MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `గేమ్‌ ఛేంజర్‌`పై అంచనాలన్నీ తలక్రిందులు.. `జరగండి` పాటకి దారుణమైన వ్యూస్‌.. థమన్‌ ఎంత పని చేశావయ్యా?

`గేమ్‌ ఛేంజర్‌`పై అంచనాలన్నీ తలక్రిందులు.. `జరగండి` పాటకి దారుణమైన వ్యూస్‌.. థమన్‌ ఎంత పని చేశావయ్యా?

రామ్‌ చరణ్‌ నటిస్తున్న `గేమ్‌ ఛేంజర్‌` మూవీ నుంచి `జరగండి` అనే పాట విడుదలైంది. పాటపై, థమన్‌పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 28 2024, 07:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
game changer

game changer

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటిస్తున్న `గేమ్‌ ఛేంజర్‌` మూవీ నుంచి ఆయన బర్త్ డే సందర్భంగా బుధవారం `జరగండి జరగండి` అనే పాటని విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య ఈ పాట విడుదలైంది. గతంలోనే దీన్ని రిలీజ్‌ చేయాల్సింది. కానీ అప్పుడు ఆపేశారు. జస్ట్ ఫ్రీ లుక్‌ విడుదల చేసి వదిలేశారు. ఇన్నాళ్లు ఊరిస్తూ ఎట్టకేలకు చరణ్‌ బర్త్ డే ట్రీట్‌ లా ఇచ్చారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

విజువల్‌ వండర్‌లాంటి సెట్‌లో ఈ పాటని చిత్రీకరించారు దర్శకుడు శంకర్‌. ఈ కలర్‌ఫుల్‌ సెట్‌కి కోట్లల్లో ఖర్చు చేయించారు దర్శకుడు. దీంతో ఈ పాటపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఎలా ఉండబోతుందో అనే ఉత్సుకత అందరిలోనూ ఉంది. ఆ సస్పెన్స్ కి తెరదించుతూ నిన్న ఉదయాన్నే పాటని విడుదల చేశారు. కానీ పాట అందరిని డిజప్పాయింట్‌ చేసింది. మెగా అభిమానులకు కూడా నిరాశ చెందారు. 
 

36

పాట సెట్‌ విజువల్‌ వండర్‌లా ఉంది. కానీ అందులో వీరి డాన్సులు కూడా అంత ఆకట్టుకునేలా లేవు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ సంగీతం అందించిన ఈ పాట ఏమాత్రం ఆసక్తిని కలిగించేలా లేదు. పైగా ఎన్టీఆర్‌ నటించిన `శక్తి` సినిమాలోని పాటని కాపీలా ఉందనే కామెంట్స్ వచ్చాయి. దారుణంగా ట్రోల్స్ చేశారు. కాపీ అంటూ సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. తరచూ థమన్‌పై ఇలాంటివి కామనే, దీనికి కూడా అలానే ట్రోల్స్ వచ్చాయి. 

46

అయితే పాట కాపీ అయినా, ఆకట్టుకునేలా, వినసొంపుగా ఉందా అంటే లేదనే అంటున్నారు నెటిజన్లు. డీలా పడేలా చేస్తుందని పోస్ట్ లు చేస్తున్నారు. అంతేకాదు షణ్ముఖ్‌ సినిమాతో పోల్చడం ఇప్పుడు మరింత దారుణంగా మారింది. `జరగండి` పాటకి వ్యూస్‌ కూడా తక్కువగానే ఉన్నాయి. 24 గంటల్లో ఇది ఐదు మిలియన్స్ వ్యూస్‌ మాత్రమే రాబట్టుకుంది. తెలుగు, తమిళం, హిందీలో దీనికి కేవలం 5.3 మిలియన్స్ వ్యూస్‌ మాత్రమే వచ్చాయి. లైక్స్ మూడు లక్షల యాభై వేలు మాత్రమే. 

56
Game Changer

Game Changer

గ్లోబల్‌ స్టార్‌, పాన్‌ ఇండియా మూవీకి ఇలాంటి స్పందన చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు షణ్ముఖ్‌ సినిమాతో పోల్చుతున్నారు. బిగ్‌ బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ గతంలో `సాఫ్ట్ వేర్‌ డెవలపర్‌` అనే వెబ్‌ సిరీస్‌ చేశాడు. దీనికి 24గంట్లో ఆరు మిలియన్స్ వ్యూస్‌ వచ్చాయి. 354 లైక్‌లు వచ్చాయట. ఆయనకంటే తక్కువగా రామ్‌ చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` మూవీ పాటకి రావడంతో నెటిజన్లు నానా రచ్చ చేస్తున్నారు. థమన్‌ని దారుణంగా ఆడుకుంటున్నారు. 
 

66

శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నటిస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. కానీ ఒక్క పాటతో ఆ అంచనాలను తలకిందులు చేశాడు థమన్‌. అందుకే ఆయన్ని టార్గెట్‌ చేస్తూ, జనరల్‌ ఆడియెన్స్, ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. షణ్ముఖ్‌ని గ్లోబల్‌ స్టార్‌ అంటూ హల్‌చల్‌ చేయడం గమనార్హం. రామ్‌ చరణ్‌, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌. ఎస్‌ జే సూర్య, శ్రీకాంత్‌ నెగటివ్‌ రోల్స్ చేస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేంత నీచుడిని కాను.. అతడిపై అసూయ లేదన్న రజినీకాంత్
Recommended image2
Urvashi Rautela: కేన్స్ లో ఊర్వశీ రౌతేలా కళ్ళు జిగేల్ మనే లుక్.. తేడా కొట్టేసింది, దారుణంగా ట్రోలింగ్
Recommended image3
Ileana Mother: తల్లీ కూతుళ్లే డిసైడ్ అయ్యారు, ఇలియానా వల్గర్ గా కనిపించిన మూవీ.. నాకేం సంబంధం లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved