ఉదయ్ కిరణ్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో నాకు తెలుసు.. బాంబు పేల్చిన డైరెక్టర్ తేజ
ఉదయ్ కిరణ్ జీవితం ఎంతటి విషాదకరంగా ముగిసిందో అందరికీ తెలుసు. ఒకప్పుడు టాలీవుడ్ లో ప్రేమ కథా చిత్రాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఉదయ్ కిరణ్ మాత్రమే.

ఉదయ్ కిరణ్ జీవితం ఎంతటి విషాదకరంగా ముగిసిందో అందరికీ తెలుసు. ఒకప్పుడు టాలీవుడ్ లో ప్రేమ కథా చిత్రాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఉదయ్ కిరణ్ మాత్రమే. వరుస విజయాలు అందుకుంటూ లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ మరణించి 8 ఏళ్ళు గడుస్తోంది. కానీ ఇప్పటికీ చాలా మందిని ఆ విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.
ఉదయ్ కిరణ్ గురించి ఎవరు మాట్లాడినా ఎమోషనల్ అవుతుంటారు. చిత్రం మూవీతో డైరెక్టర్ తేజ ఉదయ్ కిరణ్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఆయా తర్వాత నువ్వు నేనుతో మరో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. మనసంతా నువ్వే లాంటి చిత్రంతో ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు.
ఆ తర్వాత ఎదురైనా పరాజయాలతో ఉదయ్ కిరణ్ కెరీర్ లో డౌన్ ఫాల్ మొదలైంది. చివరకి 2014లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఉదయ్ కిరణ్ సూసైడ్ పై ఇప్పటికి అనేక రూమర్స్ ఉన్నాయి. అయితే స్పష్టమైన కారణాలు ఎవరికీ తెలియదు.
ఉదయ్ కిరణ్ గురించి డైరెక్టర్ తేజకి బాగా తెలుసు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి కామెంట్స్ చేస్తుంటారు. కానీ స్పష్టమైన కారణాలు ఎవరికీ తెలియదు. అయితే ఉదయ్ కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో నాకు తెలుసు.
ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు నేను ఫోన్ లో మాట్లాడాను. చాలా విషయాలు చెప్పాడు. ఉదయ్ కిరణ్ ఎలాంటి తప్పు చేయలేదు. కాకపోతే ఉదయ్ కిరణ్ కి ధైర్యం లేదు అని తేజ అన్నారు. తాను చనిపోయేలోపు ఆ విషయాలు బయట పెడతానని బాంబు పేల్చారు. దీనితో మరోసారి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి చర్చ మొదలయింది.
ప్రస్తుతం డైరెక్టర్ తేజ రానా దగ్గుబాటి సోదరుడు దగ్గుబాటి అభిరామ్ తో అహింస అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. అభిరామ్ కి ఇది డెబ్యూ మూవీ. రానాకి తేజ నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో ఒక విజయం అందించాడు. ఇప్పుడు అతని సోదరుడికి విజయాన్నిఅందించే పనిలో ఉన్నారు.