- Home
- Entertainment
- తారకరత్న ఫ్యామిలీలో స్పెషల్ డే.. సంతోష సమయంలో నీవు లేవు అంటూ కుమిలిపోతున్న అలేఖ్యరెడ్డి
తారకరత్న ఫ్యామిలీలో స్పెషల్ డే.. సంతోష సమయంలో నీవు లేవు అంటూ కుమిలిపోతున్న అలేఖ్యరెడ్డి
నందమూరి తారకరత్న అభిమానులకు ఒక జ్ఞాపకంలా మారిపోయారు. తారకరత్న మరణించి నెలలు గడచిపోతోంది. నందమూరి తారక రత్న ఫిబ్రవరి 22న గుండె సంబంధిత సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే తారకరత్న ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉండేవారు.

నందమూరి తారకరత్న అభిమానులకు ఒక జ్ఞాపకంలా మారిపోయారు. తారకరత్న మరణించి నెలలు గడచిపోతోంది. నందమూరి తారక రత్న ఫిబ్రవరి 22న గుండె సంబంధిత సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే తారకరత్న ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉండేవారు. కానీ కలలో కూడా ఊహించని విధంగా లోకేష్ పాదయాత్ర సమయంలో తారక రత్న కుప్పకూలడం.. ఆసుపత్రిలో కొన్ని రోజుల చికిత్స తర్వాత మరణించడం జరిగింది.
అయితే తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన భర్తని మరచిపోలేకుంది. నిత్యం తారకరత్న జ్ఞాపకాలతో, పిల్లలతో గడుపుతోంది. తరచుగా అలేఖ్య రెడ్డి తారకరత్న ఫోటోలని, ఆయనకి సంబంధించిన విశేషాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.
తాజాగా అలేఖ్య రెడ్డి మరోసారి తారకరత్నని గుర్తు చేసుకుంటూ కుమిలిపోయింది. తారకరత్న ఫ్యామిలిలో నేడు స్పెషల్ డే. అదేంటంటే తారకరత్న కవల పిల్లలు తన్యరామ్, రేయ ఇద్దరి పుట్టినరోజు. దీనితో అలేఖ్య రెడ్డి.. తన్యరామ్, రేయి లతో తారకరత్నకి ఉన్న మధురమైన అనుభూతులకు సంబందించిన దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ సంతోషకర సమయంలో.. ఎంత ప్రయత్నించినా తన్యరామ్, రేయ లకు ఆనందంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేకున్నాను అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి సమయంలో మీరు లేకపోవడం భరించలేని విషయం. కానీ పిల్లల ముఖాల్లో మీరు ఎప్పుడూ ఉంటారు అని పోస్ట్ చేశారు. తన పిల్లల పుట్టినరోజున సంతోషంగా ఉండలేకున్నానని సోషల్ మీడియా ద్వారా తన బాధని అలేఖ్య బయట పెట్టారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తారకరత్న, అలేఖ్య దంపతులకు మొదట కుమార్తె నిష్క జన్మించింది. ఆ తర్వాత కొడుకు తనయ్ రామ్, కుమార్తె రేయ కవలలుగా జన్మించారు. తన తాతగారు NTR లోని మూడు అక్షరాలు కలిసేలా నిష్క, తనయ్, రేయ అని తారకరత్న పిల్లలకు నామకరణం చేశాడు.
ఇటీవల అలేఖ్య తన కొడుకు తన్యరామ్ అచ్చం తండ్రిలాగే ఉన్నాడంటూ పోస్ట్ చేసిన ఓ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. తారకరత్న భద్రాద్రి రాముడు చిత్రంలోని లుక్ ని తన కొడుకు తనయ్ రామ్ తో పోల్చుతూ అలేఖ్య పోస్ట్ పెట్టారు.ఈ ఫోటో కి అలేఖ్య లైక్ ఫాదర్ లైక్ సన్ అని కామెంట్ పెట్టింది. ఈ ఫోటోని షేర్ చేస్తూ నందమూరి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.