రిషబ్ శెట్టి అసలు పేరు ఏంటి? సాధారణ హోటల్ సర్వర్ స్టార్ గా ఎలా మారాడు?
Rishab Shetty : కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి అసలు పేరు ఏంటో తెలుసా? హోటల్ సర్వర్ గా పనిచేసిన రిషబ్ స్టార్ హీరోగా ఎలా మారాడు? తన పేరునుమార్చుకోవడం వెనుక అసలు కథ ఏంటి?

రిషబ్ శెట్టి పేరు మార్చింది ఎవరు?
కాంతార సినిమా రిషబ్ శెట్టిని కన్నడ సినిమా నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మార్చేసింది. ఇప్పుడు ఈ సినిమా రెండో భాగం 'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మార్కును దాటింది. ఈ నేపథ్యంలో, సినిమా నటుడు, దర్శకుడు న రిషబ్ శెట్టి తన అసలు పేరును బయటపెట్టారు. నిజానికి, రిషబ్ ఇటీవల 'ది రైట్ యాంగిల్ సీజన్ 2'కి అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా, తన అసలు పేరు వేరే ఉందని చెప్పడమే కాకుండా, దాన్ని మార్చడానికి గల కారణాన్ని కూడా వెల్లడించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం, జ్యోతిష్కుడైన తన తండ్రి, ఆయన అదృష్టం, విజయం కోసం పేరు మార్చారట.
రిషబ్ శెట్టి అసలు పేరు ?
రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్, కొన్నేళ్ల క్రితం తన తండ్రి సలహా మేరకు తన పేరును రిషబ్ గా మార్చుకున్నానని కాంతార హీరో చెప్పారు. ఆయన మాట్లాడుతూ, "నా అసలు పేరు ప్రశాంత్. ఇండస్ట్రీలో మంచి అవకాశాల కోసం నా పేరును రిషబ్‌గా మార్చుకోమని మా నాన్న సలహా ఇచ్చారు." 'కాంతార' స్టార్ ప్రశాంత్, రిషబ్ అనే రెండు పేర్లను కూడా తన తండ్రే ఎంచుకున్నారని వెల్లడించారు.
సినిమాల్లోకి రాకముందు రిషబ్ శెట్టి ?
42 ఏళ్ల రిషబ్ శెట్టి కర్ణాటకలోని కెరాడిలో జన్మించారు. ఆయన 2012 నుంచి సినిమాల్లో పనిచేస్తున్నారు. కానీ అంతకుముందు, జీవనం కోసం చాలా చిన్న చిన్న పనులు చేశారు. కొన్నిసార్లు వాటర్ క్యాన్లు అమ్మారు, మరికొన్నిసార్లు రియల్ ఎస్టేట్‌లో పనిచేశారు. ఒక హోటల్‌లో కూడా సర్వర్ గా పనిచేశాడు. అదే సమయంలో, సినిమాల్లో చిన్న చిన్న పాత్రల కోసం ప్రయత్నించేవారు. 2012లో నటుడిగా ఆయన మొదటి సినిమా 'తుగ్లక్' విడుదలైంది, అందులో ఆయన విలన్‌గా నటించారు.
నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి
ఒక్క సారి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తరువాత రిషబ్ శెట్టి తిరిగి చూసుకోలేదు. వెంట వెంటనే 'రిక్కీ', 'బెల్ బాటమ్', 'కథా సంగమ', 'మిషన్ ఇంపాజిబుల్', 'కాంతార' వంటి సినిమాలతో దూసుకుపోయాడు. 'రిక్కీ', 'కిరిక్ పార్టీ', 'కాంతార' వంటి సినిమాలకు దర్శకుడిగా కూడా పనిచేశారు. నటుడిగా, దర్శకుడిగా రిషబ్ తెరకెక్కించిన 'కాంతార చాప్టర్ 1' ఇండియాలో 493 కోట్ల నెట్ వసూళ్లు, , ప్రపంచవ్యాప్తంగా . 714 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. రిషబ్ శెట్టి రాబోయే సినిమాల్లో కన్నడలో ‘కాంతార చాప్టర్ 2’, తెలుగులో ‘జై హనుమాన్’, హిందీలో ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమాలు ఉన్నాయి.