- Home
- Entertainment
- Pooja Hegde:పవన్ కళ్యాణ్ సినిమాలో నేనా?... ఆ విషయం హరీష్ శంకర్ ని అడగండి.. పూజా క్లారిటీ!
Pooja Hegde:పవన్ కళ్యాణ్ సినిమాలో నేనా?... ఆ విషయం హరీష్ శంకర్ ని అడగండి.. పూజా క్లారిటీ!
రాధే శ్యామ్ విడుదల నేపథ్యంలో హీరోయిన్ పూజా హెగ్డే మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధే శ్యామ్ (Radhe shyam)చిత్రంతో పాటు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

దర్శకుడు హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)భవదీయుడు భగత్ సింగ్ ప్రకటించి దాదాపు ఏడాది అవుతుంది. మధ్యలో పవన్ భీమ్లానాయక్ ప్రాజెక్ట్ ఒప్పుకోవడంతో ఈ సినిమా ఆలస్యమైంది. పవన్ కోసం హరీష్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
కాగా భవదీయుడు భగత్ సింగ్ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. వీరి కాంబినేషన్ లో 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది. భవదీయుడు భగత్ సింగ్ లో హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికైనట్లు కొన్నాళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అధికారిక ప్రకటన చేయకున్నప్పటికీ హరీష్ మూవీలో పవన్ కి జంటగా పూజా నటించడం ఖాయమే అంటున్నారు.
కాగా న్యూస్ పై పూజా హెగ్డే (Pooja Hegde)స్వయంగా క్లారిటీ ఇచ్చారు. భవదీయుడు భగత్ సింగ్ మూవీలో నటిస్తున్నారట కదా? అని అడుగగా ఆ విషయం మీరు హరీష్ శంకర్ నే అడగాలని దాటవేశారు. అయితే పరోక్షంగా భవదీయుడు భగత్ సింగ్ మూవీలో నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
ఇక త్రివిక్రమ్, హరీష్ శంకర్ లాంటి దర్శకులు పూజాను రిపీట్ చేస్తున్నారు.ఈ విషయం గురించి మాట్లాడుతూ... తనలోని ప్రతిభ గుర్తించిన త్రివిక్రమ్, హరీష్ లాంటి దర్శకులు తమ వరుస చిత్రాల్లో హీరోయిన్ గా ఎంచుకుంటున్నారన్న ఆమె, వారికి ధన్యవాదాలు తెలిపారు.
పూజాతో రెండు చిత్రాలు చేసిన త్రివిక్రమ్.. మహేష్ తో చేస్తున్న నెక్స్ట్ చిత్రానికి కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక హరీష్ శంకర్ సైతం పూజాతో డీజే, గద్దలకొండ గణేష్ సినిమాలు చేశారు. ఇక భవదీయుడు భగత్ సింగ్ పై అధికారిక ప్రకటన వస్తే ముచ్చటగా మూడో మూవీ అవుతుంది.
ఇక రాధే శ్యామ్ మూవీలో తాను చేసిన ప్రేరణ కెరీర్ లోనే ఛాలెంజింగ్ రోల్ అన్నారు పూజా. ఈ పాత్ర తనను చాలా స్ట్రాంగ్ గా మార్చింది. పీరియాడిక్ రోల్ కావడంతో చాలా రీసెర్చ్ చేశాను. పుస్తకాలు చదివి అప్పటి పరిస్థితులు అర్థం చేసుకున్నాను. గతంలో నేర్చుకున్న భరతనాట్యం ఎంతగానో ఉపయోగపడిందని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.
మార్చి 11న రాధే శ్యామ్ విడుదల కానుంది. దీంతో ప్రభాస్ (Prabhas), పూజా కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.దర్శకుడు రాధాకృష్ణ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా రాధే శ్యామ్ తెరకెక్కించారు. సినిమా ప్రధాన భాగం యూరప్ నేపథ్యంలో సాగుతుంది. ప్రభాస్ పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉండనుంది.