Intinti Gruhalakshmi: అనసూయ మనసులో విషం నింపిన నందు, లాస్య.. ఆర్టికల్ పై అభి గొడవ!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఆగస్ట్ 24వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... అభి,ప్రేమ్ దగ్గరికి వచ్చి అమ్మంటే నీకు మాత్రమే ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు అమ్మంటే మాకు ఇష్టమే కానీ సమాజం అమ్మని తప్పుగా చూస్తే తట్టుకోలేము కదా అందుకే ముందు జాగ్రత్తతో తప్పు జరగకూడదు అని చెప్తున్నాను అని అంటాడు అభి. అప్పుడు పరంధామయ్య,తులసి మీద మకు నమ్మకం ఉంది. తులసి అలాంటి తప్పు ఎన్నటికీ చేయదు ఇప్పుడిప్పుడే తులసికి స్వతంత్రం వస్తుంది,ఇప్పటి వరకు మన కట్టుబాటులో ఉండిపోయింది ఇప్పటికైనా ప్రపంచం చూడనివ్వాలి అని అంటాడు.
ఇంతలో శృతి, దివ్యలు కూడా ఆడవాళ్లంటే ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుని ఉండాలా బయటకు వెళ్లకూడదా?అని అంటారు. నువ్వు మాట్లాడవేంటి అనసూయ అని పరంధామయ్య అనసూయ తో అనగా, అనసూయ అభి చెప్పిన దానిలో కూడా విషయం ఉంది కదా ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది అని అంటాడు. అప్పుడు దివ్య నువ్వు కన్ఫ్యూజన్లో మాట్లాడొద్దు నానమ్మ అని అంటుంది .అప్పుడు అనసూయ మనసులో నిజమే నేను కన్ఫ్యూజన్ తోనే మాట్లాడుతున్నాను అసలు ఏంటో నాకు అర్థం అనుకుంటుంది అనసూయ.
అప్పుడు పరంధామయ్య, ఇంట్లో వాళ్ళ అందరితో గట్టిగా, ఇంకా ఈ విషయం గురించి ఇక్కడే ఆపేయండి తులసి వరకు ఈ విషయం వెళ్లకూడదు అని అంటాడు. ఇంతట్లో తులసి అక్కడికి వస్తుంది ఏమైంది అని తులసి అడగగా, ఏమీ లేదు మాట్లాడుకుంటున్నాము అని అంటారు. ఇంతటిలో సామ్రాట్ తులసి ఇంటికి వస్తాడు మీతో పర్సనల్ గా మాట్లాడాలి అని సామ్రాట్ అనగా వద్దు ఇక్కడే మాట్లాడండి అని అభి అంటాడు. నాకు అదే మంచిది అని సామ్రాట్ చెప్పి ఆర్టికల్ అంతా తులసికి చెప్పగా తులసి నవ్వి ఇదంతా మీరు సీరియస్ గా తీసుకుంటున్నారా సామ్రాట్ గారు.
ఇలాంటివి నేను అసలు పట్టించుకోను చందమామ ఎంత అందంగా ఉన్నా అందులో మచ్చ గురించే అందరూ చూస్తారు అలాగని చందమామ మనకి వెన్నెలని ఇవ్వడం మాపేస్తుందా అని ఉదాహరణలు చెబుతుంది తులసి. అప్పుడు సామ్రాట్ మీరు ఈ మాటతో నాలుగు మెట్లు ఎక్కేశారు అని పొగుడుతా ఉంటారు. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కొంచెం కూల్ అవుతారు. ప్రేమ్ అభితో చూసేవా అది అమ్మ అంటే అని అంటాడు. ఆ తర్వాత అందరూ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్తూ ఉండగా అనసూయ, తులసి సామ్రాట్లు మాట్లాడుకోవడం చూసి ఆలోచనలో పడుతుంది.
ఆ తర్వాత సీన్లో సామ్రాట్ తులసి గురించి ఆలోచిస్తూ నవ్వుతూ ఉంటాడు. సామ్రాట్ వాళ్ళ బాబాయ్, చాలా రోజుల తర్వాత నవ్వుతున్నావు అని అనగా తులసి గారిలో నాకు అమాయకత్వం, అమ్మతనం, చిన్నపిల్లతనం, ఒక కాళికాదేవి అన్ని కనిపిస్తున్నాయి. హనీ నీ సొంత కూతురిలా చూసుకుంటున్నారు, పాతికేళ్లు ఇంట్లో బంధీగా ఉన్న సరే ఇప్పుడు బయటికి వచ్చి తన ప్రపంచం చూస్తూ బతకాలి అనుకుంటుంది.పక్క వాళ్ళ దగ్గర పైసా కూడా తీసుకోకుండా తన కాలు మీద నిలబడి కుటుంబానికి పోషిస్తుంది అని అంటాడు.
ఆ తర్వాత సీన్ లో పరంధామయ్య అనసూయ దగ్గరికి వెళ్లి ఎందుకు అనసూయ ఏం ఆలోచిస్తున్నావు అని అంటాడు. అప్పుడు అనసూయ తులసి సామ్రాట్ విషయాల్లో భయంగా ఉన్నది తులసిని నేను తప్పు పట్టట్లేదు కానీ సామ్రాట్ మీద నాకు అనుమానం ఉంది అని అంటుంది. అప్పుడు పరంధామయ్య అనసూయతో నీ కొడుకు నీ మనసులో విష బీజము నాటాడు అందుకే అలా అనిపిస్తుంది. తులసి ఇంకా చిన్నపిల్ల కాదు పెద్దదయింది మంచేదో చెడేదో తనకి తెలుస్తుంది అలాంటివన్నీ తను జాగ్రత్తగా చూసుకోగలదు అని అనసూయ కి ధైర్యం చెప్తాడు.
కానీ అనసూయ, మాత్రం ఎవరి భయాలు వాళ్ళు ఉంటాయి కదా భయపడడం నా తప్ప అని అనుకుంటుంది. అప్పుడు పరంధామయ్య ,తులసి మొహం చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నదో మన గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది మన కొడుకు దారి తప్పి ఉంకో అమ్మాయి వెనుక పడినప్పుడు కూడా మనం ఏమీ చేయలేకపోయాము కానీ తులసి అలాంటిది కాదు అని అంటాడు పరంధామయ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!