రష్మిక ఆస్తుల విలువ తెలుసా? ఫోర్బ్స్ రిపోర్ట్!
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ఆస్తుల గురించి ఫోర్బ్స్ నివేదిక విడుదల చేసింది. ఆమె ఒక్కో సినిమాకు రూ.4-8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని, దాన్ని బట్టి లెక్కేసి ఎంత ఆస్తులు ఉన్నాయో పేర్కొంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Do You Know Rashmika Mandanna Net Worth? in telugu
టాలీవుడ్ లో గీతాగోవిందం సినిమాలో రష్మిక నటించి ప్రేక్షకుల మనసు దోచింది. ఆ తర్వాత పుష్ప సినిమాలో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. అప్పటినుంచీ నుంచి రష్మిక దశ మామూలుగా లేదు.
యానిమల్ మూవీతో నేషనల్ వైడ్ స్టార్‌గా ఎదిగారు. ఆ తర్వాత వచ్చిన పుష్ప 2 ది రూల్, ఛావా సినిమాలు నెక్ట్స్ లెవిల్ లో కూర్చోబెట్టాయి. రంజాన్ సందర్బంగా సల్మాన్ ఖాన్ సరసన చేసిన సికిందర్ చిత్రం రిలీజ్ కానుంది.
Do You Know Rashmika Mandanna Net Worth? in telugu
మరో ప్రక్క గీతా ఆర్ట్ నిర్మాణంలో తెరకెక్కుతున్న గర్ల్ ఫ్రెండ్, నాగార్జున, ధనుష్‌లతో నటిస్తున్న కుబేరా చిత్రాలతో ట్రెండింగ్ అవుతోంది.
తెలుగు, తమిళ, హిందీ.. ఇలా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటోంది. తాజాగా ఈమె ఆస్తుల గురించి ఫోర్బ్స్ నివేదిక బయటపెట్టింది.
Do You Know Rashmika Mandanna Net Worth? in telugu
కర్ణాటకకు చెందిన రష్మిక ప్రస్తుత వయసు 28. కానీ ఆస్తి మాత్రం రూ.66 కోట్ల వరకు సంపాదించిందని ఫోర్బ్స్ చెప్పుకొచ్చింది. ఒక్కో సినిమాకు రూ.4-8 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటుందని పేర్కొంది.
రీసెంట్ గా 'ఛావా'తో సూపర్ సక్సెస్ అందుకుంది. త్వరలో ఈమె ఆస్తి రూ.100 కోట్లకు చేరొచ్చని అంచనా. వీటితో పాటు రష్మిక మరోవైపు యాడ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తోంది.
హైదరాబాద్, ముంబై, బెంగళూరు, గోవా, కూర్గ్ లో ఈమెకు సొంత ఫ్లాట్స్ ఉన్నాయి.