- Home
- Entertainment
- Flora Eliminated: బ్యూటీఫుల్ హార్ట్ అంటూ ఆ కంటెస్టెంట్‌పై ఫ్లోరా ప్రశంసలు..ఆమెకి స్వీట్ వార్నింగ్
Flora Eliminated: బ్యూటీఫుల్ హార్ట్ అంటూ ఆ కంటెస్టెంట్‌పై ఫ్లోరా ప్రశంసలు..ఆమెకి స్వీట్ వార్నింగ్
Flora Eliminated: బిగ్ బాస్ తెలుగు 9 ఐదో వారం ఎలిమినేషన్‌లో ఫ్లోరా సైనీ ఎలిమినేట్ అయ్యింది. ఆమె కమెడియన్ సుమన్ శెట్టి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.

ఫ్లోరా సైనీ ఎలిమినేట్
బిగ్ బాస్ తెలుగు 9 ఐదో వారం ఎలిమినేషన్ కి సంబంధించి ముందుగా ఊహించినదే జరిగింది. ఫ్లోరా సైనీ ఎలిమినేట్ అయ్యారు. రీతూ చౌదరీతోపాటు ఫ్లోరా సైనీ ఎవిక్షన్ కి ఛాన్స్ ఉన్నట్టుగా శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారం ఎపిసోడ్‌లో ముందుగానే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు నాగ్. ప్రారంభంలోనే రీతూ, ఫ్లోరా సైనీలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది సస్పెన్స్ నెలకొంది. ఇందులో ఊహించినట్టుగానే ఫ్లోరా సైనీ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు.
ఆ ముగ్గురుకి థంమ్స్ అప్ ఇచ్చిన ఫ్లోరా
ఎలిమినేట్ అయిన ఫ్లోరా ఈ జర్నీ చాలా సంతోషంగా ఉందని, తాను ఇన్ని రోజులు ఉండటం చాలా హ్యాపీగా ఉందని చెప్పింది. ఇది తనకు గొప్ప అవకాశమని వెల్లడించింది. అయితే ఎలిమినేషన్‌ని కూడా నవ్వుతూ స్వీకరించింది. ఇక స్టేజ్ మీదకు వచ్చాక కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది ఫ్లోరా. ఇందులో ముగ్గురుకి థంమ్స్ అప్, ముగ్గురు థంబ్స్ డౌన్ ఇవ్వాల్సి ఉంటుందని నాగ్ చెప్పగా.. సంజనా, దివ్య, ఇమ్మాన్యుయెల్ లకు థంమ్స్ అప్ ఇచ్చింది. సంజనా గురించి చెబుతూ, ఆమెలో చాలా షేడ్స్ ఉన్నాయని తెలిపింది. ఆమెతో జర్నీ చాలా బాగా సాగిందని, ఆమెని చాలా మిస్ అవుతున్నట్టు తెలిపారు. తనని బాగా టేక్ చేసిందని చెప్పింది. బాగా ఆడాలని తెలిపింది.
ఇమ్మాన్యుయెల్ పై ప్రశంసలు
ఇక దివ్య గురించి చెబుతూ, తను చాలా యంగ్ అని, కానీ చాలా క్లారిటీతో ఉంటుందని, ఆమె మాట్లాడే తీరు నచ్చుతుందని, చాలా స్పష్టంగా ఏదైనా అభిప్రాయం చెబుతుందన్నారు. ఆ తర్వాత ఇమ్మాన్యుయెల్ గురించి చెబుతూ, అందరితో చాలా బాగుంటాడని, అందరిని అర్థం చేసుకుంటారని, ఎంటర్‌టైన్ చేస్తారని, ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే సొల్యూషన్ ఇస్తారని, వ్యక్తిగతంగా చాలా ఇష్టమని, ఐ లవ్యూ చెప్పింది ఫ్లోరా.
సుమన్ హార్ట్ బ్యూటీఫుల్ అంటూ ఫ్లోరా స్టేట్‌మెంట్
ఇక థంమ్స్ డౌన్ గురించి చెబుతూ, భరణి గుడ్ పర్సన్ అని, కాకపోతే పప్పెట్‌లా మారిపోతున్నారని, దాన్నుంచి బయటపడాలని తెలిపింది ఫ్లోరా. ఇక తనూజ గురించి చెబుతూ, ఎక్కువ ఏడవొద్దు అని, ప్రతి దానికి అప్ సెట్ అవ్వొద్దు అని, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని, ఇరిటేట్ కావద్దు అని, గేమ్ బాగా ఆడాలని తెలిపింది. ఇక సుమన్ శెట్టి గురించి చెబుతూ, ఆయన్ని థంమ్స్ అప్, డౌన్ కి మధ్యలో పెట్టింది. హౌజ్‌లో మంచి పర్సన్ అని, ఆయనది బ్యూటీఫుల్ హార్ట్ తేల్చి చెప్పింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని తెలిపింది. ఏదైనా బాధపెడితే క్షమించమని, ఇంకా బాగా గేమ్ ఆడాలని వెల్లడించింది ఫ్లోరా. అయితే సుమన్ శెట్టి గురించి ఆమె ప్రత్యేకంగా వెల్లడించడం విశేషం.