- Home
- Entertainment
- Bigg Boss 9 Elimination: ఐదో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్
Bigg Boss 9 Elimination: ఐదో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్
బిగ్ బాస్ తెలుగు 9 ఐదో వారం ఎలిమినేషన్‌లో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుందట. ఓటింగ్ ప్రకారం కాకుండా బిగ్ బాస్ సొంత నిర్ణయం తీసుకున్నారని, ఓ క్రేజీ కంటెస్టెంట్‌ని ఎలిమినేట్ చేస్తున్నట్టు సమాచారం.

బిగ్ బాస్ తెలుగు 9 ఐదో వారం ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఐదో వారం వీకెండ్ ఆసక్తికరంగా మారింది. ఓ వైపు ఎలిమినేషన్ ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతుంది. మరోవైపు వైల్డ్ కార్డ్ ద్వారా కొత్త కంటెస్టెంట్లు హౌజ్ లోకి రాబోతున్నారు. దీంతో ఈ వారం వీకెండ్స్ పై అందరి దృష్టి పడింది. ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయనేదాని కోసం ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వీకెండ్‌లో నాగార్జున వచ్చి కంటెస్టెంట్లని క్లాస్ పీకడాలు, బాగా గేమ్స్ ఆడిన వారిని ప్రశంసించడం చేస్తుంటారు. ఆయన ఏం చెప్పబోతున్నానేది మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. అదే సమయంలో ఐదో వారం ఎలిమినేషన్ ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేదాని కోసం బిగ్ బాస్ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
రీతూ చౌదరీ, డీమాన్ పవన్ లను సేవ్ చేశారా?
డేంజర్ జోన్ నుంచి కొందరు సేవ్ కాగా, ఫైనల్‌గా నామినేషన్‌లో సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, రీతూ చౌదరీ, డీమాన్ పవన్, శ్రీజ, సంజనా ఉన్నారు. గురువారం ఆన్‌లైన్ ఓటింగ్ ప్రకారం లవ్ బర్డ్స్ గా రాణిస్తోన్న రీతూ చౌదరీ, డీమాన్ పవన్ బాటమ్‌లో ఉన్నారు. వీరికి చాలా తక్కువ ఓటింగ్ నమోదైంది. దీంతో ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. డీమాన్ పవన్‌గానీ, లేదంటే రీతూ చౌదరీని గానీ తీసేస్తారని అంతా ఊహించారు. ఈ ఇద్దరు ప్రేమ పక్షులు కావడంతో కంటెంట్ కోసం వీరిని సేవ్ చేస్తే శ్రీజని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉందని బిగ్ బాస్ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఇప్పుడు అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఎలిమినేషన్‌లో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఊహించని కంటెస్టెంట్ హౌజ్‌ని వీడబోతున్నారట. ఒక క్రేజీ కంటెస్టెంట్‌ని బిగ్ బాస్ ఎలిమినేట్ చేసినట్టు సమాచారం.
ఐదో వారం ఫ్లోరా సైనీ ఎలిమినేట్
ఆ ఊహించని కంటెస్టెంట్ ఎవరో కాదు ఫ్లోరా సైనీ. ఐదో వారం ఎలిమినేషన్‌లో ఫ్లోరాని హౌజ్ నుంచి పంపించబోతున్నారట. ఇదే ఇప్పుడు అందరికి షాకిస్తుంది. ఓటింగ్ ప్రకారం ఆమెకి బాగానే ఉంది. మరీ డౌన్‌లో లేనట్టు తెలుస్తోంది. కానీ ఆమెనే ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారనేది ఆశ్చర్యపరుస్తోంది. దీనికి బలమైన కారణం ఉందని టాక్. బిగ్ బాస్ షో స్టార్ట్ అయి ఐదు వారాలు అయ్యింది. ప్రారంభంలో అంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్, కొత్త అని భావించవచ్చు. ఇతరులతో మాట్లాడటం గానీ, బలంగా గేమ్స్, టాస్క్ లు ఆడటంలోనూ సమస్య ఉండొచ్చు. కానీ ఐదు వారాలు వచ్చినా ఆమె తీరు మారలేదు. హౌజ్‌లో చాలా వరకు సైలైంట్‌గా ఉంటుంది. ఎవరితోనూ ఫ్రీగా కలవడం లేదు. కేవలం సంజనాతోనే ఉంటుంది. టాస్క్ ల్లోనూ యాక్టివ్‌గా లేదు. అంతేకాదు ఇప్పటికే ఓ సారి ఆమె `బోరింగ్` ట్యాగ్‌తో జైల్ కి కూడా వెళ్లింది. అయినా ఆమెలో మార్పు రాలేదు. ఫ్లోరా హౌజ్‌లో ఉందా లేదా అన్నట్టుగానే ఉంది. ఈ కారణంతో ఈ వారం ఆమెని ఎలిమినేట్ చేసినట్టు సమాచారం.
డబుల్ ఎలిమినేసన్ ఉంటుందా?
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఇది వైరల్‌గా మారింది. మరి ఇది నిజమేనా, ఇందులో ఏదైనా మార్పు ఉంటుందా అనేది చూడాలి. కానీ తెలుస్తోన్న సమాచారం మేరకు ఫ్లోరా సైనీ ఎలిమినేషన్ పక్కా అని టాక్. ఈ ఎలిమినేషన్ శనివారమే ఉన్నా ఆశ్చర్యం లేదంటున్నారు. ఎందుకంటే ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి. దీంతో శనివారమే ఎలిమినేషన్ ప్రక్రియని పూర్తి చేసే అవకాశం ఉందట. అలా కాదంటే ఆదివారం స్టార్టింగ్‌లోనే ఎలిమినేషన్ ప్రాసెస్‌ని స్టార్ట్ చేసి, ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్‌ని హౌజ్‌లోకి ఆహ్వానించే అవకాశం ఉంది. అంతేకాదు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కి కూడా స్కోప్ ఉందంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.