- Home
- Entertainment
- Naga Durga Remuneration: ఫోక్ డాన్సర్ నాగదుర్గ ఒక్క పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? గ్రేట్ అబ్బా
Naga Durga Remuneration: ఫోక్ డాన్సర్ నాగదుర్గ ఒక్క పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? గ్రేట్ అబ్బా
ఫోక్ సాంగ్స్ లో డాన్సులతో పాపులర్ అయ్యింది డాన్సర్ నాగదుర్గ. అందంతోపాటు అదిరిపోయే డాన్సులు చేస్తూ ఆకట్టుకుంటున్న ఆమె ఇప్పుడు ఒక్కో పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా?

ఫోక్ సాంగ్స్ కి కేరాఫ్ నాగదుర్గ
ప్రస్తుతం జానపద పాటల ట్రెండ్ నడుస్తోంది. అందులోనూ తెలంగాణ జానపదాలు యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి. ఒక్కో పాట సినిమా సాంగ్స్ ని మించి వ్యూస్‌ని పొందుతున్నాయి. మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. పదులు కాదు, వందల మిలియన్స్ తో యూట్యూబ్‌ని షేక్ చేస్తున్నాయి. అయితే ఫోక్ సాంగ్స్ తోపాటు ఒక ఫోక్ డాన్సర్ పాపులర్ అయ్యింది. ఆమెనే నాగదుర్గ. ఫోక్ సాంగ్స్ కి ఆమె కేరాఫ్‌గా నిలుస్తుంది. యూట్యూబ్‌లో ఏ ఫోక్ సాంగ్ చూసినా ఆమెనే కనిపిస్తున్నారు.
ఫోక్ డాన్సర్ గా ఊపేస్తున్న నాగదుర్గ
నాగదుర్గ.. ఫోక్ డాన్సర్ గా పాపులర్ అయ్యింది. ఈ డాన్సర్ ఇప్పటి వరకు 300లకుపైగా పాటలకు డాన్సు చేసిందంటే మామూలు విషయం కాదు. యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా ఈమె పాటలు, డాన్సులే కనిపిస్తాయి. అంతగా అలరిస్తోన్న నాగదుర్గకి `కాపోళ ఇంటికాడ` అనే పాట బాగా గుర్తింపు తెచ్చింది. ఇటీవల వచ్చిన `పేరుగళ్ల పెద్ది రెడ్డి` పాట మరింత పాపులారిటీని తీసుకొచ్చింది. ఇందులో ఆమె డాన్స్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.
యూట్యూబ్‌ని షేక్ చేస్తోన్న నాగదుర్గ ఎంత తీసుకుంటుంది
వీటితోపాటు `నాపేరు ఎల్లమ్మ`, `ఎర్ర రూమాల్`, `మామిడి కోనల మీన`, `దారిపొంటత్తుండు`, `జిల్లెలమ్మ జిట్ట`, `డిళ్లెం భళ్లెం ఎల్లమ్మ బోనం`, `అల్లల్లో నెరల్లో` వంటి పాటల్లో అదిరిపోయే డాన్సులతో ఆకట్టుకుంది నాగ దుర్మ. లేటెస్ట్ గా ఆమె `లగారే సౌండ్ సాలా` అనే పాటలో డాన్స్ చేసింది. ఇటీవల విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతుంది. మరి ఇప్పుడు ఫోక్ డాన్స్ లకు క్వీన్‌గా మారిన నాగదుర్గ.. ఒక్కో పాటలో నర్తించేందుకు ఎంత పారితోషికం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఆమె రెమ్యూనరేషన్ వివరాలు లీక్ అయ్యాయి.
నాగ దుర్గ పారితోషికం
ఇప్పుడు నాగదుర్గ అంటే ఫోక్ సాంగ్‌లకు కేరాఫ్.. ఆమెకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే ఒక్కో పాటకి డాన్స్ చేసినందుకుగానూ నాగదుర్గ రూ.30-50వేల వరకు డిమాండ్ చేస్తుందట. దీంతోపాటు కాస్ట్యూమ్ ఖర్చులు అదనం అని తెలుస్తోంది. అయితే సాంగ్‌ని బట్టి ఆమె పారితోషికంలో మార్పులు చేస్తుందట. తక్కువ ఇచ్చినా చేయడానికి రెడీగానే ఉంటుందట. తనకు పారితోషికం కంటే పాటే ముఖ్యమని, అదే సమయంలో పాట సాహిత్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందని, మంచి పద్ధతిగా ఉన్న లిరిక్‌కే ప్రయారిటీ ఇస్తుందని, డబుల్ మీనింగ్ పదాలు ఉంటే నిర్మొహమాటంగా నో చెబుతుందట. ఇలా చాలా పాటలే రిజెక్ట్ చేసినట్టు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది నాగదుర్గ. మొత్తంగా తనకు మంచి పేరు, పాపులారిటీ, క్రేజ్ వచ్చినా కూడా పారితోషికం విషయంలో ఆమె కంట్రోల్‌లో ఉండటం గొప్ప విషయమనే చెప్పొచ్చు.
హీరోయిన్‌గా నాగదుర్గ
ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా మారుతుందని సమాచారం. ఆ మధ్య `కలివనం` అనే సినిమాలో నటించిందట. ఇది ఇంకా రిలీజ్ కాలేదు. అలాగే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా ఓ మూవీ చేస్తుందట. ధనుష్ మేనల్లుడు పవీష్ హీరోగా రూపొందుతున్న `లవ్ హో లవ్` అనే చిత్రంలో నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది నాగదుర్గ. ఒక్క సినిమా హిట్ అయితే ఆమె లైఫే మారిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

