- Home
- Entertainment
- Yashoda First Day Collections : ఇదీ సమంత రేంజ్.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా!
Yashoda First Day Collections : ఇదీ సమంత రేంజ్.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజా చిత్రం ‘యశోద’ (Yashoda). నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తొలిరోజు సాలిడ్ కలెక్షన్లను రాబట్టింది. ఈ కలెక్షన్లు బట్టి సమంత రేంజ్ ఏంటో మరోసారి ఫ్రూవ్ అయ్యింది.

‘యశోద’తో స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తాజాగా స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. స్టార్ హీరోలకు ధీటుగా సమంత పాపులారిటీని సొంతం చేసుకుంది. విభిన్న కథాంశాలతో.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. సెపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకుంది.
తాజాగా సమంత నటించిన సైంటిఫిక్ యాక్షన్ ఫిల్మ్ ‘యశోద’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవంబర్ 11న ’(నిన్న) ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. రిలీజ్ కు ముందే అంచనాలను క్రియేట్ చేసిన ఈ చిత్రం వాటిని రీచ్ అయ్యింది. తొలిరోజు సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.
మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా యశోద దూకుడుగా వ్యవహరిస్తోంది. తొలిరోజు కలెక్షన్లు షాకింగ్ గా ఉన్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికీ కోట్లట్లో వసూళ్లు రాబట్టడం విశేషం. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే మొదటి రోజు రూ. కోటికి పైగా వసూలు చేయడం మరో విషయం. ఒక్క తెలుగులోనే 50,000 కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. ‘యశోద’ తొలిరోజు కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ. 3.25 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. నైజాంలో రూ.84 లక్షలు, సీడెడ్ లో రూ.18 లక్షలు, ఏపీలో రూ.63 లక్షలు, తమిళంలో రూ.14 లక్షలు, మలయాళంలో రూ.10 లక్షలు, కర్ణాటక, మిగితా ఇండియాలో రూ.20 లక్షల వసూళ్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో రూ.84 లక్షలు వసూల్ చేసి.. మొత్తం రూ.3.25 కోట్లు రాబట్టగలిగింది.
సమంత అనారోగ్యం కారణంతో ‘యశోద’చిత్రాన్ని కావాల్సినంత ప్రమోట్ చేయలేకపోయింది. అయినా తొలిరోజే మంచి ఓపెన్సింగ్స్ నే దక్కించుకుందని చెప్పొచ్చు. ఇక వీకెండ్ తో పాటు మొదటి వారాంతంలో రూ.15 కోట్ల వరకు వసూళ్లు చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. టాక్ అదిరిపోవడంతో రెండో వారంలోనూ మరింతగా వసూళ్లు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే చిత్రం 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.22.5 కోట్లుగా ఉంది.
మహిళా-కేంద్రీకృతమైన సైన్స్ ఫిక్షన్ మరియు ఎమోషనల్ థ్రిల్లర్ గా ‘యశోద’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శక ద్వయం హరి-హరీష్ తెరకెక్కించారు. ఇది సమంత మొదటి పాన్-ఇండియా ప్రాజెక్ట్ గా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలోనూ రిలీజ్ అయ్యింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.