MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Telugu Heroines : విదేశీ అబ్బాయిలను పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Telugu Heroines : విదేశీ అబ్బాయిలను పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్లు ఎవరో తెలుసా?

తెలుగు హీరోయిన్లు సినిమాల్లో అలరించడమే కాకుండా,  కులం, మతం, జాతి, ప్రాంతీయ బేధాలు లేవని  కూడా నిరూపించారు. ఈ సందర్భంగా అచ్చమైన తెలుగమ్మాయిలైన నటీమణులు విదేశీ అబ్బాయిలను పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలించారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 26 2022, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దర్శకరత్న దాసరి నారాయణరావు వెండితెరకు పరిచయం చేసిన హీరోయిన్లలో అలనాటి హీరోయిన్  మాధవి (Madhavi) ఒకరు. కమల్ హాసన్ సరసన ‘మరోచరిత్ర’లో నటించిన  అచ్చ తెలుగమ్మాయి మాధవి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ నటించింది. తెలుగమ్మాయి అయినప్పటికీ భారత - జర్మనీ సంతతికి చెందిన రాల్ఫ్ శర్మ అనే ఫార్మాస్యూటికల్ వ్యాపారిని 1996లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం న్యూ జెర్సీలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 
 

26

విజయవాడకు చెందిన అచ్చ తెలుగమ్మాయి, స్టార్ హీరోయిన్ రంభ (Rambha) దక్షిణాదిలోని అన్ని భాషా చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.   2010లో కెనడాకు చెందిన ఇంద్రకుమార్ ను పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయ్యింది. సినిమాలకు గుడ్ బై చెప్పి.. ఆయా పాత్రల్లో కొన్నాళ్లు అలరించింది. వీరు కూడా ముగ్గురు సంతానం కలిగి ఉన్నారు. 

36

సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘రాజకుమారుడు’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా (Preity Zinta) బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. 2016 ఫిబ్రవరి 29న జింటా అమెరికాకు చెందిన జీన్ గుడ్‌నఫ్‌ను లాస్ ఏంజిల్స్‌లో పెళ్లి చేసుకుంది. గూడెనఫ్ US-ఆధారిత జలవిద్యుత్ సంస్థ అయిన NLine ఎనర్జీలో ఫైనాన్స్‌కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం ప్రీతి ఇండియాకు, అమెరికాకు వస్తూ పోతూ ఉంటుంది. 
 

46

బాలానటిగా వెండితెరపై అడుగుపెట్టి హీరోయిన్ గానూ రాణించిన మరో తెలుగు హీరోయిన్ లయ (Laya). తెలుగు సీనియర్ హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కూడా విదేశీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. విజయవాడలోని బ్రహ్మణ కుటుంబానికి చెందిన లయ కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీని 2006లో పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ఈ దంపతులు ప్రస్తుతం అమెరికాలోనే సెటిల్ అయ్యారు. 
 

56

కేరళకు చెందిన మీరా జాస్మిన్ (Meera Jasmine) కూడా తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగానే దగ్గరైంది. ‘అమ్మాయి బాగుంది’ ‘గుడుంబా శంకర్’, ‘భద్ర’, ‘పందెంకోడి’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ కుట్టి కూడా 2014లో దుబాయ్ కి చెందిన అనిల్ జాన్ అనే ఇంజినీర్ ను పెళ్లి చేసుకుంది. 
 

66

ఫైర్ బ్రాండ్ రాధికా ఆప్టే (Radhika Apte) కూడా విదేవీ అబ్బాయినే పెళ్లి చేసుకుంది. రక్త చరిత్ర, లెంజెండ్ లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.  రాధికా ఆప్టే కూడా లండన్ కు చెందిన బెనెడిక్ట్ టేలర్‌ను 2013లో పెళ్లి చేసుకుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?
Recommended image2
Priyanka Chopra: స్వర్ణ దేవాలయంలో సేవ.. పాత్రలు కడిగిన గ్లోబల్ బ్యూటీ..
Recommended image3
అప్పులున్నవారికి ధైర్యాన్నిచ్చే సినిమా, కార్మేని సెల్వం కాన్సెప్ట్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved