బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ నామినేషన్ ప్రక్రియ.. రేవంత్ నోటి దురుసుపై ఫైమా అటాక్
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6లో హౌస్ మేట్స్ మధ్య వాడివేడి మాటల యుద్ధం మొదలైపోయింది. బిగ్ బాస్ ఫస్ట్ నామినేషన్ ప్రక్రియని ప్రారంభించారు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6లో హౌస్ మేట్స్ మధ్య వాడివేడి మాటల యుద్ధం మొదలైపోయింది. బిగ్ బాస్ ఫస్ట్ నామినేషన్ ప్రక్రియని ప్రారంభించారు. నేడు జరగబోయే నామినేషన్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు.
ప్రోమో చూస్తుంటే నామినేషన్ ప్రక్రియలో హంగామా మొత్తం అర్జున్ కళ్యాణ్, ఫైమా, రేవంత్ లదే అన్నట్లుగా ఉంది. ఫైమా ఇంట్లో అసలు పనే చేయడం లేదు అంటూ రేవంత్ ఆమెని నామినేట్ చేశారు. దీనితో ఫైమా ఆగ్రహానికి గురైంది. నేను పని చేసేటప్పుడు మీరు అటువైపు రాలేదేమో అని అంటుంది. దీనికి రేవంత్ మే బీ నేను అసలు ఇంట్లోనే లేనేమో అంటూ వెటకారంగా అంటాడు.
ఇక అర్జున్ కళ్యాణ్ కూడానా ఫైమాని నామినేట్ చేశాడు. ఆమె ఒక గ్రూపులో ఉంది కామెడీ చేయడం చూసాను కానీ.. ఇంట్లో ఎప్పుడూ పనిచేయడం చూడలేదు అని అర్జున్ కళ్యాణ్ అంటాడు. దీనికి ఫైమా బదులిస్తూ.. మరి టీమ్స్ ఎందుకు పెట్టారు అని అంటుంది. టీంలో ఉంటేనే పనిచేస్తారు మీరు.. ఇది మీ ఇల్లు కాదా అని కౌంటర్ ఇస్తాడు.
ఇక ఫైమా రేవంత్ ని నామినేట్ చేయగా.. వారి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక్కడ కొంతమంది ఆటకారులు ఉంటారు. కానీ ఆయన మాత్రం మాటకారి అంటూ రేవంత్ నోటి దురుసు పై కామెంట్స్ చేసింది. గట్టిగా మాట్లాడితే తనదే కరెక్ట్ అవుతుందని భావిస్తారు అని ఫైమా రేవంత్ కి కౌంటర్ ఇస్తుంది. నా వాయిసే అంత.. ఎవరికోసమే నన్ను నేను మార్చుకోను అని సీరియస్ గా రేవంత్ చెబుతాడు.
మొత్తంగా ఎక్కువ మంది సభ్యులు రేవంత్ ని టార్గెట్ చేసి అతడిని నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే కంప్లీట్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఫైమా మాత్రమే కాక సుదీప, కీర్తి భట్, ఆరోహి కూడా రేవంత్ ని నామినేట్ చేశారు.
నామినేట్ చేయాలనుకున్న వారి పేర్లని అచ్చు వేసి.. ఆ పేపర్ ని చించి ఫ్లషింగ్ చేయాలి. మరి తొలి వారంలో నామినేషన్ లో చిక్కుకునే సభ్యులు ఎవరో ఈ రాత్రికి తేలనుంది.