MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లోకి ఎలిమినేటైన కంటెస్టెంట్లు రీఎంట్రీ.. అందులోనూ క్రేజీ ట్విస్ట్

బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లోకి ఎలిమినేటైన కంటెస్టెంట్లు రీఎంట్రీ.. అందులోనూ క్రేజీ ట్విస్ట్

Bigg Boss Telugu 9: బిగ్‌ బాస్‌ తెలుగు 9 లో మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నారు బిగ్‌ బాస్‌. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లని మళ్లీ హౌజ్‌లోకి తీసుకురాబోతున్నారట. అందులోనూ మరో అదిరిపోయే ట్విస్ట్ ఉందని సమాచారం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 24 2025, 08:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లో అదిరిపోయే ట్విస్ట్
Image Credit : starmaa

బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లో అదిరిపోయే ట్విస్ట్

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ తర్వాత చాలా మారిపోయింది. అసలైన రచ్చ ఇప్పుడు నడుస్తోంది. ఇందులో దివ్వెల మాధురీ రెచ్చిపోతుంది. ఇతర కంటెస్టెంట్లకి కౌంటర్లిస్తూ దుమ్మురేపుతుంది. మరోవైపు రీతూ చౌదరీ, ఇమ్మాన్యుయెల్‌, సంజనా, సుమన్‌ శెట్టి వంటి వాళ్లు కూడా తమదైన స్టయిల్‌లో ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. కంటెంట్ ఇస్తున్నారు. ప్రారంభంలో హడావుడి చేసిన రమ్య ఇప్పుడు డల్‌ అయ్యింది. అలాగే ఆయేషా జీనత్‌ కూడా రెచ్చిపోతుంది. ఓ వైపు వాళ్లు చేసే హడావుడి ఒక రేంజ్‌లో ఉంటే, ఇప్పుడు బిగ్‌ బాస్‌ ఇచ్చే ట్విస్ట్ లు వేరే లెవల్‌లో ఉన్నాయని చెప్పొచ్చు. ఈ రోజు ఎపిసోడ్‌లో ఇద్దరు మాజీ కంటెస్టెంట్లని హౌజ్‌లోకి పంపించారు. అర్జున్‌, అమర్‌ దీప్‌ పోలీసులుగా ఎంట్రీ ఇచ్చి రచ్చ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మళ్లీ రీఎంట్రీ
Image Credit : Starmaa

ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మళ్లీ రీఎంట్రీ

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది. హౌజ్‌లోకి ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు రాబోతున్నారట. ఇప్పటి వరకు ఆరుగురు కంటెస్టెంట్లు బిగ్‌ బాస్‌ తెలుగు హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. భరణి, ఫ్లోరా, ప్రియా, మర్యాద మనీష్‌, హరీష్‌, శ్రష్టి వర్మ, శ్రీజ ఎలిమినేట్‌ అయిన వారిలో ఉన్నారు. వీరిలో ఆరుగురు కంటెస్టెంట్లని మళ్లీ బ్యాక్‌ తీసుకురాబోతున్నారట బిగ్‌ బాస్‌. ఇదే ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది. మరి ఎందుకు బ్యాక్‌ తీసుకురాబోతున్నారు? ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

34
వచ్చే వారం నామినేట్‌ చేసేది వాళ్లే
Image Credit : StarMaa

వచ్చే వారం నామినేట్‌ చేసేది వాళ్లే

ఇప్పటి వరకు ఎలిమినేట్‌ అయిన వారిలో మర్యాద మనీష్‌ తప్ప, భరణి, శ్రీజ, ప్రియా, శ్రష్టి వర్మ, హరీష్‌లను మళ్లీ హౌజ్‌లోకి పంపించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ వారం వీళ్లే కంటెస్టెంట్లని నామినేట్‌ చేస్తారట. వచ్చే వారానికి సంబంధించి నామినేషన్‌ ఈ ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు చేస్తారని తెలుస్తోంది. అందులో భాగంగానే వీరిని మళ్లీ హౌజ్‌లోకి తీసుకురాబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉందట. వీరిలో ఇద్దరు కంటెస్టెంట్లని అందులోనే ఉంచబోతున్నారట. దానికంటూ ఓ ప్రాసెస్‌ ఉంటుందని సమాచారం. అదేంటో ఆదివారం ఎపిసోడ్‌లో చెప్పనున్నట్టు టాక్‌. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

44
ఇద్దరు కంటెస్టెంట్ల మళ్లీ కొనసాగింపు?
Image Credit : starmaa

ఇద్దరు కంటెస్టెంట్ల మళ్లీ కొనసాగింపు?

సాధారణంగా ఎలిమినేషన్‌కి సంబంధించి సోమవారం నిర్వహించే నామినేషన్ల ప్రక్రియని కంటెస్టెంట్లే చేస్తారు. అందరు కంటెస్టెంట్లు ఇద్దరిద్దరిని నామినేట్‌ చేస్తారు. వచ్చిన నామినేషన్లని బట్టి బిగ్‌ బాస్‌ ఫైనల్‌గా ఎవరు నామినేట్ అయ్యారో చెబుతారు. కానీ ఈ సారి అంతా రివర్స్ జరుగుతుంది. ట్విస్ట్ లతో నడుస్తోంది. నామినేషన్‌ కోసం సెపరేట్‌ టాస్క్ లు కూడా ఇస్తున్నారు బిగ్‌ బాస్‌. దీంతో ఎవరు ఎవరిని నామినేట్‌ చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అదే వింతగా ఉందంటే, ఇప్పుడు మరో వింత క్రియేట్‌ చేస్తున్నారు నిర్వాహకులు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త ఆద్యంతం ఆసక్తికరంగా మారింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hi OTT Release: హాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. నయనతార మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Recommended image2
Rama Prabha: ప్రతి నెలా 25 వేలు అకౌంట్ లో వేస్తాడు, కానీ ఫోన్ మాత్రం ఎత్తడు, రమాప్రభకు సహాయం చేస్తున్న డైరెక్టర్ ఎవరు?
Recommended image3
Giri Babu: 40 రూపాయల రూమ్ రెంట్, స్కూల్ లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తూ.. గిరిబాబుతో కలిసున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
డేంజర్‌ జోన్‌లో ఆ కంటెస్టెంట్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఏడో వారం డబుల్‌ ఎలిమినేషన్‌, ఆమె మిడ్‌ వీక్‌ వాకౌట్‌ ?
Recommended image2
నెట్‌ ఫ్టిక్స్ లో టాప్‌ 5 మూవీస్‌.. ఒక్క రోజులోనే ఓటీటీని షేకింగ్‌ చేస్తోన్న పవన్‌ కళ్యాణ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved