- Home
- Entertainment
- 42 ఏళ్ల క్రితం 4 కోట్లు కలెక్ట్ చేసిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కెరీర్ ను మలుపుతిప్పిన మూవీ ఏదో తెలుసా?
42 ఏళ్ల క్రితం 4 కోట్లు కలెక్ట్ చేసిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కెరీర్ ను మలుపుతిప్పిన మూవీ ఏదో తెలుసా?
చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలెన్నో ఉన్నాయి. కానీ చిరును మెగాస్టార్ గా మార్చిన సినిమా ఏదో తెలుసా? 42 ఏళ్ల క్రితమే 4 కోట్లు వసూలు చేసిన మూవీ ఏది?

చిరంజీవి రేంజ్ ను మార్చేసిన సినిమా
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు చిరంజీవి. ఎంతో కష్టపడి మెగాస్టార్ రేంజ్ ను చేరుకున్నాడు. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు చిరంజీవి. ఆయన కెరీర్ లో లాండ్ మార్క్ మూవీస్ ఎన్నో ఉన్నాయి. కానీ చిరంజీవి కెరీర్ ను సెట్ చేసిన సినిమాగా ఖైదీ నిలిచింది. చిరంజీవి కెరీర్ కే కాదు.. తెలుగు సినీ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిన సినిమా ఖైదీ. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ కల్ట్ క్లాసిక్ సినిమాను కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. ఈసినిమా తరువాత చిరంజీవి రేంజ్ మారిపోయింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో స్టేటస్ ను దక్కించుకున్నారు చిరు.
ఖైదీ సినిమా రిలీజ్ అయ్యి 42 ఏళ్ళు..
చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన ఖైదీ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 42 ఏళ్లు పూర్తయ్యింది. 1983 అక్టోబర్ 28న విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా ప్రపంచంలో కొత్త ట్రెండ్ కు నాంది పలికింది. ఈ స్పెషల్ అకేషన్ ను పురస్కరించుకుని చిరంజీవి టీమ్ విడుదల చేసిన ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “తెలుగు సినిమా చరిత్రలో మార్పు తీసుకొచ్చిన పేరు ఖైదీ” అంటూ ప్రారంభమైన ఆ వీడియో అభిమానులను మరోసారి 40 ఏళ్లు వెనక్కి తీసుకెళ్ళింది. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది.
ఖైదీ సినిమా వెనుక కథలెన్నో
‘ఖైదీ’ సినిమా ఒక బ్లాక్‌బస్టర్ హిట్‌గా మాత్రమే కాకుండా, టాలీవుడ్‌లో యాక్షన్ సినిమాల రూపాన్ని పూర్తిగా మార్చేసిన గేమ్‌ఛేంజర్‌గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి స్టార్‌డమ్ ఆకాశాన్ని తాకింది. మెగాస్టార్ కు మాస్ ఆడియన్స్ ను దగ్గర చేసిన సినిమా కూడా ఇదే. అంతే కాదు ఈసినిమా వెనుక ఇంట్రెస్టింగ్ కథలు చాలా ఉన్నాయి. ఖైదీ సినిమాను ముందుగా సూపర్‌స్టార్ కృష్ణ కోసం సిద్ధం చేశారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోవడంతో ఆ అవకాశం చిరంజీవికి దక్కింది. మొదట ఈ చిత్రానికి దర్శకుడిగా కె. రాఘవేంద్రరావు పేరును పరిశీలించినా, కొన్ని కారణాల వల్ల అది కోదండరామిరెడ్డి చేతికి వెళ్లింది.
హాలీవుడ్ సినిమా స్పూర్తితో..
హాలీవుడ్ సినిమా ‘ఫస్ట్ బ్లడ్’ స్ఫూర్తితో ఈ కథను పరుచూరి బ్రదర్స్ రాసుకున్నారు. అయితే కృష్ణను దృష్టిలో పెట్టుకుని వారు రాసిన ఈ కథ.. మాటలు, చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కి సరిగ్గా సరిపోయాయి. దాంతో మెగాస్టార్ సక్సెస్ కొట్టగలిగారు. ఇంకో విషయం ఏంటంటే.. ఖైదీ కథను చిరంజీవి పూర్తిగా వినలేదట., పరుచూరి బ్రదర్స్ మీద నమ్మకంతో ఈసినిమా చేయడానికి ఒకే చెప్పారని తెలుస్తోంది. ఇక షూటింగ్ స్టార్ట్అయిన తరువాత ఈసినిమా కథను పూర్తిగా విన్నారట మెగాస్టార్.
42 ఏళ్ళ క్రితం ఖైదీ కలెక్షన్స్
25 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఖైదీ సినిమా రిలీజ్ కు ముందే 70 లక్షల బిజినెస్ చేసింది. విడుదల తరువాత బాక్సాఫీస్ వద్ద సుమారు 4 కోట్లు వసూలు చేసి ఆ కాలంలో ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈసినిమాకు చిరంజీవి 1.75 లక్షల రెమ్యునరేషన్ తీసుకుకోగా దర్శకుడు కోదండరామిరెడ్డి 40 వేల మాత్రమే తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఖైదీ సినిమా ఎంత హిట్ అయ్యిందంటే.. దాదాపు 20 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో 365 రోజులు పూర్తి చేసుకుంది సినిమా. ఇక ఈసినిమా 100 రోజుల వేడుకకు సూపర్‌స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసినిమాను జితేంద్ర హీరోగా బాలీవుడ్ లో రీమేక్ చేయగా.. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మూవీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన ఖైదీ సినిమా రిలీజ్ అయ్యి 42 ఏళ్లు అవుతున్నా.. అభిమానుల గుండెల్లో మాత్రం అలాగే నిలిచిపోయింది.