- Home
- Entertainment
- సావిత్రికి మరో వ్యక్తితో సంబంధం ఉంది.. మా కుటుంబాన్ని నాశనం చేసింది.. జెమిని గణేషన్ కూతురు బోల్డ్ కామెంట్
సావిత్రికి మరో వ్యక్తితో సంబంధం ఉంది.. మా కుటుంబాన్ని నాశనం చేసింది.. జెమిని గణేషన్ కూతురు బోల్డ్ కామెంట్
మహానటి సావిత్రిపై జెమినీ గణేషన్ కూతురు కమలా సెల్వరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సావిత్రి తమ ఫ్యామిలీని నాశనం చేసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సావిత్రిపై జెమినీ గణేషన్ కూతురు సంచలన వ్యాఖ్యలు
మహానటి సావిత్రి చాలా పేద కుటుంబం నుండి సినిమాల్లోకి వచ్చి, తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయ్యారు. ఎంత త్వరగా ఎదిగారో, అంతే త్వరగా పతనమయ్యారు. ఆమె జీవితం విషాదాంతమైంది. సావిత్రి జీవితం సినీ పరిశ్రమలో చాలా మందికి ఒక పాఠంగా నిలుస్తోంది. జెమిని గణేషన్‌కి ఇప్పటికే పెళ్లయిందని తెలిసినా, ఆయన్ని ప్రేమించి రెండో భార్య అయ్యారని, నాన్నని బ్లాక్ మెయిల్ చేశారని జెమిని కూతురు కమలా సెల్వరాజ్ షాకింగ్ కామెంట్ చేశారు. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
KNOW
సావిత్రి మా కుటుంబాన్ని నాశనం చేసింది
ఇందులో కమలా మాట్లాడుతూ, ``ఒకరోజు కుండపోత వర్షంలో సావిత్రి వచ్చినప్పుడు, ఆమె చెడిపోకూడదని ఆమెకు తాళి కట్టి గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చారు నాన్న. ఆమెకు తమిళం రాదు. సంతకం పెట్టడం నేర్పించి, కారు నడపడం నేర్పించి, గౌరవంగా బతకడం నేర్పించారు. కానీ పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసినా, నాన్నని ప్రేమించి, బ్లాక్ మెయిల్ చేసి 15 ఏళ్లు మా ఇంటికి రానివ్వలేదు. మా కుటుంబాన్ని నాశనం చేసింది సావిత్రి” అని కమలా సెల్వరాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
నాన్నని నటించిన ప్రతి హీరోయిన్ ప్రేమించింది
ఇంకా ఆమె స్పందిస్తూ, “నాన్నతో నటించిన ప్రతి హీరోయిన్ ఆయన్ని ప్రేమించింది. చాలా మంది ఆయన్ని ప్రేమించారు. అందరికీ ఆయన జీవితాన్ని ఇవ్వలేరు. చివరి వరకు ఆయన మా అమ్మను ప్రేమించారు. ఆమె మీద ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. రోడ్డు మీద ఆడుకుని అమ్మ దగ్గరికి వచ్చే పిల్లాడిలాగే నాన్న కూడా. ఆయన కూడా ఒక పిల్లాడే. ఆయనలాంటి మంచి నాన్న ఎవరూ లేరు. పిల్లలను బాగా పెంచారు` అని వెల్లడించారు.
సావిత్రికి మరో వ్యక్తితో సంబంధం ఉంది
సావిత్రి పిల్లలను కూడా బాగా చూసుకున్నారు. సావిత్రి తెలుగులో ఫేమస్. ఆమె జీవితం తాగుడు వల్ల నాశనమైందని అంగీకరించలేక, నాన్న మీద నింద వేశారు. ఎవరికీ నిజం తెలియదు. మహానటి సినిమా వచ్చినప్పుడు నాన్నని హంతకుడని పోస్టర్లు అంటించారు. నాన్నని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉంది. ఇలాంటి తప్పులు చేసినందుకే ఆమెకు చివరికి శిక్ష పడింది” అని సావిత్రి గురించి కమలా సెల్వరాజ్ షాకింగ్ కామెంట్ చేశారు. బిహైండ్‌వుడ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పింది కమల.