కలర్ తక్కువగా ఉన్నావ్, అక్కడ సర్జరీ చేయించుకో.. బంధువుల్లో, ఇండస్ట్రీలో ఈషా రెబ్బాకి దారుణమైన అవమానాలు..
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా డస్కీ బ్యూటీ. కానీ ఆమె కలర్ విషయంలో చాలా అవమానాలు ఫేస్ చేసిందట. బంధువులే దారుణంగా అవమానించినట్టు చెప్పింది ఈషా.
సినిమా అంటేనే గ్లామర్. ఇందులో హీరోయిన్ల గ్లామర్‌కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. చాలా మంది హీరోయిన్లు అందం కోసం రకరకాలు సర్జరీలు చేయించుకుంటారు. మంచి కలర్ కోసం సర్జరీలు, లేదా ఏదైనా పార్ట్ బాగా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకుంటారు. తెలుగు బ్యూటీ ఈషా రెబ్బాకి కూడా ప్రారంభంలో చాలా రకాలుగా కామెంట్ చేశారట.
ఈషా రెబ్బా డస్కీ బ్యూటీ. తన స్కిన్ టోన్ ప్రత్యేకం. హాట్ అనే పదానికి ఆమె కేరాఫ్ అని చెప్పొచ్చు. చాలా మంది అలాంటి టోన్‌నే ఇష్టపడుతుంటారు. తాను కూడా అదే చెప్పింది. ఇలాంటి రేర్ కలర్ టోన్ ఆడియెన్స్ ఇష్టపడతారని వెల్లడించింది. అయితే ప్రారంభంలో మాత్రం తాను దారుణమైన అవమానాలు ఫేస్ చేసిందట. తమ రిలేటివ్స్ ఇతర కజిన్స్ తో పోల్చుతూ కొంచెం తెల్లగా ఉంటే బాగుండూ అనేవారట.
సినిమాల్లోకి వెళ్లడానికి ముందు కూడా చాలా మంది తన స్కిన్ కలర్ గురించి మాట్లాడారట. కలర్ తక్కువగా ఉన్నావని చెప్పేవారట. ఫోటో షూట్ చేసినప్పుడు కూడా ఎంత నల్లగా ఉన్నావో చూడు అనేవారట. కాస్త కలర్ ఉంటే బాగుండేది, సినిమాల్లో రాణించాలంటే కలర్ ఎక్కువగా ఉండాలి, దానికి సంబంధించి బ్యూటీ క్రీములు వాడమని, ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పేవాళ్లు. దీంతో తాను చాలా ఇన్‌సెక్యూరిటీ ఫీలయ్యేదాన్ని అని చెప్పింది ఈషా రెబ్బా.
సినిమాల్లో ప్రారంభంతో తాను భయపడిపోయినట్టు తెలిపింది. అంటే నా కలర్ పనికి రాదా అని లోగా ఫీలయ్యేదట. ఏదైనా యాడ్ చేసినా ఫేస్ మొత్తానికి తెల్లగా మేకప్ వేసేవారట. పెయింట్ కొట్టినట్టుగానే ఉండేదని దాని వల్ల చాలా ఇబ్బంది పడేదాన్ని అని చెప్పింది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చాక నీ కలర్ బాగుంది, పెద్ద అసెట్ అని చెప్పారట. అప్పుడు ఓ అవునా నిజానికి నా కలర్ బాగుంటుందా అని అప్పుడు కాన్పిడెన్స్ వచ్చిందని చెప్పింది ఈషా రెబ్బా.
ఇక కొందరైతే నోస్ సర్జరీ చేయించుకోమని చెప్పారట. అప్పటి వరకు నాకు అసలు ఇలా సర్జరీలు చేయించుకుంటారనే విషయమే తెలియదు. వాళ్లు ఇలా చెబుతుంటే చాలా బాధగా అనిపించేదని చెప్పింది ఈషా రెబ్బా. ఐడ్రీమ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించింది ఈషా.
అంతేకాదు తాను తెలుగు అమ్మాయి అని చెప్పొద్దని, ముంబయి నుంచి వచ్చినట్టు చెప్పాలని, తెలుగు ఎక్కువగా మాట్లాడవద్దని చెప్పేవారు. తెలుగు అమ్మాయి అని తెలిస్తే అవకాశాలు ఇవ్వరు, తక్కువగా వస్తాయి. సర్వైవ్ అవ్వడం కష్టమని చెప్పేవారు.తన ఫస్ట్ సినిమాకి ఇంద్రగంటి మోహనకృష్ణ ఆడిషన్‌కి పిలిచినప్పుడు తనని నార్త్ అమ్మాయి అనుకున్నాడట.
ఇలా చాలా మంది తనని లోకల్ అని చెప్పొద్దు అని సలహాలిచ్చినట్టు తెలిపింది ఈషా. తాను లోకల్ అమ్మాయిని, తన ఐడెంటిటీ ఇదే, అలాంటిది తెలుగు అమ్మాయి కాదని ఎలా చెబుతాను, తనని తాను ఫేక్ అని చెప్పుకోవడం ఇష్టంలేదని, తెలుగు అమ్మాయిగానే గర్వపడతానని, అదే చెప్పేదాన్ని అని వెల్లడించింది తెలుగు అందం ఈషా.