- Home
- Entertainment
- Samantha : రెండో పెళ్లిపై సమంతకు ప్రశ్న? లెక్కలు చూపిస్తూ ఆన్సర్ ఇచ్చిన సామ్.. ఏమన్నారంటే!?
Samantha : రెండో పెళ్లిపై సమంతకు ప్రశ్న? లెక్కలు చూపిస్తూ ఆన్సర్ ఇచ్చిన సామ్.. ఏమన్నారంటే!?
స్టార్ హీరోయిన్ ను సమంత తన అభిమాని ప్రశ్నకు లెక్కలతో సహా ఆన్సర్ ఇచ్చింది. రెండో పెళ్లిపై మీరు ఎందుకు ఆలోచించకూడదు అన్న ఫ్యాన్స్ కు.. చాలా ఆసక్తికరంగా బదులిచ్చింది. మళ్లీ పెళ్లిపై సామ్ ఏమంటున్నారంటే..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ డివోర్స్ తీసుకొని రెండేళ్లు గడిచిపోయింది. ప్రస్తుతం సామ్ తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది.
డివోర్స్ తర్వాత కాస్తా గ్యాప్ తో మళ్లీ కెరీర్ ను స్టార్ట్ చేసింది. కొన్ని చిత్రాల తర్వాత తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టింది. 2023లో ఎక్కువ భాగం హెల్త్ పై ఫోకస్ పెట్టింది. రిలాక్స్ అవుతూ కనిపించింది. కొద్దిరోజుల నుంచే మళ్లీ యాక్టివ్ గా కనిపిస్తున్నారు.
సోషల్ మీడియాలో చాలా చురుకుగా కనిపిస్తున్నారు. అభిమానులకు టచ్ లో ఉంటూ ఆకట్టుకుంటున్నారు. ఇక తాజాగా ఫ్యాన్స్ తో సామ్ చిట్ చాట్ నిర్వహించింది. యశోద సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు సామ్.
ఈ సందర్భంగా ఓ అభిమాని సామ్ రెండో పెళ్లిపై ప్రశ్నించారు. ‘మీరు మళ్లీ పెళ్లి చేసుకోవడంపై ఎందుకు ఆలోచించకూడదు?’ అని అడిగాడు. ఇందుకు సామ్ ఇచ్చిన రిప్లై దిమ్మతిరిగిపోతోంది. ఆ ఆన్సర్ కు సమంత్ పెళ్లికి ఇంకా దూరంగానే ఉంటారనిపిస్తోంది.
సామ్ రిప్లై ఇస్తూ.. 2023 డివోర్స్ లెక్కల ప్రకారం.. మొదట పెళ్లి చేసుకున్న వారు 50 శాతంగా విడిపోయారు. రెండోసారి, మూడోసారి పెళ్లి చేసుకున్న వారు 67 శాతం నుంచి 73 శాతంగా విడిపోతున్నారు. ఈ లెక్కల బ్యాడ్ ఇన్వెస్టిమెంట్ అవుతుందని బదులిచ్చింది.
ఇక తన స్క్రీన్ వాల్ పేపర్ అమ్మవారి ప్రతిమ ఉంటుందని, దేవుడిగా బాగా నమ్ముతానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. నాగచైతన్య కూడా రెండో పెళ్లిపై ఆసక్తిచూపించడం లేదు. తన ఇంటర్వ్యూల్లో ఇదే వెల్లడించారు. ఇక సామ్ చివరిగా ‘ఖుషి’తో బ్లాక్ బాస్టర్ అందుకుంది. ప్రస్తుతం ‘సిటడెల్’తో రానుంది.