ప్రభాస్ రీమేక్ చేద్దాం అన్నాడు.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సంచలన కామెంట్స్
సందీప్ రెడ్డి వంగ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. ఆయన ప్రభాస్ గురించి చేసి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Prabhas
కేవలం మూడు సినిమాలతో ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ యానిమల్ భారీ విజయం సాధించింది. ఈ చిత్ర కంటెంట్ పై తీవ్ర విమర్శలు వినిపించాయి.
Prabhas
అయినప్పటికీ ప్రేక్షకులు ఆదరించారు. రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ మూవీ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2023లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
Prabhas
యానిమల్ కి సీక్వెల్ గా సందీప్ రెడ్డి వంగ యానిమల్ పార్క్ ప్రకటించారు. అది త్వరలో కార్యరూపం దాల్చనుంది. అలాగే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే మూవీ ప్రకటించాడు. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయనున్నాడు.
Prabhas
స్పిరిట్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో ఈ మూవీ షూటింగ్ జరుపుకోనుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలతో స్పిరిట్ తెరకెక్కిస్తానని సందీప్ రెడ్డి వంగ అన్నారు. కాగా తాజా ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రభాస్ ఓ చిత్ర రీమేక్ చేద్దామని సందీప్ రెడ్డి వంగతో అన్నారట.
Prabhas
బాలీవుడ్ లో విజయం సాధించిన ఓ చిత్రాన్ని రీమేక్ చేద్దామని ప్రభాస్ అడిగారట. అందుకు సందీప్ రెడ్డి వంగ ఒప్పుకోలేదట. ప్రభాస్ ఆఫర్ ని ఆయన రిజెక్ట్ చేశాడట. మరి ప్రభాస్ రీమేక్ చేద్దామన్న ఆ చిత్రం ఏమిటో సందీప్ రెడ్డి వంగ చెప్పలేదు..