MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ కెరీర్ లో 'గుంటూరు కారం' ఎందుకు ప్రత్యేకం.. మూవీ చూడడానికి 5 కారణాలు

మహేష్ కెరీర్ లో 'గుంటూరు కారం' ఎందుకు ప్రత్యేకం.. మూవీ చూడడానికి 5 కారణాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మహేష్ నటిస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. అతడు చిత్రం మహేష్ కెరీర్ లో ఎప్పటికీ ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 11 2024, 07:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మహేష్ నటిస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. అతడు చిత్రం మహేష్ కెరీర్ లో ఎప్పటికీ ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. ఆ తర్వాత వచ్చిన ఖలేజా నిరాశ పరిచినప్పటికీ అందులో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. 

28

ఇప్పుడు గుంటూరు కారం చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు నెలకొన్నాయి. పైగా సంక్రాంతి సీజన్ కావడంతో హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ మోతెక్కుతున్నాయి. కొన్ని ఏరియాల్లో ఆర్ఆర్ఆర్, సలార్ రికార్డులని గుంటూరు కారం బ్రేక్ చేస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. 

38

మహేష్ సినిమా రిలీజయ్యే ప్రతిసారి ఓ హంగామా ఉంటుంది. కానీ గుంటూరు కారం చిత్రం మాత్రం మహేష్ కెరీర్ లో స్పెషల్ మూవీ అనే చెప్పాలి. ఎందుకు అంత స్పెషల్ ? గుంటూరు కారం మూవీ చూడడానికి గల 5 కారణాలు ఏంటో ఇపుడు చూద్దాం. 

48

తొలిసారి తండ్రి లేకుండా: మహేష్ బాబు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఓనమాలు దిద్దడానికి కారణం ఎవరుంటారు ? అది మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే. కృష్ణ తన చిత్రాల్లో మహేష్ ని చిన్ననాటి నుంచే బాల నటుడిగా పరిచయం చేస్తూ వచ్చారు. వయసు వచ్చాక రాఘవేంద్ర రావు దర్శకత్వంలో కృష్ణ దగ్గరుండి రాజకుమారుడు చిత్రంతో మహేష్ ని లాంచ్ చేశారు. ఆ తర్వాత మహేష్ నిలదొక్కుకునే వరకు కృష్ణ ప్రమేయం ఉంటూనే ఉండింది. ఒక్కడు చిత్రంతో మహేష్ స్టార్ హీరో అయ్యాడు. పోకిరితో బాక్సాఫీస్ ని షేక్ చేసే సూపర్ స్టార్ అయ్యాడు. అప్పటి నుంచి తన కొడుకు ఎదుగుదలని చూస్తూ కృష్ణ గర్వపడుతూ ఉండేవారు. కృష్ణ 2022లో మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణ గారు లేకుండా మహేష్ నుంచి రిలీజ్ అవుతున్న తొలి చిత్రం గుంటూరు కారం. తన సినిమా రిలీజైన ప్రతిసారి తండ్రి అభినందనల కోసం ఎదురుచూసే మహేష్ కి ఈ సారి అలా ఉండదు. అందుకే మహేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తనకి అమ్మ నాన్న అన్నీ అభిమానులే అంటూ ఎమోషనల్ అయ్యాడు. 

58

త్రివిక్రమ్ దర్శకత్వం : గుంటూరు కారం చిత్రానికి ఈ స్థాయి క్రేజ్ రావడం వెనుక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఉన్నారు. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అభిమానులు తూటా ల్లాంటి డైలాగులు ఆశిస్తారు. మరి ఈ చిత్రంలో ఎలాంటి డైలాగులు పేలాయో చూడాలి. 

68

శ్రీలీల : గుంటూరు కారం చిత్రంలో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో అంశం మహేష్ బాబు, శ్రీలీల కెమిస్ట్రీ. ఇప్పటికే కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ లో శ్రీలీల మహేష్ పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. ఇక సిల్వర్ స్క్రీన్ పై ఆ జాతర ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

78

గుంటూరు బ్యాక్ డ్రాప్ : త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం చిత్రం కోసం గుంటూరు మిర్చి యార్డు బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నారు. ఇందులో తల్లి కొడుకుల సెంటిమెంట్ కూడా ఉంది. అయితే మహేష్ బాబుకి మిర్చి యార్డుకి, మదర్ సెంటిమెంట్ కి ఉన్న సంబంధం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

88
Gunturkaaram

Gunturkaaram

తమన్ మ్యూజిక్ : మహేష్ బాబు సినిమా అంటే తమన్ బిజియంతో మోతెక్కిస్తాడు. థియేటర్లు దద్దరిల్లే బ్యాగ్రౌండ్ స్కోర్ ఉంటుంది. మరి ఈ చిత్రంలో తమన్ మ్యూజిక్ పనితనం ఎలా ఉందో చూడాలి. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Box Office: కలెక్షన్లలో భారీ డ్రాప్, అయినా `ధురంధర్‌ 2` సరికొత్త రికార్డు
Recommended image2
Jr NTR: జూ.ఎన్టీఆర్ మిస్సైన పొలిటికల్ మూవీ.. బెదిరింపులు ఏ రేంజ్ లో వచ్చాయో తెలుసా ?
Recommended image3
OTT Movies: ఓటీటీలో దుమ్ములేపుతున్న తెలుగు థ్రిల్లర్‌ ఇదే.. లిస్ట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved