పుష్ప 2 విలన్ ఫహాద్ ఫాజిల్ సంపాదన, ఆస్తులు ఎన్నో తెలుసా..?
సౌత్ ఇండియాన్ సినిమాల్లో ఫహాద్ ఫాజిల్, అత్యధిక పారితోషికం తీసుకునే మలయాళ నటుల్లో ఒకరు. విలాసవంతమైన కార్లు, ఆస్తులకు యజమాని.
దక్షిణ భారతంలో బహుముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న ఫహాద్ ఫాజిల్, మలయాళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరు.
విభిన్నమైన పాత్రలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఫహద్ ఫాజిల్. మాలీవుడ్ నుంచి తమిళ, తెలుగు పరిశ్రమలకు కూడా ఆయన టాలెంట్ పాకింది.
ప్రముఖ దర్శకుడు ఫాజిల్ కుమారుడైన ఫహాద్ ఫాజిల్, 2002లో 'కైయేతుమ్ దూరత్' సినిమాతో తెరంగేట్రం చేశారు. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.
ఆ తర్వాత బ్రేక్ తీసుకుని 2009లో 'కేరళ కేఫ్', 'చప్పా కురిషు' సినిమాలతో తిరిగి వచ్చారు ఫహాద్. ఈ సినిమాలు ఆయన కెరీర్‌లో మలుపు తిప్పాయి. ఉత్తమ సహాయ నటుడిగా తొలి కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు.
రీ ఎంట్రీ తర్వాత, ఫాజిల్ 50కి పైగా అద్భుతమైన సినిమాల్లో నటించారు. అందులో అత్యధిక వసూళ్లు సాధించిన ఐదవ మలయాళ చిత్రంగా 'ఆవేషం' రికార్డు సృష్టించింది. 2014లో ప్రారంభమైన ఆయన నిర్మాణ సంస్థ 'ఇయోబింటే పుస్తకం', 'ట్రాన్స్' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించింది.
సంపద, ఆస్తులు
ఫహాద్ ఫాజిల్ ఆస్తులు దాదాపు 50 కోట్ల రూపాయలు ఉన్నట్టు తెలుస్తోంది. మలయాళంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన ఆయన, ఒక్కో సినిమాకు 3.5 కోట్ల నుంచి 6 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నారట. ఫాజిల్‌కు విలాసవంతమైన కార్లంటే ఇష్టం. ఆయని వద్ద పోర్స్చే 911 కెరెరా ఎస్, మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్, రేంజ్ రోవర్ వోగ్ వంటి కార్లు ఉన్నాయి. ప్రముఖ ఆర్కిటెక్ట్ అమల్ సుఫియా రూపొందించిన కోచిలోని విలాసవంతమైన ఇంటికి కూడా ఆయన యజమాని.
రాబోయే సినిమాలు
ఫహాద్ ఫాజిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో 'పుష్ప 2 – ది రూల్'లో నటిస్తున్నారు. ఇటీవల టీజే జ్ఞానవేల్ 'వేట్టైయన్'లో మంజు వారియర్, అమితాబ్ బచ్చన్, రితికా సింగ్‌లతో కలిసి నటించారు. ఇంకా, ఇంతియాజ్ అలీతో కలిసిఓ సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నారు.
వ్యక్తిగత జీవితం
ఫహాద్ ఫాజిల్ 2014లో నటి నజ్రియా నజీమ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంట 'ఫహాద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్' అనే నిర్మాణ సంస్థను కలిసి నడుపుతున్నారు. ఈ సంస్థ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించింది.