Samantha: ‘పుష్ప’ ఐటెం సాంగ్ ఖర్చేంతో తెలుసా.. ఒక్క సమంతాకే..!
ఇటీవల కాలంలో సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ‘పుష్ఫ : ది రైజ్’ మూవీ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా బడ్జెట్ విషయాన్ని కాస్తా పక్కకుపెడితే.. ఫుష్ఫ సినిమాలోని ‘ఊ అంటవా మావా.. ఊఊ అంటవా మావా’ ఒక్క సాంగ్ కోసం సమంత ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలిస్తే షాక్ కు గురికావాల్సిందే..

‘ఫుష్ప : దిరైజ్’ మూవీలో సమంత తొలిసారిగా ఐటెం సాంగ్ చేయడంతో కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయట. అయితే ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా.. ఈ పాట ఏ రేంజ్‌లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమంత హాట్ లుక్స్, క్లీవేజ్, హిప్ రోటేట్ వంటివి కుర్రాళ్లకు థియేటర్లలో చెమలు పట్టించాయి. సాంగ్ రిలీజైన్ ఒక్క రోజులోనే మిలియన్లలో వ్యూస్ సంపాదించింది.
అయితే ఈ సాంగ్ వచ్చిన కొంతలో కొంత విమర్శలు గురైనా.. ఎక్కువ మొత్తలంలో సాంగ్ ను ఆదరించిన వారే ఉన్నారు. అప్పటికే తన వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న సమంత ఈ సాంగ్ చేయడంతో కొంత భయాందోళన చెందిందాట. కానీ సాంగ్ రిలీజ్ అయ్యాక ఇంత పెద్ద హిట్ ఇవ్వడంతో చాలా సంతోషం వ్యక్తం చేసింది.
‘ఊ అంటవా మావా.. ఊఊ అంటావా’ సాంగ్ లో క్రేజీ స్టెప్స్, విజువల్స్, సెట్టింగ్ ఇతరాత్ర ఖర్చులతో పాటు మొత్తం రూ.5 కోట్ల వరకు ఖర్చు చేశారు ప్రొడ్యూసర్లు. ఈ ఐదు కోట్ల రూపాయాలలో రూ. కోటీ 50 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తోంది. పలువు మీడియా సంస్థల అంచనా ప్రకారం ఏకంగా రూ.5 కోట్లు తీసుకుందని, సాంగ్ మేకింగ్ మరింత ఖర్చు అయ్యినట్టు భావిస్తున్నారు.
కాగా, తొలుత లక్షల్లోనే రెమ్యూనరేషన్ తీసుకునే ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం ఏ సినిమా చేసినా ఒక్కో సినిమాకు రూ. 3 నుంచి రూ. 4 కోట్లు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. తెలుగుతో పాటు ఇతర భాషల చిత్రాల్లోనూ నటించడంతో సమంతకు ఫ్యాన్ ఫాలోంగ్ ఎక్కువగా ఉండటం. ఎప్పటికప్పుడు తన శరీరాక్రుతిని అందంగా మలుచుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ సుందరి తన హవాను కొనసాగిస్తోంది.
ఐటెం సాంగ్ లో సమంత తన అందచందాలు, స్టెప్పులు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. ఈ సాంగ్ ఎంత వివాదమయ్యిందో అంతకంటే ఎక్కువ సెన్సేషనల్ హిట్ అయింది. అయితే ఈ పాటలో ఆడిపాడేందుకు సమంత ముందు ఒప్పుకోలేదట. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దగ్గరుండి ఆమెను ఒప్పించడంతో పుష్పలో సామ్ స్పెషల్ సాంగ్‌లో కనిపించి అలరించింది. ఇందుకు ఓ ఇంటర్వూలో అల్లు అర్జున్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిక్క ఈ చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందే విడుదలైన ఈ ఐటెం సాంగ్ ఒక ఊపూపింది. ఈ పాటతో ఒక్క సమంతే కాకుండా సాంగ్ ను తెలుగులో పాడిన సింగర్ ఇంద్రవతి చౌహాన్ కూడా జనాల్లో గుర్తింపు తెచ్చుకుంది. చంద్రబోస్ మాస్ లిరిక్స్ తో, దేవీ శ్రీ ప్రసాద్ క్యాచీ ట్యూన్ తో సాంగ్ విజయవంతంగా నిలిచింది. ‘పుష్ప : రూల్’మూవీ ప్రొడక్షన్ పనులు ఫిబ్రవరిలో స్టార్ట్ కానున్నాయి.