- Home
- Entertainment
- భయం నా బ్లడ్‌లోనే లేదు.. మీరు తోపు అని ఎవరూ అనలేదు, దివ్వెల మాధురిని ఆడుకున్న శివన్న
భయం నా బ్లడ్‌లోనే లేదు.. మీరు తోపు అని ఎవరూ అనలేదు, దివ్వెల మాధురిని ఆడుకున్న శివన్న
దివ్వెల మాధురి ఎనిమిదో వారం ఎలిమినేట్ అయితే విషయం తెలిసిందే. ఆమెని ప్రశ్నలతో ఆడుకున్నాడు శివన్నా. అంతేకాదు ఆయనకు కూడా కౌంటర్లతో ఝలక్ ఇచ్చింది మాధురి.

బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్ నుంచి దివ్వెల మాధురి ఎలిమినేట్
ఫైర్ బ్రాండ్ అంటూ బిగ్ బాస్ తెలుగు 9 షోకి వెళ్లిన దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చిన మూడో వారంలోనే బయటకు వచ్చింది. ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా మాధురి బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నామినేషన్‌లోకి వచ్చిన మొదటి సారే ఆమె హౌజ్‌ని వీడాల్సి వచ్చింది. దివ్వెల మాధురికి రాజకీయాల్లో మంచి క్రేజ్ ఉంది. వెనకాల దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయినా ఆమె ఫస్ట్ లోనే ఎలిమినేట్ కావడం ఆశ్చర్యపరుస్తోంది. ఎనిమిదో వారం(ఈ ఆదివారం) దివ్వెల మాధురి బిగ్ బాస్ తెలుగు 9 షో నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
వచ్చీ రావడంతోనే మాధురికి ప్రశ్నల బుల్లెట్స్
దువ్వాడ మాధురి ఎలిమినేషన్ అనంతరం బిగ్ బాస్ బజ్‌లో శివన్నతో మాట్లాడింది. ఇందులో మాధురినీ ఒక రేంజ్‌లో ఆడుకున్నారు శివాజీ. ఆమెని ప్రశ్నించమని ఐదారు పేజీల ప్రశ్నలు వచ్చాయని చెప్పారు. అనంతరం ఆమె ఎలిమినేషన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. అవి ప్రశ్నలు కాదు బుల్లెట్లు అని చెప్పాలి. మాధురి ఎంత బోల్డ్ గా ఉంటుందో, వాటిని మించిన బోల్డ్ గా శివన్న ప్రశ్నలున్నాయి. రావడం రావడంతోనే మీ పేరు మాధవినా, మాధురినా అంటూ సెటైర్ వేశారు. మాధురి అని చెప్పింది. ఇదే విషయం హౌజ్ పేరు అడిగిన అమ్మాయికి చెప్పొచ్చు కదా అన్నాడు. నా ఇష్టం అంటూ నాకు నచ్చితేనే చెబుతానని కౌంటర్ ఇచ్చింది.
మీరు తోపు అని ఎవరూ అనలేదు
వంద శాతం మీరు తెలుగు ఇళ్లల్లోకి వెళ్లాలనుకున్నారు? అని ప్రశ్నించగా, వెళ్లాను అని చెప్పింది మాధురి, వెళితే ఇంత త్వరగా ఎందుకు వస్తారని ప్రశ్నించగా, నేను రావాలని అనుకున్నాను కాబట్టి వచ్చాను, నాకు యాక్టింగ్ రాదు, మాస్క్ లు లేనే లేవు, ఎలా ఉండాలో అలానే ఉన్నా అని మాధురి వెల్లడించగా, ఆ విషయం ఎవరూ అడగలేదే అని కౌంటర్ ఇచ్చాడు శివాజీ. అనంతరం బిగ్ బాస్ లో ఎంత తోపులైనా సరే అని శివాజీ ఇంకా చెప్పబోతుండగా, మధ్యలో కల్పించుకుని ఇప్పుడెవరూ తోపులు అనుకోవడం లేదు, నేను తోపు అనుకోవడం లేదు అని మాధురి అనగా, నేను మీ గురించి కాదు, మీరు తోపు అని ఎవరూ అనలేదంటూ సెటైర్లు వేశారు శివాజీ.
దువ్వాడ శ్రీనివాస్ బర్త్ డే కోసం బయటకు వచ్చాను
బయట అయితే జుట్టు పట్టుకుని ఈడ్జి కొడతారు, ఎలా కొడతారండి? అంటూ శివాజీ ప్రశ్నించగా, ఆమె దానికి కౌంటర్ సమాధానం ఇచ్చింది. ఈ విధంగా మాట్లాడితే ఆడియెన్స్ ఉండనిస్తారా? అని శివాజీ ప్రశ్నించగా, ఉండనిస్తారా ఉండనివ్వరా అంటే నేను ఆడియెన్స్ ప్రకారమే మాట్లాడాలంటే కుదరదు, నేను అలా ఉండలేను అనేలా సమాధానం చెప్పింది మాధురి. దీనికి శివాజీ రియాక్ట్ అవుతూ, మీరు అందుకే బయటకు వచ్చారని చెప్పడంతో నేను వెళ్లాలనుకున్నాను వెళ్లాను, రావాలనుకున్నాను, వచ్చాను అని చెప్పింది మాధురి. ఓడిపోయాక నేను కావాలనే ఓడిపోయానంటే ఎలాగండీ అంటూ కౌంటర్ ఇచ్చాడు శివాజీ. ఎందుకు రావాలనుకున్నారని ఆయన ప్రశ్నించగా, నవంబర్ 4న దువ్వాడ శ్రీనివాస పుట్టిన రోజు ఉంది. అందుకోసమే ఎలిమినేట్ అయినట్టు చెప్పింది. మరి ఇంత త్వరగా రావాలనుకున్నప్పుడు వెళ్లడం ఎందుకు? ఆయన సెలబ్రేషన్ ఉందని ముందే తెలుసు కదా అని ప్రశ్నించారు. తాను ఎక్స్ పీరియెన్స్ చేయడానికి వెళ్లినట్టు చెప్పింది మాధురి.
భయం నా బ్లడ్‌లోనే లేదు
కూర్చొండి మాట్లాడదాం అనడం తప్పా అని శివాజీ ప్రశ్నించగా, ఆ మాట అనడం తప్పా అంటూ రివర్జ్ ఎటాక్ కి దిగింది మాధురి. మీరు మాట్లాడే ప్రతి మాట భయపెట్టేలా ఉందని శివన్న అనగా, `మీకా` అని మాధురి రియాక్ట్ అయ్యింది. దీనికి ఆయన స్పందిస్తూ, అమ్మా నాకు కాదు, లోపల ఉన్న శ్రీనివాస సాయికి అని చెప్పాడు. ఓ దశలో మాధురి శ్రీజకి భయపడినట్టు అనిపించిందని శివన్న ప్రశ్నించగా, భయం అనేది బ్లడ్‌లోనే లేదని మాధురి చెప్పడం విశేషం. తాజాగా విడుదలైన ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. దివ్వెల మాధురి హౌజ్‌లోనూ రియాలిటీగానే ఉంది. ఆమె బయట ఎలా ఉంటుందో అలానే ఉందనిపించింది. కాకపోతే ఆమె ప్రవర్తనే తీసుకునేలా లేదని, అందుకే ఆమె ఎలిమినేట్ అయ్యిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.