MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మా చిత్రం టెర్రరిజంకి వ్యతిరేకం, మతానికి కాదు.. 'ది కేరళ స్టోరీ'పై అదా శర్మ సంచలన కామెంట్స్

మా చిత్రం టెర్రరిజంకి వ్యతిరేకం, మతానికి కాదు.. 'ది కేరళ స్టోరీ'పై అదా శర్మ సంచలన కామెంట్స్

హార్ట్ ఎటాక్ ఫేమ్ అదా శర్మ నటించిన లేటెస్ట్ మూవీ 'ది కేరళ స్టోరీ'. కశ్మీర్ ఫైల్స్ తర్వాత ఆ రేంజ్ లో దేశవ్యాప్తంగా ఈ చిత్రం గురించి చర్చ జరుగుతోంది. రాజకీయంగా కూడా ఈ మూవీ ప్రకంపనలు రేపుతోంది.

3 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : May 02 2023, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

హార్ట్ ఎటాక్ ఫేమ్ అదా శర్మ నటించిన లేటెస్ట్ మూవీ 'ది కేరళ స్టోరీ'. కశ్మీర్ ఫైల్స్ తర్వాత ఆ రేంజ్ లో దేశవ్యాప్తంగా ఈ చిత్రం గురించి చర్చ జరుగుతోంది. రాజకీయంగా కూడా ఈ మూవీ ప్రకంపనలు రేపుతోంది. కేరళ రాష్ట్ర ఖ్యాతిని తగ్గించే కుట్రలో భాగంగా చేసిన ప్రాపగాండా చిత్రం ఇది అని ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కామెంట్స్ చేసారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ చిత్రాన్ని విపుల్ అమృతల్ షా నిర్మించగా, సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. కేరళ యువత ఉగ్రవాద ముసుగులో చిక్కుకుకుంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అలాంటి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కేరళపై ఉగ్రవాదం ప్రభావం ఎలా పడుతోంది అనే అంశాలని కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మే 5న అన్ని భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. 

37

ది కేరళ స్టోరీ చిత్రం రిలీజ్ కి దగ్గరవుతున్న నేపథ్యంలో ఈ మూవీని విమర్శించే వారు, సపోర్ట్ చేసేవారు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వార్ కి తెరతీశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన అదా శర్మ ఎలా ఫీల్ అవుతోంది అనేది ఆసక్తిగా మారింది. ఏసియా నెట్ న్యూసబుల్ కి చెందిన రిచా బుర్రా.. అదా శర్మని ఇంటర్వ్యూ చేశారు. కేరళ స్టోరీ చిత్రంపై వస్తున్న విమర్శలపై ఈ ఇంటర్వ్యూలో స్పందించిన అదా అనేక ఆసక్తికర అంశాలు పంచుకుంది. 

47

అందుకే ఈ కథకి ఒకే చెప్పా

ఈ చిత్రాన్ని ఎంచుకోవడంపై అదా మాట్లాడుతూ.. నేను ఏ కథని అయినా క్షుణ్ణంగా పరిశీలిస్తాను. ఇది చెప్పాల్సిన కథ అని ఫీల్ అయ్యా. అందుకే ఒకే చెప్పా. అదా శర్మ ఈ చిత్రం చేయడంతో ఆమె కుటుంబ సభ్యులు కూడా గర్వంగా ఫీల్ అయ్యారట. కథ వినగానే నాలో కదలిక వచ్చింది. నేను అమ్మాయిని కాబట్టి ఇతర మహిళల బాధని సులభంగా అర్థం చేసుకోగలను. నేను మా అమ్మకి చాలా దగ్గరగా ఉంటాను. ఒక అమ్మాయి తన తల్లికి కుటుంబానికి దూరంగా కనీసం ఫోన్ కాంటాక్ట్ కూడా లేని పరిస్థితుల్లో ఉన్న కథ ఇది. ప్రజలకు తెలియాల్సిన కథలో నేను నటించినందుకు మా కుటుంబ సభ్యులు గర్వంగా ఫీల్ అయ్యారు. 

57

బాధితుల్ని కలిశా

ఈ చిత్ర కథ గురించి తెలుసుకునే ప్రాసెస్ లో నేను కొందరు భాదితులని కూడా కలిశాను. బలవంతంగా వారికీ డ్రగ్స్ ఎలా అలవాటు చేశారు.. ఎలా టార్చర్ చేసారు అనే వీడియోలు చూశాను. కేరళ అమ్మాలని బలవంతంగా వారి ఇళ్ల నుంచి తీసుకువెళ్లి బ్రతకడానికి కూడా కష్టమైన ప్రదేశాల్లో ఉంచిన సంఘటనలు ఉన్నాయి. షాలిని ఉన్నికృష్ణన్ పాత్రలో నా నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి అంటే ఆ క్రెడిట్ దర్శకుడు సుదీప్తో సర్ కే దక్కుతుంది. ఆయన షాలిని పాత్రలో నన్ను నమ్మారు. రియల్ ఇన్సిడెట్స్ ఆధారంగా చేసిన కథ కాబట్టి కొంత ఒత్తిడి ఉండేది కానీ సినిమా చూస్తున్నప్పుడు అందరూ కథలో ఇన్వాల్వ్ అవుతారు. 

67

మతానికి కాదు టెర్రరిజంకి వ్యతిరేకం

ఇప్పటి పరిస్థితుల్లో పాజిటివిటీ కంటే నెగిటివిటీనే ఎక్కువ ఉంటోంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా కేరళ స్టోరీ చిత్రంపై ఎక్కువగా పాజిటివిటీనే ఉంది. ప్రతి రోజు నాకు అనేక మెసేజ్ లు వస్తున్నాయి. అందులో ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారే ఉన్నారు. నెగిటివిటి కూడా ఉంది. కేవలం రెండు నిమిషాల ట్రైలర్ చూసి అపార్థం చేసుకుంటున్న వారు ఉన్నారు. నా తల్లిదండ్రుల నుంచి ప్రతి ఒకరి అభిప్రాయాన్ని గౌరవించే గుణం నేర్చుకున్నా. కాబట్టి వారందరికీ ఒక్క టే చెబుతున్నా.. రెండు గంటల సమయం తీసుకుని ఈ చిత్రం చూడండి. ఒక్క సన్నివేశంలో కూడా కేరళని బ్యాడ్ గా చూపించలేదు అని రియలైజ్ అవుతారు. కేరళ గౌరవం తగ్గించే సన్నివేశం ఒక్కటి కూడా లేదు. 

మనం మన ఆలోచనలని, భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తపరచగలిగే దేశంలో ఉన్నాం. ఈ చిత్రంలో షాలిని పాత్ర కనీసం సొంతంగా ఆలోచించలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుంది. ఈ చిత్రం ఎన్నికల గురించో, రాజకీయాల గురించో కాదు. ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ చిత్రం టెర్రరిజం వర్సెస్ మానవత్వం గా ఉంటుంది. 

77

ప్రతి అమ్మాయి చూడాల్సిన చిత్రం

ప్రతి ఒక్క అమ్మాయి ఈ చిత్రం చూడాలి. ప్రేమ పేరుతో అమ్మాయిలో ఎలా ట్రాప్ చేయబడుతున్నారో తెలుసుకోవాలి. ఎవరైనా అమ్మాయి ఐఎస్ఐఎస్ లో జాయిన్ అయితే అది ఇతరులకు కేవలం ఒక నంబర్ గా తెలుస్తుంది. అదే ఆ మహిళ మన కుటుంబసభ్యురాలు అయితే.. ఆ బాధని ఊహించడం కూడా కష్టమే అంటూ అదా శర్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhan Babu: చిరంజీవి చేతిలో చావు దెబ్బ తిన్న శోభన్ బాబు సినిమా, మెగాస్టార్ పై సోగ్గాడి ప్లాన్ ఏమయ్యిందంటే?
Recommended image2
Jr NTR - Mahesh: రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ ను ఆడేసుకున్న తారక్..
Recommended image3
Tamannaah New House: తమన్నా కొత్తింటి ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. కేవలం ఇంటీరియర్‌కే 3 కోట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved