- Home
- Entertainment
- పేరెంట్స్ కి బాలయ్య రిక్వెస్ట్.. `అఖండ 2 తాండవం`ని వీళ్లకి చూపించాలట.. సెకండ్ ఇన్నింగ్స్ పై కామెంట్
పేరెంట్స్ కి బాలయ్య రిక్వెస్ట్.. `అఖండ 2 తాండవం`ని వీళ్లకి చూపించాలట.. సెకండ్ ఇన్నింగ్స్ పై కామెంట్
బాలకృష్ణ త్వరలో `అఖండ 2 తాండవం` చిత్రంతో రాబోతున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మొదటి పాటని విడుదల చేశారు. ఇందులో పేరెంట్స్ కి బాలయ్య ఓ రిక్వెస్ట్ చేశారు.

అంచనాలు పెంచిన `అఖండ 2 తాండవం` సాంగ్
బాలకృష్ణ ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ నాలుగు హిట్స్ కొట్టారు. సీనియర్లలో అత్యంత సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న హీరోగా నిలిచారు. ప్రస్తుతం ఆయన `అఖండ 2 తాండవం`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమితి. ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే ఈమూవీకి పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగుతోపాటు, హిందీలో మెయిన్‌గా ఫోకస్ పెట్టారు. వీటితోపాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ మూవీని విడుదల చేయబోతున్నారు. బాలయ్య నుంచి ప్రాపర్ పాన్ ఇండియా మూవీగా దీన్ని విడుదల చేస్తుండటం విశేషం.
పేరెంట్స్ కి బాలయ్య రిక్వెస్ట్
ఇక తాజాగా శుక్రవారం (నవంబర్ 14) నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. ఈ సినిమా నుంచి `అఖండ తాండవం` పాటని విడుదల చేశారు. అందుకోసం ముంబయిలో ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న బాలయ్య హిందీలో మాట్లాడటం విశేషం. తనదైన హిందీ భాషతో అక్కడి ఆడియెన్స్ ని, ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు బాలయ్య. ఇందులో బాలయ్య మాట్లాడుతూ, అందరి పేరెంట్స్ కి రిక్వెస్ట్ చేశారు. ఈ మూవీకి పిల్లలకు కచ్చితంగా చూపించాలని తెలిపారు. ఈ మూవీలోని కథ గురించి పిల్లలు తెలుసుకోవాలన్నారు. మన హిందూ సనాతన ధర్మం ఏమిటో చెప్పాలన్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ అనేది నా డిక్షనరీ లో లేదు
బాలకృష్ణ ఇంకా మాట్లాడుతూ, మా నాన్నగారి అడుగుజాడల్లో ముందుకు వెళుతున్నాను. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందిస్తున్నాను. బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గా ఎంతోమందికి ఉచితవైద్యం అందించడం జరుగుతోంది. ఇంతమంది అభిమానుల్ని పొందడం పూర్వజన్మ సుకృతం. 50 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కథానాయకుడిగా ఉన్నాను. సెకండ్ ఇన్నింగ్స్ అనేది నా డిక్షనరీలో లేదు. హిందూ సనాతన ధర్మం శక్తి పరాక్రమం `అఖండ2` లో చూస్తారు. ధర్మంగా బ్రతకండి, సత్యం మాట్లాడండి, అన్యాయానికి తలవంచకండి.. ఇది అఖండ తాండవం. బోయపాటితో మూడు సినిమాలు చేశాం. `సింహ లెజెండ్ అఖండ`. మూడు హ్యట్రిక్స్. ఇది నాలుగో సినిమా. బోయపాటి నేను ఒకటే వేవ్ లెంత్ లో వర్క్ చేస్తాం. తమన్ తో `అఖండ`, `వీరసింహారెడ్డి`, `నేలకొండ భగవంత కేసరి`, `డాకు మహారాజ్` ఇప్పుడు `అఖండ2` చేస్తున్నాం. మాది అద్భుతమైన కాంబినేషన్.
అన్‌స్టాపబుల్ వెనుక తేజస్విని
కైలాష్ ఖేర్, శంకర్ మహదేవన్` హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ఈ పాటని ఎంతో అద్భుతంగా ఆలపించారు. `బజరంగ్ భాయిజాన్` తర్వాత హర్షాలి ఈ సినిమా చేసింది. ఆమెది చాలా కీలకమైన పాత్ర. ఆది పినిశెట్టి అద్భుతమైన నటుడు. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఆచంట రామ్, గోపి నిర్మాణంలో నాకు ఇది రెండో సినిమా. చాలా మంచి సినిమాలు తీయాలి ఇండస్ట్రీకి కాంట్రిబ్యూట్ చేయాలని తపనతో ఉండే ప్రొడ్యూసర్స్. జార్జియా, మధ్యప్రదేశ్ ఇలా చాలా అద్భుతమైన లొకేషన్స్ లో షూట్ చేశాం. సినిమాని ప్రజెంట్ చేస్తున్న నందమూరి తేజస్విని మా అమ్మాయి. నేను హోస్టుగా చేసిన అన్ స్టాపబుల్ ఇండియాలో నెంబర్ వన్ షో. ఆ షోకి మా అమ్మాయి క్రియేటివ్ కన్సల్టెంట్ గా వర్క్ చేశారు. `అఖండ2` చాలా అద్భుతమైన సినిమా. డిసెంబర్ 5న మీ ముందుకు వస్తుంది` అని అన్నారు.
ఇది సినిమా కాదు, మన దేశం ఆత్మ
డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ, `ఇదొక సినిమా మాత్రమే కాదు, భారతదేశ ఆత్మ. భారతదేశం ధర్మం. ఈ సినిమా చూసిన తర్వాత మీరు అదే ఫీల్ అవుతారు. ఫ్యామిలీ అందరు కలిసి వెళ్లి ఆనందంగా చూసే సినిమా. మన దేశం, మన వేదం, మన కల్చర్ ఇవన్నీ ఈ సినిమాలో చూస్తారు. బాలయ్యతో నాలుగు సినిమాల జర్నీ. ప్రతి సినిమా ట్రెమండస్ హిట్. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ మైనస్ 12 డిగ్రీస్ లో షూట్ చేసాం. మాకు ఆ శివుడే దారి చూపించాడు. సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. తప్పకుండా అందరూ ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాం` అని చెప్పారు. ఇందులో నిర్మాతలు, థమన్, సింగర్స్, హర్షాలి, ఇతర టీమ్ పాల్గొన్నారు.