MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `ఎన్` ట్యాగ్‌ తీసేయ్‌.. వంద కోట్ల సినిమా ఒక్కటి లేదు.. ఎన్టీఆర్‌పై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్‌?

`ఎన్` ట్యాగ్‌ తీసేయ్‌.. వంద కోట్ల సినిమా ఒక్కటి లేదు.. ఎన్టీఆర్‌పై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్‌?

ఎన్టీఆర్‌, బాలయ్య ఫ్యాన్స్ మధ్య వార్‌ పీక్‌కి చేరింది. `ఎన్‌` ట్యాగ్‌ తీసేయాలని డిమాండ్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇది నెట్టింట పెద్ద వివాదంగా మారుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 19 2024, 05:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రెండు రోజులుగా నందమూరి ఫ్యాన్స్ మధ్య రచ్చ నడుస్తుంది. ఎన్టీఆర్‌, బాలకృష్ణ ఫ్యాన్స్ విడిపోయి సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఫ్యాన్స్ వార్‌ పీక్‌కి చేరింది. ఇంకా చెప్పాలంటే అది పర్సనల్‌గా వెళ్తుంది. `ఎన్` ట్యాగ్‌ తీసేయాలని డిమాండ్‌ చేసే స్థాయికి చేరుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నందమూరి తారక రామారావు వర్థంతిని పురస్కరించుకుని నందమూరి ఫ్యామిలీ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన సమాధికి నివాళ్లు అర్పించారు. ఇందులో ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలను బాలకృష్ణ తొలగించాలనే కామెంట్ పెద్ద వివాదంగా మారింది. బాలకృష్ణ `ఇప్పుడే.. తీసేయ్‌` అనే డైలాగ్లు వైరల్‌ అయ్యింది. ఆయన ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలనే తీసేయమన్నారని అంతా అనుకుంటున్నారు. మీడియాలోనూ అదే ప్రొజెక్ట్ అయ్యింది. అయితే మురళి అనే వ్యక్తి హైలైట్‌గా ఈ ఫ్లెక్స్ లు ఉన్నాయని, అదే సమయంలో వర్థంతి రోజు `స్వాగతం, సుస్వాగతం` ఫ్లెక్సీలేంటి అని బాలయ్య వాటిని తొలగించమన్నారని ఆయన అభిమానులు, అనుచరులు చెబుతున్నారు. 
 

35
ntr, unstopable

ntr, unstopable

కానీ అప్పటికే జరగాల్సిన నష్టం, వెళ్లాల్సిన సందేశం వెళ్లిపోయింది. కావాల్సినంత వివాదం జరిగింది. ఈ వివాదం రాజకీయ రంగుపులుముకుంది. దీనిపై టీడీపీ, వైసీపీ నాయకులు రియాక్ట్ కావడంతో రచ్చ మరింత పెద్దదైంది. అయితే ఈ సందర్భంగా బాలకృష్ణ ఫ్యాన్స్ ఛాటింగ్‌ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. ఈ సందర్భంగా నిన్ననే బాలయ్య అభిమానులు ట్విట్టర్‌ స్పేస్‌లో కలుసుకున్నారు. బాలయ్య, ఎన్టీఆర్‌ సినిమాలపై చర్చించారు. అయితే ఇందులో తారక్ ని వాళ్లు టార్గెట్‌ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పులు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. 

45

ఇందులో బాలయ్య ఫ్యాన్స్.. తారక్‌ సినిమాలపై విమర్శలు చేశారు. ఇప్పటి వరకు చెప్పుకోవడానికి ఒక్కటి కూడా వంద కోట్ల సినిమా లేదంటూ, అది నీ స్టార్‌ డమ్‌ అంటూ ఫైర్‌ అవుతున్నారు. అంతేకాదు ముందు `ఎన్‌`(నందమూరి) అనే ట్యాగ్‌ తీసేయమని అంటున్నారు. అది పెట్టుకుని తమ పరువు తీస్తున్నారని, ఒకప్పుడు బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు పోటాపోటీగా ఆడేవని, ఒకసారి వాళ్లు హిట్‌ కొడితే, మరో సారి వీళ్లు హిట్‌ కొట్టేవారని, ఆ పోటీ ఎప్పుడూ ఉండేదని, కానీ ఎన్టీఆర్‌ సినిమాలు ఎవరికీ పోటీ ఇవ్వడం లేదని, కనీసం ఇప్పటి వరక ఒక్క వంద కోట్ల సినిమా లేదని వాళ్లు మండి పడుతున్నారు. 
 

55

అంతేకాదు ఈ సందర్భంగా పలు షాకింగ్‌ కామెంట్స్ చేశారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నీ ఒక్కడితో ఇండస్ట్రీ హిట్‌ సినిమా చేయడం కష్టమని భావించి రామ్‌చరణ్‌ని తీసుకున్నాడని, అందులో తనది చిన్న రోలే అని, చరణ్‌ సపోర్ట్ తోనే ఆ హిట్‌ సాధ్యమైందన్నారు. ఇంకోవైపు `అదుర్స్` సినిమా గురించి మాట్లాడుకున్నారు. ఆ సమయంలో తనకు హిట్‌ లేకపోవడంతో దర్శకుడు వినాయక్‌ని వెంటపడ్డాడని, కారులో ఎక్కి భోరున విలపించాడని, దీంతో ఆ సినిమా తీయాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో వినాయక్‌ చెప్పినట్టుగా బాలయ్య ఫ్యాన్స్ కామెంట్‌ చేయడం గమనార్హం. ప్రస్తుతం వీరి ట్విట్టర్‌ స్పేస్‌ వీడియో క్లిప్పులు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ.. కుర్చీ కోసం డాన్ కూతురు ఆడిన క్రిమినల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే ?
Recommended image2
Alia Bhatt Movies: అలియా భట్ కెరీర్ లో టాప్ 5 బిగ్గెస్ట్ హిట్స్ ఇవే.. మొదటిది మన తెలుగు సినిమానే
Recommended image3
Toxic Cast Fees: టాక్సిక్ స్టార్ల రెమ్యూనరేషన్స్, యశ్‌కు 50 కోట్లు.. మరి కియారా, నయన్ ఎంత తీసుకున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved