ‌లో ఉన్నారు. 2012లో వివాహం చేసుకున్నారు. అయితే ఒక అర్థ‌రాత్రి రితేష్ పెట్టిన ఓ మెసేజ్ కి కంగారు ప‌డ్డాన‌ని, చాలా కుంగిపోయాన‌ని జెనీలియా కామెంట్ చేయటం హాట్ టాపిక్ అయింది. అర్థ‌రాత్రి దాటాక తెల‌తెల్ల‌వారుతుండ‌గా 2.30 గం.ల‌కు ఆ టెక్ట్స్ మెసేజ్ చ‌దివి ఏం జ‌రిగిందో అర్థంగాక చాలా ఆవేద‌న చెందాన‌ని జెనీలియా చెప్పుకొచ్చింది. అసలేం జరిగింది..ఆ విషయాల్లోకి వెళ్దాం. 
  

37
Genelia

Genelia


సిద్దార్ద్  తో  చేసిన  ‘బొమ్మరిల్లు’సూపర్ హిట్ తో తెలుగువారికి బాగా చేరువైంది జెనీలియా (Genelia).ఆ తర్వాత ఆమె  బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ (Riteish Deshmukh)తో వివాహం తర్వాత ఆమె ముంబయిలో సెటిలైన విషయం తెలిసిందే. ఈ జంటకు మూవీ లవర్స్ లో  మంచి ఫాలోయింగ్‌ ఉంది. తరచూ సరదా వీడియోలు చూస్తూ క్యూట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. 
 

47


శ్రేయా గోధావత్ యూట్యూబ్ ఛానెల్‌లో ఒక ఇంటర్వ్యూలో జెనీలియా డిసౌజా త‌మ డేటింగ్ రోజులు గురించి మాట్లాడింది. డేటింగ్ స‌మ‌యంలోనే రితీష్ లోని చిలిపిత‌నం గురించి గుర్తు చేసుకుంది.  తన భర్త రితేశ్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రితేశ్‌ చాలా సింపుల్‌, లవ్లీ పర్సన్‌ అన్నారు. ఆయన్ని పెళ్లి చేసుకోవడం తాను తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఒకటన్నారు. డేటింగ్‌లో ఉన్నప్పుడు ఊహించని చర్యలతో ఆయన షాక్‌కు గురిచేసేవాడన్నారు.

57

 
జెనీలియా మాట్లాడుతూ... ‘‘మేము డేటింగ్‌లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. దానిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. రితేశ్‌కు ఆలస్యంగా నిద్రపోవడం అలవాటు. నేనేమో చాలా త్వరగా నిద్రలోకి జారుకుంటా. ఓరోజు ఏమైందో ఏమో తెలియదు.. అర్ధరాత్రి 1 గంటకు రితేశ్ నాకొక సందేశం పంపారు.

‘‘ఇక, అంతా అయిపోయింది’’ అంటూ అదొక బ్రేకప్‌ సందేశం. తెల్లవారుజామున ఆ సందేశం చూసి నేను షాకయ్యా. చాలా బాధగా అనిపించింది. ఉదయం 9 గంటల వరకు.. రితీష్ మేల్కొనే వరకు తాను చాలా బాధప‌డ్డానని జెనీలియా డిసౌజా వెల్లడించింది. మరుసటి రోజు ఉదయం రితీష్ తనకు ఫోన్ చేసిన విషయాన్ని జెనీలియా గుర్తు చేసుకుంది. 

67


ఏం జరిగిందో? ఆయన ఎందుకు ఇలా చెప్పారో? అర్థం కాక సతమతమయ్యా. నిద్రలేచిన తర్వాత తాను పంపిన సందేశం గురించి రితేశ్‌ పూర్తిగా మర్చిపోయారు.  ఫోన్ చేసి ‘‘ఏం చేస్తున్నావు?’’ అని అడిగారు. నాకు కోపం వచ్చేసింది. ‘‘ఇకపై మనం మాట్లాడుకోకపోవడం మంచిది. నువ్వేం అనుకుంటున్నావు.

ఏం జరగనట్లు అలా, ఎలా మాట్లాడుతున్నావు?’’ అని కేకలు వేశా. రాత్రి జరిగింది గుర్తు చేసుకుని.. తాను కేవలం జోక్‌గా ఆ సందేశం పంపినట్లు చెప్పారు’’ అని జెనీలియా తెలిపారు.సరే.. ఏప్రిల్ ఫూల్స్ డే కావడంతో అలా చేశానని రితీష్ వివరించాడు. ఆ త‌ర్వాత అంతా స‌ర్ధుకుంది. 
 

77

2003లో విడుదలైన ‘తుజే మేరీ కసమ్‌’ కోసం జెనీలియా, రితేశ్‌ తొలిసారి కలిసి వర్క్‌ చేశారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో వీరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఆపై దాదాపు పదేళ్లు డేటింగ్‌లో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2012లో వివాహం చేసుకున్నారు.

2022లో వీరిద్దరూ కలిసి యాక్ట్‌ చేసిన ‘వేద్‌’ మంచి విజయాన్ని అందుకుంది. ‘మజిలి’కి రీమేక్‌గా తెరకెక్కిన మరాఠి మూవీ ఇది. మధ్యలో గెస్ట్ రోల్స్‌ లో మెరిసి అందర్ని ఆకట్టుకుంటోంది. జెనీలియా అద్భుత క్రీడాకారిణి కూడా ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రాకముందు ఆటల్లో ముందుండేది. ఆమె రాష్ట్ర స్థాయి క్రీడాకారిణి, జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణి.  
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved