- Home
- Entertainment
- Ileana Dcruz : ఎట్టకేళలకు భర్త గురించి మాట్లాడిన ఇలియానా.. ఇన్నాళ్లు దాచడం వెనక కారణమిదే!
Ileana Dcruz : ఎట్టకేళలకు భర్త గురించి మాట్లాడిన ఇలియానా.. ఇన్నాళ్లు దాచడం వెనక కారణమిదే!
‘పోకిరి’ హీరోయిన్ ఇలియాన (Ileana) గురించి ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. తన ఫ్యామిలీ, భర్త గురించి మాట్లాడుతూ గోవా బ్యూటీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

స్టార్ హీరోయిన్ ఇలియానా డిక్రూజ్ (Ileana DCruz) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘దేవదాస్’ సినిమాతో ఈ ముద్దుగుమ్మ కెరీర్ టాలీవుడ్ లోనే ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ‘పోకిరి’, ‘మున్నా’, ‘జల్సా’, ‘కిక్’, ‘జులాయి’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. చివరిగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆ మధ్యలో సౌత్ సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. మొత్తంగా బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. ఇప్పుడు కూడా ఇలియాన హిందీలోనే సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఓ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
Do Aur Do Pyaar అనే చిత్రం త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్బంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలో తన కుటుంబం, భర్తపై వచ్చిన ట్రోల్స్ పై తాజాగా స్పందించినట్టు తెలుస్తోంది. ఆమె చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇలియానా తాజాగా మాట్లాడుతూ... నేను గర్భవతి అయినా పనిచేయాలనుకున్నా. పరిస్థితులు అనుకూలంగా లేవు. నా ప్రెగ్నెన్సీ సమయంలో అమ్మ, నా భర్త మైకేల్ సపోర్ట్ చేశారు. ఇక నా భర్త గురించి, మా బంధం గురించి బహిరంగంగా చెప్పాలని అనుకోలేదు.
అందుకే గతంలో విమర్శలు వచ్చినా ఎదుర్కొన్నాను. నన్ను ఏమన్నా తీసుకోగలను.. కానీ నా కుటుంబం, భర్తను విమర్శించినా.. తిట్టినా తట్టుకోలేను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇలియానకు కొడుకు Koi Phoenix Dolan ఉన్నారు.