MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • యానిమల్ ట్రైలర్ చూసి ఒక్కసారి స్పిరిట్ లో ప్రభాస్ ని ఊహించుకుంటే.. వెన్నులో వణుకు ఖాయం

యానిమల్ ట్రైలర్ చూసి ఒక్కసారి స్పిరిట్ లో ప్రభాస్ ని ఊహించుకుంటే.. వెన్నులో వణుకు ఖాయం

ఆ సమయంలో సందీప్ వారికి సమాధానం ఇస్తూ వయెలెన్స్ అంటే ఏంటో నా నెక్స్ట్ మూవీలో చూపిస్తా అని తెలిపాడు. కట్ చేస్తే యానిమల్ ట్రైలర్ హాట్ టాపిక్ గా మారుతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 24 2023, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సందీప్ రెడ్డి వంగా 'అర్జున్ రెడ్డి' లాంటి కల్ట్ మూవీ అందించి తన ప్రత్యేకత చాటుకున్నారు. దీనితో సందీప్ తదుపరి చిత్రంపై ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా యువత సందీప్ తెరకెక్కించబోయే చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సందీప్.. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో యానిమల్ అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.   

26

భారీ అంచనాలతో యానిమల్ చిత్రం డిసెంబర్ 1 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలు పెంచడమే కాదు.. సర్వత్రా చర్చనీయాంశంగా కూడా మారింది. 

36

తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని ఇంత వయలెంట్ గా కూడా చూపించవచ్చా అంటూ బాలీవుడ్ వాళ్ళు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. అర్జున్ రెడ్డి రీమేక్ ని సందీప్ హిందీలో చేస్తున్నప్పుడు ఇది వయలెంట్ లవ్ స్టోరీ అంటూ విమర్శలు చేశారు బాలీవుడ్ వాళ్ళు. 

46

ఆ సమయంలో సందీప్ వారికి సమాధానం ఇస్తూ వయెలెన్స్ అంటే ఏంటో నా నెక్స్ట్ మూవీలో చూపిస్తా అని తెలిపాడు. కట్ చేస్తే యానిమల్ ట్రైలర్ హాట్ టాపిక్ గా మారుతోంది. అదేం యాటిట్యూడ్ అదేం ఊచకోత అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ విడుదలయ్యాక అడ్వాన్స్ బుకింగ్స్ మామూలుగా లేవు. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మరోసారి సందీప్ జూలు విదిల్చాడు అని అంటున్నారు. 

56

యానిమల్ హీట్ కొనసాగుతుండగానే స్పిరిట్ చిత్రం కూడా చర్చనీయాంశం అవుతోంది. చాలా కాలం క్రితమే సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో స్పిరిట్ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. యానిమల్ ట్రైలర్ చూసిన తర్వాత.. రణబీర్ కపూర్ నే ఇంత అరాచకంగా చూపిస్తున్నాడు.. ఇంకా ప్రభాస్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో సందీప్ అంటూ ఫ్యాన్స్ మధ్య హాట్ హాట్ చర్చలు మొదలయ్యాయి. 

66

ప్రభాస్ స్పిరిట్ చిత్రంలో జాలి దయ లేని క్రూరమైన పోలీస్ అధికారిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సందీప్ వంగా చేయబోయే విధ్వంసం ఊహించుకుంటే వెన్నులో వణుకు ఖాయం. మరోవైపు యానిమల్ చిత్రం మహేష్ బాబు చేయాల్సిన చిత్రం అని.. అనవసరంగా మహేష్ రిజెక్ట్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైతే అంచనాలు అదిరిపోతున్నప్పటికీ యానిమల్ ప్రభావం పూర్తిగా తెలియాలంటే రిలీజ్ వరకు ఎదురు చూడాల్సిందే. 

About the Author

SG
Sreeharsha Gopagani
సందీప్ రెడ్డి వంగా
Latest Videos
Recommended Stories
Recommended image1
ధురంధర్ స్టార్ రణ్‌వీర్ సింగ్ 100 కోట్ల ఇల్లు, అరేబియా సముద్రం కనిపించేలా అద్భుత భవనం ఎలా ఉందో చూశారా?
Recommended image2
Brahmamudi Serial Today Episode: పవర్ ఆఫ్ అటార్ని నుంచి రేఖను తప్పించాలని అపర్ణ ప్లాన్, ఇందు ఫోన్ పగలగొట్టిన రాజు
Recommended image3
పవన్ కళ్యాణ్ నో అన్నాడు, మహేష్ బాబు, రవితేజ ఇండస్ట్రీ హిట్లు కొట్టారు, పవర్ స్టార్ రిజెక్ట్ చేసిన పూరీ జగన్నాథ్ సినిమాలేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved