ఆ ఒక్క సినిమాకు జాన్వీ కపూర్ ఎంత పారితోషికం తీసుకుందో తెలుసా?
శ్రీదేవి కూతురిగా జాన్వీ దక్షిణాది అభిమానులకు పరిచయం. తాజాగా 'పరం సుందరి' సినిమా ఆగస్టు 29న విడుదల కానుంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికోసం వారు నిర్మాతల నుండి భారీ పారితోషికం అందుకున్నారు.

జాన్వీ కపూర్ పారితోషికం ఎంత?
శ్రీదేవి వారసురాలిగా తెరంగేట్రం చేసింది జాన్వీ. ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అందంతో పాటూ అభినయం, డ్యాన్సు కూడా అదరగొడుతుండడంతో ఆమెకు అవకాశాలు వరసపెట్టి వస్తున్నాయి. ఆమె తాజా సినిమా 'పరం సుందరి'. ఈ బాలీవుడ్ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించారు. ఇక సినిమాలో హీరోయిన్ గా నటించింది జాన్వీ. ఇందుకోసం ఆమె 4 నుండి 5 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారు.
హీరో రెమ్యునరేషన్
'పరం సుందరి' సినిమాలో కథానాయకుడిగా సిద్ధార్ధ్ మల్హోత్రా నటిస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం, ఆయన ఈ సినిమా కోసం 10 నుండి 12 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకన్నట్టు తెలుస్తోంది.
సంజయ్ కపూర్
ప్రముఖ నటుడు సంజయ్ కపూర్ కూడా 'పరం సుందరి' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం నిర్మాతలు ఆయనకు 50 లక్షల రూపాయలు ఇచ్చారు.
రెంజీ పణికర్
రెంజీ పణికర్ కూడా 'పరం సుందరి' సినిమాలో కనిపించనున్నారు. దీనికోసం ఆమెకు 25-30 లక్షల రూపాయలు లభిస్తున్నాయి.
మంజోత్ సింగ్
'పరం సుందరి' సినిమాలో మంజోత్ సింగ్ కూడా ఉన్నారు. ఈ సినిమాలో నటించినందుకు ఆయనకు 25 లక్షల రూపాయల పారితోషికం లభిస్తోంది.