MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • టూత్ పేస్ట్ లు అమ్మి బ్రతికా, డైరెక్టర్‌తో ఒక రాత్రి గడిపితేనే సీరియల్ ఆఫర్!

టూత్ పేస్ట్ లు అమ్మి బ్రతికా, డైరెక్టర్‌తో ఒక రాత్రి గడిపితేనే సీరియల్ ఆఫర్!

తీరా అక్కడకి వెళ్ళాక.. నువ్వు డైరెక్టర్‌తో ఒక రాత్రంతా గడిపితే నీకు మంచి అవకాశం ఇస్తాడని ఒక వ్యక్తి చెప్పడంతో షాక్ తిన్నానని చెప్పుకొచ్చింది.

3 Min read
Author : Surya Prakash
Published : Apr 12 2024, 10:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కెరీర్ ప్రారంభంలో చాలా మంది జీవితాలు వేరుగా ఉంటాయి. అప్పట్లో సర్వైవల్ కోసం చాలా పనులు చేసినవాళ్లు కష్టపడి ఎదిగాక వాటిని గుర్తు చేసుకుంటారు. అదే విధంగా  హిందీతనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి దహియా. యే హై మొహబ్బతేన్ సీరియల్‌తో ఆమె ఫేమస్ అయింది. ప్రస్తుతం అదృశ్యం అనే సీరియల్‌లో నటిస్తోంది.  ఈ నేపధ్యంలో  ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన  దివ్యాంక తన కెరీర్‌ గురించి పలు ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో చాలా ఇ‍బ్బందులు పడినట్లు తెలిపింది. బతకడం కోసం చిన్న చిన్న పనులు చేశానని వెల్లడించింది. అలాగే తనను చాలా మంది ఎక్సప్లాయిట్ చేద్దామని ప్రయత్నించారని అని చెప్పుకొచ్చింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

దివ్యాంక మాట్లాడుతూ.. 'మన జీవితం గురించి మనమే ఆలోచించుకోవాలి. అలాగే  ప్రతి ఒక్కరూ మన లైఫ్ పై ఆశలు పెంచుకోవాలి. మన లక్ష‍్యం కోసం ఎప్పటికీ మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాగే ఎల్లప్పుడూ మన మనుగడ కోసం ఏదో ఒకటి చేయాలి. గతంలో నేను టూత్‌పేస్ట్‌ పెట్టెలను సేకరించి అమ్మేదాన్ని. వాటికి ఒక్కో బాక్స్‌కు రూపాయి ఇచ్చేవారు. అలా సేకరించిన వాటిని భద్రంగా దాచి చెత్త సేకరించే వారికి అమ్మాను. అలా డబ్బు సంపాదించి నా పెట్‌ డాగ్ కోసం ఆహారం, బిల్లులు చెల్లించేదాన్ని.

38

 అప్పట్లో నా సర్వైవల్ కోసం రూ. 2 వేలు వచ్చినా ఫర్వాలేదు. అలా నా రోజువారీ జీవితం ప్రారంభయ్యేది. ఎవరైనా సరే డబ్బు సంపాదన కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక మార్గాన్ని కనుగొనాలి' అంటూ సలహాలు ఇస్తోంది దివ్యాంక.  మరో ప్రక్క సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి  చాలా రకాలుగా తను ఎదుర్కొన్న అనుభవాలను చెప్పుకొచ్చింది. 
 

48

అప్పట్లో మీ టూ అంటూ దీనిపై గతంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమమే నడించింది. అయితే.. మీ టూ కన్నా ముందే తనకి క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని.. హిందీ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడిన దివ్యాంక తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఒక సీరియల్‌ లేదా షో పూర్తి చేశాక నటులకు అసలైన కష్టం మొదలవుతుందని.. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పింది.

58

తనకు కూడా అలాగే ఒకసారి బిల్స్‌, ఈఎమ్‌ఐ కూడా కట్టలేని స్థితిలో.. చేతిలో డబ్బుల్లేక ఇంకా సరైన ఆఫర్లు రాక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న సమయంలో ఒక ఆఫర్‌ వచ్చిందని.. తీరా అక్కడకి వెళ్ళాక.. నువ్వు డైరెక్టర్‌తో ఒక రాత్రంతా గడిపితే నీకు మంచి అవకాశం ఇస్తాడని ఒక వ్యక్తి చెప్పడంతో షాక్ తిన్నానని చెప్పుకొచ్చింది.
 

68

నైట్  ఆఫర్స్‌ ఇచ్చేవారు ఇండస్ట్రీలో ఇదంతా సర్వసాధారణం అని మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారని.. వాళ్లు మన కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరింపులకు దిగుతారని.. అయితే, మీరు దానికి అంగీకరించకపోతే కెరీర్‌లో పెద్దగా నష్టపోయేదేమీ ఉండదని.. తాను కూడా వారి ఆఫర్లకు, బెదిరింపులకు లొంగకుండా.. ఆ అంశాన్ని కూడా సీరియస్‌గా తీసుకోకుండా తనపని తాను చేసుకుంటూ వెళ్లిపోయానని చెప్పింది.

78

న‌న్నె ఎందుకిలా అడుగుతున్నార‌ని నేను ప్ర‌శ్నిస్తే.. నువ్వు తెలివైన దానివ‌న్నారు. అలాంటి వాళ్లు ఇండ‌స్ట్రీలో చాలా మంది ఉంటారు. వాళ్లు ఇండ‌స్ట్రీలో ఇవ‌న్నీ కామ‌న్ అని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తారు. ఒక‌వేళ మ‌నం ఒప్పుకోక‌పోతే మ‌న కెరీర్‌ను నాశ‌నం చేస్తామ‌ని బెదిరిస్తారు. కానీ వాళ్ల ఆఫ‌ర్స్‌ను ఒప్పుకోక‌పోతే జ‌రిగే న‌ష్టం ఏమీ ఉండ‌దు. మ‌న ప్ర‌తిభ‌ను న‌మ్ముకుంటేనే అవ‌కాశాలు వ‌స్తాయి’’ అని తెలిపారు దివ్యాంక. 

88

ఇక దివ్యాంక ప్రస్తుతం బాలీవుడ్‌ బుల్లితెరపై అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిమణుల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం దివ్యాంక ఈజాజ్ ఖాన్ సరసన అదృష్టమ్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈమె ‘బనూ మై తేరీ దుల్హన్, యే హై మొహబతే వంటి సీరియ‌ల్స్‌లో న‌టించారు. అలాగే ఖత్రోంకి ఖిలాడిలో రన్నరప్‌గా నిలిచారు.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ
Recommended image2
Agnipariksha: అగ్నిపరీక్ష కంటెస్టెంట్లు ఫైనల్‌.. బిగ్‌ బాస్‌ హౌజ్‌కి వెళ్లే కామనర్స్ వీళ్లే?
Recommended image3
Horror Movies: ఈ 5 సినిమాలు చూస్తే రాత్రి ఒంటరిగా నిద్రపోవడం కష్టమే.. ఒక్కో సీన్‌కి వణుకు పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved