ఒకే నెలలో నాలుగు మెగా హీరోల సినిమాలు రిలీజ్..షాకింగే
అందరూ ఒకే నెలలో ఒకరి తర్వాత మరొకరు తమ సినిమాలు దించటం మాత్రం ట్రేడ్ ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అవును...ఆగస్ట్ నెల పూర్తిగా మెగా హీరోల సినిమాలకే అంకితం కానుంది.వరస పెట్టి మెగా హీరోల సినిమాలు ఈ నెలలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అయితే అందరూ ఒకే నెలలో ఒకరి తర్వాత మరొకరు తమ సినిమాలు దించటం మాత్రం ట్రేడ్ ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ సినిమాలు ఏవేవి అంటే...
మొదటిగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అప్‌కమింగ్ మూవీ ‘బ్రో’నుంచి మెగా హవా మొదలవుతుంది. ఈ చిత్రం జులై 28న విడుదలవనుందని తెలిసిందే. జూలై నెలాఖరున విడుదల అయ్యే ఈ చిత్రం ఆగస్ట్ మొదటి వారం లో థియేటర్స్ లో ఖచ్చితంగా తన ప్రభావం చూపిస్తుంది. అంటే దాదాపు ఆగస్ట్ లో రిలీజ్ అయ్యినట్లే. సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పవన్.. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించారు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలకు తోడు తమన్ మ్యూజిక్ అందిస్తుండటంతో ప్రేక్షకుల్లో మూవీపై అంచనాలున్నాయి.
ఇక ఆ తర్వాత పవన్ అన్నయ్య చిరంజీవి భోళా శంకర్ రానున్నారు. భోళా శంకర్ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవికి జోడీగా తమన్నా భాటియా నటిస్తోంది. చిరంజీవికి చెల్లి పాత్రను స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ పోషిస్తోంది. భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం మూవీకి రీమేక్‍గా భోళా శంకర్ చిత్రం రూపొందుతోంది. గ్యాంగ్‍స్టర్ నుంచి ట్యాక్సీ డ్రైవర్‌గా మారిన పాత్రలో భోళా శంకర్‌లో చిరంజీవి కనిపించనున్నాడని తెలుస్తోంది. భోళా శంకర్ మూవీని రాంబ్రహ్మం సుంకర, కేఎస్ రామారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై వస్తోంది.
ఆ తర్వాత వరుణ్ తేజ్ తన తాజా చిత్రంతో రంగంలోకి దూకుతున్నాడు. ఆగస్టు 25న 'గాంఢీవ ధారి అర్జున' ప్రేక్షకులు ముందుకు రానుంది. 'ఎఫ్3' వంటి సూపర్ హిట్ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గాంఢీవ ధారి అర్జున'. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈసారి యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వరుణ్ తేజ్. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. వరుణ్ తేజ్ కెరీర్ లో 12వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాగబాబు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
ఫైనల్ గా ఈ వరసలో మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ రానున్నారు. ఆగస్ట్ 18 న రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే (Uppena) మంచి యాక్టర్ అనిపించుకున్నాడు. ఎక్స్‌ప్రెసివ్ కళ్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ అదే మ్యాజిక్‌ను ఆ తర్వాతి చిత్రాల్లో చూపించలేకపోయాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘కొండపొలం’ చిత్రానికి ప్రశంసలు లభించినా.. బాక్సాఫీస్ వసూళ్లు నిరాశపరిచాయి. ఇక తన చివరి చిత్రం ‘రంగరంగ వైభవంగా’ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. యంగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ (First Glimpse) రిలీజ్ చేయగా.. యాక్షన్ మూడ్‌లో దుమ్ములేపాడు వైష్ణవ్.