MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవర్ స్టార్‌ని వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్.. ఓజీ తో బ్రేక్ పడేనా?

పవర్ స్టార్‌ని వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్.. ఓజీ తో బ్రేక్ పడేనా?

Pawan Kalyan OG Movie: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న “ఓజీ” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.. ప్రస్తుతం టాలీవుడ్ అంతా ఆసక్తిగా చూస్తున్న ప్రశ్న ఒక్కటే. పవర్ స్టార్‌ని వెంటాడుతున్న ఆ సెంటిమెంట్ కు బ్రేక్ అవుతుందా?

2 Min read
Author : Rajesh K
Published : Aug 31 2025, 01:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్ కళ్యాణ్ బ్యాడ్ సెంటిమెంట్
Image Credit : Youtube print shot/ Sony Music South

పవన్ కళ్యాణ్ బ్యాడ్ సెంటిమెంట్

Pawan Kalyan OG Movie: పవన్ కళ్యాణ్ బ్యాడ్ సెంటిమెంట్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న “ఓజీ” సినిమా మొదటి నుంచే భారీ అంచనాలు పెంచేసింది. ప్రీ-లుక్ పోస్టర్‌తోనే సినిమాపై ఆడియెన్స్‌, సినీ సర్కిల్స్‌లో భారీ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఆ తరువాత వచ్చిన మూవీ అప్డేట్స్ సినిమాపై భారీ అటెన్షన్ రప్పించగలిగారు. అంత బాగానే ఉన్న పవర్ స్టార్‌ పవన్ కళ్యాన్ ను ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుందట. ఇంతకీ ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏంటీ? ఓజీ మూవీతో ఆ సెంటిమెంట్ కు బ్రేక్ పడుతుందా ?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఓజీకి లైన్ క్లియర్
Image Credit : Asianet News

ఓజీకి లైన్ క్లియర్

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నిరాశ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ మాస్ ఆడియెన్స్‌కి సరికొత్త ఎనర్జీ ఇవ్వబోతున్నాడు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న “ఓజీ” దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. మొదట్లో బాలకృష్ణ–బోయపాటి కాంబోలో “అఖండ 2” కూడా దసరాకి వస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ, తాజాగా ఆమూవీ వాయిదా పడింది. దసరా రేసు నుంచి తప్పుకుంది. దీంతో “ఓజీ”కి లైన్ క్లియర్ అయ్యింది.

35
కెరీర్‌లో మైలురాయి
Image Credit : Youtube print shot/ Sony Music South

కెరీర్‌లో మైలురాయి

డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, సిరి లేళ్ల లాంటి నటీనటులు కీలక పాత్రల్లో మెప్పించబోతున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలవబోతుందనే ఫ్యాన్స్ తెగ నమ్ముతున్నారు.

45
ఓజీ స్టోరీ లైన్ ఇదేనా?
Image Credit : Asianet News

ఓజీ స్టోరీ లైన్ ఇదేనా?

సోషల్ మీడియాలో వైరలవుతున్న స్టోరీ లైన్ ప్రకారం.. “ఓజస్ గంభీర” అనే మాఫియా డాన్ పదేళ్ల తర్వాత మళ్లీ అండర్‌వరల్డ్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చి, గతంలో తనకు ద్రోహం చేసిన ఓమి భావుని కూల్చి తన సామ్రాజ్యాన్ని తిరిగి ఎలా హస్తగతం చేసుకున్నాడన్నదే సినిమా కథ. పవన్ లుక్, సుజీత్ స్టైలిష్ టేకింగ్ ఈ సినిమాని మరో లెవెల్‌కి తీసుకెళ్లనున్నాయన్న బజ్ క్రియేట్ అయ్యింది. ఇటీవల వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన “సువ్వి సువ్వి” సాంగ్‌కు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ఇక సెప్టెంబర్ 25న వరల్డ్‌వైడ్ రిలీజ్ అవ్వనున్న ఈ మూవీ, అమెరికాలో మాత్రం ఒక రోజు ముందుగానే (సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు రానుంది.

55
సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా?
Image Credit : X

సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ “ఓజీ”లో రూత్‌లెస్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్‌మెంట్ నెలకొంది. అయితే పవన్ కళ్యాణ్ గత అనుభవాలు మాత్రం అభిమానుల్లో కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఇంతకుముందు పవన్ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన “బాలు”, “పంజా” సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మారాయి. ఇప్పుడు మూడోసారి అదే జానర్‌లో నటిస్తున్న పవన్ కళ్యాణ్ కు “ఓజీ” తో ఆ సెంటిమెంట్ బ్రేక్ పడుతుందా? లేక మళ్లీ అదే ట్రాక్ రిపీట్ అవుతుందా? అన్నది వేచిచూడాలి. ఈ సినిమా ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
OG: అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌లకు పవన్‌ కళ్యాణ్‌ ఝలక్‌.. అక్కడ అన్ని రికార్డులు బ్రేక్‌
Recommended image2
`OG`లో అకీరా నందన్‌.. మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే వార్త చెప్పిన అన్నయ్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved