MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • దీపావళి 2024: ఈ ఐదు సినిమాల మధ్యే పోటీ, ఏది సూపర్ హిట్ అవుతుంది?

దీపావళి 2024: ఈ ఐదు సినిమాల మధ్యే పోటీ, ఏది సూపర్ హిట్ అవుతుంది?

. ఈ ఐదు చిత్రాల్లో గేమ్ ఛేంజర్, కంగువ సినిమాలపై భారీ బజ్ ఉంది. మరి వీటిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

3 Min read
Author : Surya Prakash
| Updated : Apr 16 2024, 12:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Diwali 2024

Diwali 2024


మనకు పెద్ద సినిమాలు రిలీజ్ అంటే వేసవి శెలవుల్లో అయినా ఉండాలి లేదా పండగ రోజుల్లో అయినా ఉంటాయి. అయితే  తెలుగు బాక్సాఫీస్ బాగా డల్ గా ఉంది. ఈ వేసవి కి చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రిలీజ్ లేక పూర్తి నీరసపడిపోయింది.  కేవలం డిజే టిల్లు స్క్వేర్ మాత్రమే సూపర్ హిట్​ తెచ్చుకుని కలెక్షన్స్ తెచ్చిపెట్టింది.  ఎంతో ఎక్సపెక్ట్ చేసిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అయ్యి కూర్చుంది. ఈ వారం రిలీజైన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా కూడా సేమ్ టు సేమ్. అలా  సమ్మర్ కాస్తా చప్పగా ముగిసిపోతోంది. దాంతో టాలీవుడ్ భారీ హిట్ కోసం మళ్లీ పండగ సీజన్ వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా కు వస్తుందనుకున్నాం. కానీ  దేవర కాస్తా దసరాకి వెళ్లిపోయింది.   ప్రభాస్ కల్కి అయినా రచ్చ రచ్చ చేసి వేసవిని ఒడ్డున పడేస్తుందనుకుంటే... ఎన్నికల పోలింగ్ ఉండటంతో  వాయిదా పడే అవకాశాలే ఉంది. కానీ దీపావళి మాత్రం మామూలుగా ఉండేటట్లు కనపడటం లేదు. దీపావళికి  ఐదు క్రేజీ సినిమాలు రెడీ అవుతున్నాయి. అవేంటో చూద్దాం. 
 

37


గేమ్ ఛేంజర్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టాప్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్​లో విడుదల కానుందని తెలుస్తోంది. అంటే ఈ దీపావళికి థియేటర్లో ముందగా చరణ్ సినిమానే కనిపించనుందన్నమాట. ఇప్పటికే సినిమాలోని ఓ పాటను కూడా విడుదల చేశారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్​గా నటిస్తోంది.
 

47


Kanguva, 

తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ కంగువ. సూర్య సినిమా అంటే తమిళంలోనే కాదు తెలుగు ప్రేక్షకులు ఎదురుచూడటం కలిసి వస్తుంది.  తమిళంలో పాటే తెలుగులోనూ సూర్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో  సూర్య కెరీర్​లోనే అత్యంత భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న సినిమా కంగువ. ఈ సినిమాకు సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ ఈ సినిమా మీద ఆసక్తి పెరిగేలా చేసింది. ఈ చిత్రంతో దిశా పటాని తమిళ పరిశ్రమ​కు పరిచయమవ్వనుంది. యానిమల్​తో విలన్​గా మెప్పించిన బాబీ దేఓల్ ఇందులో నెగటివ్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఈ మూవీ దీపావళికి విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

57


Vettaiyan

దీపావళికి థియేటర్లలోకి  వస్తున్నాడు రజనీకాంత్. జైలర్ సక్సెస్​తో మంచి ఊపు మీద ఉన్న రజనీ జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితీకా సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ దీపావళికి రాబోతున్న మరో పెద్ద చిత్రంగా ఈ సినిమాని లెక్కేస్తున్నారు. 

67


 Singham Again

ఇదిలా ఉంటే బాలీవుడ్​లోనూ దీపావళికి సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అలా ఈ సారి సింగం ఫ్రాంచైజీ నుంచి సింగం ఎగైన్ సినిమా వస్తుంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, కరీనా కపూర్, రణవీర్ సింగ్, దీపికా పదుకోణ్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ క్యాస్టింగ్ తో దీపావళికి భారీగా విడుదల కానుంది ఈ చిత్రం. ఈ ఫ్రాంచైజీ కు ప్రేక్షకుల్లో అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ మసాలా ఎంటర్‌టైనర్‌కి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

77


Bhool Bhulaiyaa 3

 అక్షయ్ కుమార్​కు మంచి గుర్తింపుని ఇచ్చిన భూల్ భులయ్యా ఫ్రాంచైజీ కార్తీక్ ఆర్యన్​కు కూడా మంచి హిట్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే ఫ్రాంచైజీ నుంచి ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి ఈ దీపావళి కానుకగా విడుదల కానుంది భూల్ భులయ్యా 3. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్​తో పాటు త్రిప్తి దామ్రీ, విద్యా బాలన్, మాధురి దీక్షిత్ నటించారు. ఈ హారర్ కామెడీ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్, త్రిప్తి డిమ్రి, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. రెండవ భాగానికి దర్శకత్వం వహించిన అనీస్ బాజ్మీ ఈ మూడో పార్ట్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image2
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Recommended image3
Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved