MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బడ్జెట్ లోనూ ప్రభాస్ రికార్డ్, 'ఫౌజీ ' కు ఎంత పెడుతున్నారో తెలుసా?

బడ్జెట్ లోనూ ప్రభాస్ రికార్డ్, 'ఫౌజీ ' కు ఎంత పెడుతున్నారో తెలుసా?

హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ టైటిల్ తో ఆ టైటిల్ రూపొందుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్  అప్పుడే అమ్ముడైపోయినట్లు  తెలుస్తోంది. 

2 Min read
Author : Surya Prakash
Published : Nov 06 2024, 10:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Hanu Raghavapudi,Fauji , Prabhas, Mythri Movie Makers

Hanu Raghavapudi,Fauji , Prabhas, Mythri Movie Makers


 ప్రభాస్ ఇవాళ ప్యాన్ ఇండియా స్టార్.  బాహుబలి తర్వాత సాహూ, రాధే శ్యామ్, ఆది పురుష్  వంటి సినిమాలు చేసి డిజాస్టర్ పాలు అయ్యినా ఎక్కడా తగ్గేదే లే అన్నట్లు దూసుకువెళ్తున్నారు.   సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈయన,  కల్కి 2898AD సినిమా చేసి తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకున్నారు.

ఇక ప్రస్తుతం సలార్ -2, కల్కి -2, రాజాసాబ్, ఫౌజీ పంటి చిత్రాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.  అలాగే ప్రభాస్ కటౌట్ కు తగ్గ  స్దాయిలో ఆ సినిమాలు బిజినెస్ లు జరుపుకోవటమే కాదు..బడ్జెట్ లు కూడా భారీగా షాక్ ఇచ్చేలా ఉంటున్నాయి. 

27
Hanu Raghavapudi,Fauji , Prabhas, Mythri Movie Makers

Hanu Raghavapudi,Fauji , Prabhas, Mythri Movie Makers


ప్రభాస్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆయన సినిమా ప్రారంభం కాకుండానే బిజినెస్ లు అయ్యిపోతున్నాయి. ఓటిటి సంస్దలు అయితే ప్రభాస్ తో సినిమా చేస్తున్న నిర్మాతలు చుట్టూ ప్రదిక్షణాలు చేస్తున్నారు. ప్రభాస్ తో మైత్రీ సంస్థ ఓ ప్రెస్టీజియస్ సినిమాను ప్లాన్ చేసింది

  హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ టైటిల్ తో ఆ టైటిల్ రూపొందుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్  అప్పుడే అమ్ముడైపోయినట్లు  తెలుస్తోంది. ఈ నేఫద్యంలో అసలు ఈ సినిమా కు ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారనే విషయం బయిటకు వచ్చింది. అదీ రికార్డ్ స్దాయిలో ఉండటంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 
 

37
Hanu Raghavapudi,Fauji , Prabhas, Mythri Movie Makers

Hanu Raghavapudi,Fauji , Prabhas, Mythri Movie Makers


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఫౌజీ చిత్రం 400 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు.  ఫౌజీ అంటే అర్దం సైనికుడు. ఈ సినిమా యుద్దం నేపధ్యంలో సాగే ఓ రొమాంటిక్ డ్రామా కావటం విశేషం. సీతారామం కూడా దాదాపు ఇలాంటి నేపధ్యమే.

ఇక ఫౌజీ అనేది వర్కింగ్ టైటిల్ అని, ప్యాన్ ఇండియా మార్కెట్ సరపడ టైటిల్ అవుతుందని ఇదే లాక్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా 1947 కాలంలో జరుగుతుంది. దాంతో రెట్రో లుక్ కోసం, కాన్సెప్టు తగ్గ సెట్స్ వేయటం కోసం ఈ బడ్జెట్ లు పెట్టబోతున్నట్లు వినికిడి. 

47


బ్రిటీష్ ఆర్మీలో పనిచేసే ఇండియన్ సోల్జియర్ కథ ఇది అని సమాచారం. మైత్రీమూవీస్ వారు ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందే ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ చాలా కాలంగా జరుగుతోంది. మృణాళ్ ఠాకూర్ ఈ సినిమలో హీరోయిన్ గా కనిపించబోతోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తారు. ఆల్రెడీ షూట్ మొదలై హీరోయిన్ మీద సీన్స్ తీస్తున్నారని  సమాచారం.  

57


ఈ క్రమంలో ఫౌజీ  డిజిటల్ హక్కులు 150 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ రైట్స్  కాకుండా శాటిలైట్లు, అడియో, హిందీ ఇలా ఇంకా వుంటాయి. అన్నీ కలిపి మరో 150 కోట్లకు పైగా వస్తాయని అంచనా అంటే ఒక్క నాన్ థియేటర్ హక్కులే 300 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక థియేటర్ బిజినెస్ అయితే చెప్పక్కర్లేదు.
    

67

 డైరెక్టర్ హను గతంలో తెరకెక్కించిన లవ్ స్టోరీస్ మాదిరిగా కాకుండా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని చెప్పటంతో ఖచ్చితంగా కొత్త కథ చూడబోతున్నారనే ఆనందం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది.. ప్రీ ఇండిపెండెన్స్ టైం లైన్ తో రజాకార్ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించనున్నారని వినికిడి. అలాగే  యుద్ధం బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా స్టోరీ ఉండనుందని తెలుస్తోంది.  
 

77


ఈ క్రమంలో హను, ప్రభాస్ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటి నెలకొంది. ఈ సినిమా గురించి ఎప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందో చూడాలి.  హను రాఘవపూడి చివరిగా ‘సీతారామం’ వంటి లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అంతకముందు కృష్ణగాడి వీరప్రేమగాధ, అందాల రాక్షసి, లై, పడి పడి లేచే మనసు సినిమాలు తెరకెక్కించారు.  
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Recommended image2
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved